వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవల గమ్యస్థానం, ఫార్మా రంగంలో ఆధిపత్యం : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద


ఫార్మా, ఆరోగ్య సంరక్షణపై అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించిన శ్రీ జితిన్ ప్రసాద

प्रविष्टि तिथि: 28 AUG 2024 5:09PM by PIB Hyderabad

ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవల్ని అందుబాటు ధరల్లో  అందించే గమ్యస్థానంగాప్రపంచ ఫార్మా అగ్రగామిగా భారతదేశం అవతరించిందని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్మా ఎక్స్ పోర్టు  ప్రమోషన్ కౌన్సిల్ (కాపెక్సిల్) వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోన్న మూడు రోజుల అంతర్జాతీయ ఫార్మాఆరోగ్య సంరక్షణ  ప్రదర్శన (ఐఫెక్స్ 2024) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ స్థాయి సంరక్షకుడిగా ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు.

ఫార్మా పరిశ్రమ ఎగుమతులను పెంచాలనివృద్ధి సాధించేందుకు కొత్తగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారతదేశం ఇప్పటికే 'ప్రపంచ స్థాయి ఫార్మసీ'గా గుర్తింపు పొందిందని అన్నారు. జనరిక్ రంగంలో మన బలాబలాలపై దృష్టి పెట్టడమే కాకుండా.. పాత, కొత్త సంబంధాలను కాపాడుకోవటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఉత్పత్తుల అభివృద్ధికి ప్రయత్నించడంకొత్త శిఖరాలను అదిరోహించటం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

నవకల్పననాణ్యత  అంశాలపై పరిశ్రమ దృష్టి సారించాలనిప్రపంచ మార్కెట్‌తో కలిసి పనిచేయాలని మంత్రి కోరారు. 'అంతర్జాతీయ పోటీతత్వం చాలా ముఖ్యం. కొత్త పరిణామాలుమంచి తయారీ పద్ధతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం" అని వ్యాఖ్యానించారు. వైద్యపరికాలు, సాఫ్ట్ వేర్ తయారీల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాకల (పీఎల్ఐ) పథకం వంటి వాటిని ప్రభుత్వం తీసుకుస్తోందని తెలిపారు.


ప్రపంచ స్థాయి దిగ్గజాలతో కలిసి దేశీయ పరిశ్రమలు అనుసంధానం కావడానికీ, వ్యాపారం చేసుకోవడానికీ- ఈ మూడు రోజుల ఫార్మా ప్రదర్శన- ఐఫెక్స్ ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుందన్నారు. కొత్త సరఫరాదారుల కోసం చురుకుగా చూస్తున్న లేదా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోన్న కొత్తపాత వినియోగదారులను కలవడానికి ఇది మీకు అవకాశాన్ని అందిస్తుంది” అని వ్యాఖ్యానించారు.

***


(रिलीज़ आईडी: 2049619) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil