ఉక్కు మంత్రిత్వ శాఖ
సంస్థ పునరుద్ధరణకు కలసికట్టుగా కృషి చేద్దాం: ఆర్ఐఎన్ఎల్ సీఎండీ
Posted On:
29 AUG 2024 10:36AM by PIB Hyderabad
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) పునరుద్ధరణకు సంస్థ యాజమాన్యంతో పాటు ఉద్యోగులు, కార్మిక సంఘాలు, కార్యనిర్వాహకులు ఉమ్మడిగా కృషి చేయాలని సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శ్రీ అతుల్ భట్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని సంస్థ ప్రధాన సభాభవనంలో ఆయన వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... కంపెనీ ప్రస్తుత స్థితిగతులను వారికి వివరించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు అన్ని విధాల వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టవలసిన అవసరం ఉందని సీఎండీ స్పష్టం చేశారు.
సంస్థ నాయకత్వ బృందంలో ముఖ్య సభ్యులు ఈ సమావేశంలో పాలుపంచుకొన్నారు. వారిలో ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (ప్రాజెక్టులు), అడిషనల్ చార్జ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎ.కె. బాగ్ చి, డైరెక్టర్ (సిబ్బంది) శ్రీ ఎస్.సి. పాండే; డైరెక్టర్ (ఆర్థిక వ్యవహారాలు) శ్రీ సి.హెచ్.ఎస్.ఆర్.వి.జి.కె. గణేశ్, డైరెక్టర్ (వాణిజ్య వ్యవహారాలు) శ్రీ జి.వి.ఎన్. ప్రసాద్ లతో పాటు సీజీఎమ్ లు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
(Release ID: 2049699)
Visitor Counter : 58