ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ
ద్వైపాక్షిక సంబంధాలను మరింత ధృడతరం చేసుకోవడానికి కలిసి పనిచేద్దామన్న డేవిడ్ లామీ
భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్న బ్రిటన్ పీఎం
సర్ కియిర్ స్టార్మెర్ ను ప్రశంసించిన ప్రధాని మోదీ
సాంకేతిక భద్రత విషయంలో కుదిరిన అవగాహనను స్వాగతించిన ప్రధాని మోదీ
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్ష
బ్రిటన్ ప్రధాని సర్ స్టార్మెర్ ను భారత పర్యటనకు ఆహ్వానించిన ప్రధాని మోదీ
Posted On:
24 JUL 2024 8:00PM by PIB Hyderabad
బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. విదేశాంగ మంత్రిగా నియమితులైన సందర్భంగా లామీని ప్రధాని అభినందించారు. యూకేలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే భారతదేశాన్ని సందర్శించుటకు చొరవ చూపిన లామీని మోదీ ప్రశంసించారు.
యూకే ప్రధానమంత్రి సర్ స్టార్మెర్‌తో తన ఇటీవలి సంభాషణను ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి యూకే ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ప్రశంసనీయమన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ధృడపరుచుకునేందుకు కలిసి పని చేయడం పట్ల తమ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
ఆర్థిక రంగం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వాతావరణ మార్పులు సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం పట్ల యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ ఆసక్తి వ్యక్తం చేశారు.
***
(Release ID: 2049964)
Visitor Counter : 31