హోం మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీ లో రేపు జరిగే బిపిఆర్&డి 54వ స్థాపక దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హోం - సహకార శాఖల కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా
‘‘నేరాల సంబంధిత నూతన చట్టాలు - పౌర ప్రధాన సంస్కరణలు’’ విషయంపై డాక్టర్ ఆనంద్ స్వరూప్ గుప్త స్మారకోపన్యాసాన్ని ఇవ్వనున్న హోం మంత్రి
2023, 2024 సంవత్సరాలలో విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం (పిఎస్ఎమ్) తో పాటు ప్రతిభావంతమైన సేవకు రాష్ట్రపతి పతకం (ఎమ్ఎస్ఎమ్) స్వీకర్తలను సన్మానించనున్న శ్రీ అమిత్ షా
నేరాలకు సంబంధించిన కొత్త చట్టాలపై బిపిఆర్ & డి తీసుకు వచ్చిన ‘‘ఇండియన్ పోలీస్ జనరల్’’ ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్న హోం మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, హోం మంత్రి మార్గదర్శకత్వంలో పయనిస్తూ పోలీసింగ్, దేశ ఆంతరంగిక భద్రత విధుల నిర్వహణలో సవాళ్ళకు ఎదురొడ్డడానికి పోలీసు బలగాలను ‘స్మార్ట్’ (SMART) తరహా లో తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్న బిపిఆర్&డి
प्रविष्टि तिथि:
27 AUG 2024 10:12AM by PIB Hyderabad
కేంద్ర హోం శాఖ - సహకార శాఖ ల మంత్రి శ్రీ అమిత్ షా న్యూ ఢిల్లీ లో రేపు (బుధవారం) జరుగనున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్ & డి) 54వ స్థాపక దినోత్సవాలకు ముఖ్య అతిథి గా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా
‘‘నేరాలకు సంబంధించిన కొత్త చట్టం - పౌరులను కేంద్ర స్థానం లో నిలుపుతూ తీసుకు వచ్చిన సంస్కరణలు’’ విషయం పై డాక్టర్ ఆనంద్ స్వరూప్ గుప్త స్మారకోపన్యాసాన్ని హోం మంత్రి ఇవ్వనున్నారు. 2023, 2024 సంవత్సరాలలో ‘విశిష్ట సేవకు గాను రాష్ట్రపతి పతకం (పిఎస్ఎమ్)’ తో పాటు ‘ప్రతిభావంతమైన సేవకు రాష్ట్రపతి పతకం (ఎమ్ఎస్ఎమ్)’లను స్వీకరించిన వారిని శ్రీ అమిత్ షా సత్కరిస్తారు. కొత్త నేర సంబంధిత చట్టాలపై బ్యూరో ప్రచురించిన ‘‘ఇండియన్ పోలీస్ జర్నల్’’ ప్రత్యేక సంచికను కూడా హోం మంత్రి ఇదే కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించనున్నారు.
పోలీసు విభాగం విధులతో పాటు దేశ ఆంతరంగిక భద్రత సంబంధిత విధుల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ళను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, అలాగే కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో విజయవంతంగా పరిష్కరించడానికి గాను మేధోపరమైన, భౌతికపరమైన, సంస్థాగతమైన వనరులను పోలీసు బలగాలకు సమకూర్చడం ద్వారా పోలీసు బలగాలను ‘స్మార్ట్’ (SMART) కోవకు చెందిన బలగాలుగా తీర్చిదిద్దడానికి బిపిఆర్&డి కట్టుబడి ఉంది.
బిపిఆర్&డి ని 1970లో ఏర్పాటు చేసినప్పటి నుంచి, రక్షక భట వృత్తిలో ఉత్కృష్టతను పెంచడానికి ఒక మేధావి వర్గంలా బిపిఆర్&డి సేవలను అందిస్తూ వస్తోంది. పోలీసు సంబంధిత సేవలు, దిద్దుబాటు ప్రధానంగా ఉండే తరహా సేవల కై ఉద్దేశించిన విధానాలను, కార్యసరళులను అభివృద్ధి పరచడంపైన, పౌరులకు ఇప్పటి కన్నా ఎక్కువగా సేవలను అందించడానికి అనువైన సాంకేతికతలను ప్రవేశపెట్టే అవకాశాలను వెతకడం పైన, చట్టాలను అమలు పరచే ఏజెన్సీల సామర్థ్యం పెంపుదలపైన, కేంద్రీయ పోలీసు సంస్థలకు, రాష్ట్రాలకు మధ్య సహకారం, సమన్వయాలను పెంచడంపైన దృష్టిని కేంద్రీకరించడం ఈ సంస్థకు అప్పగించిన బాధ్యతలలో భాగంగా ఉన్నాయి.
ప్రతిపాదిత ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్ స్) డైరెక్టర్ జనరల్, కేంద్రీయ పోలీసు సంస్థల అధిపతులతో పాటు హోంత్రి మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు.
***
(रिलीज़ आईडी: 2049161)
आगंतुक पटल : 102