ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జాతీయ ఫోరెన్సిక్ శాస్ర్తాల విశ్వ‌విద్యాల‌యం, గాంధీన‌గ‌ర్ లో ఉప‌ రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగ పాఠం

Posted On: 23 AUG 2024 4:42PM by PIB Hyderabad

నేడు మీ అంద‌రి ముందుకు రావ‌డం ప్ర‌త్యేక గౌరవంగా భావిస్తున్నానుఈ విశ్వ‌విద్యాల‌యానికి నేను రావ‌డం ఇదే ప్ర‌థ‌మంప్ర‌పంచ మాన‌వాళిలో ఆరో వంతు జ‌నాభా ఉన్న దేశంలోఒక రాష్ర్టంలో ఇన్నోవేటివ్ గా ప‌డిన అడుగు కావ‌డం వ‌ల్ల దీనిపై నేను దీర్ఘ‌కాలికంగా ఆలోచిస్తూనే ఉన్నానుఈ అగ్ర‌గామి సంస్థ స‌రిహ‌ద్దులు దాటి విస్త‌రించిందిప్రతిభ పరంగాఫోరెన్సిక్ సైన్సు రంగంలో దీనిని ఒక దీప‌శిఖ‌గా చెప్ప‌వ‌చ్చునేర‌చ‌ట్టాల ప‌రిధిని దాటి ఇది విస్త‌రించింది.

జాతీయ భ‌ద్ర‌త‌న్యాయంఅభివృద్ధిపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూప‌గ‌ల జ్ఞానాన్ని అంద‌రికీ పంచాల‌న్న ఆస‌క్తీముందుచూపు గ‌ల విద్యావేత్త‌లుచైతన్యశీలురు అయిన మీ ముందు ప్ర‌సంగించ‌డం ఆనందాన్ని ఇస్తోందిఫోరెన్సిక్ శాస్ర్తం అంటే అందరూ అనుకుంటున్న‌ట్లుగా కేవ‌లం సాంకేతిక ప్రాధాన్యంగ‌ల విభాగం మాత్రమే కాదుస‌త్యానికీన్యాయానికీ మూల స్తంభం.

ఇది మనకు ఏం చెబుతుందిఅభిప్రాయాల క‌న్నా ఆధారాలు ముఖ్యమనీఅవాస్తవాలపై వాస్త‌వాల‌దే విజ‌య‌మ‌నీ మనకు తేటతెల్లం చేస్తుందిఫోరెన్సిక్ శాస్ర్తాలే లేకుంటే దేశంలో నేరన్యాయ వ్య‌వ‌స్థ ప‌రిస్థితి ఏమిటో ఊహించండిన్యాయానికి శిక్ష పడుతుంది.

ఇక అలాంటి ప్రమాదం లేదుఫోరెన్సిక్ శాస్ర్తం దోషుల‌ను శిక్షించేలా చూస్తుందిఅమాయ‌కుల‌ను రక్షిస్తుందిఅత్యాధునిక వ్య‌వ‌స్థ‌లుఅత్యాధునిక ప‌రిశోధ‌నా వ‌స‌తులుఅంకిత భావం క‌లిగిన నిపుణులు క‌లిగిన ఈ సంస్థస‌మాజంలో స‌త్యానికి సంర‌క్ష‌కులైన కొత్త త‌రం ఫోరెన్సిక్ నిపుణుల‌ను త‌యారు చేస్తుందిస‌త్యాన్ని కాపాడుకోలేకపోతేక్రిమిన‌ల్ న్యాయ వ్య‌వ‌స్థ కూలిపోతుందిఅందుకే ఫోరెన్సిక్ శాస్ర్త విభాగంలో ఉన్న మీరంతా అంతిమ దోషుల‌ను గుర్తించ‌డంలో స‌హాయ‌కారిగా నిల‌వాలి.

ఈ విశ్వవిద్యాల‌య ప్రాధాన్య‌త విద్యాప‌రంగా నైపుణ్యాలు సాధించ‌డానికే ప‌రిమితం కాదుఅన్ని కోణాల్లోనూ న్యాయాన్ని కాపాడాల‌న్న జాతి క‌ట్టుబాటుకు ఇది చ‌క్క‌ని ప్ర‌తీక‌వాస్త‌వం చెప్పాలంటే మీరంతా మ‌రో కోణంలో న్యాయ విద్యార్థులే.

ఈ విశ్వ‌విద్యాల‌యం మ‌న రాజ్యాంగ పీఠిక కీర్తిని నిల‌బెట్ట‌డానికి కృషి చేస్తోందిదానికి ఉన్న మూడు కోణాలు కూడా మాన‌వ‌త‌మాన‌వ అస్తిత్వాన్ని కాపాడ‌డంలో కీల‌కంగా ప‌ని చేస్తాయినా యువ మిత్రులారాఇక్క‌డ మీరు నేర్చుకునే నైపుణ్యాలు నేర ద‌ర్యాప్తుజాతీయ భ‌ద్ర‌త‌పౌర వివాదాలు వంటి సంక్లిష్ట‌మైన స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో వృత్తి నిపుణులుగా మిమ్మ‌ల్ని తీర్చి దిద్దుతాయి.

మీరు ఎంచుకున్న రంగం ఎంతో కీలకంఎందుకంటేఫోరెన్సిక్ శాస్ర్తం న్యాయవ్యవస్థపై మన పౌరులకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచుతుందిన్యాయాన్ని అందించలేకపోవడానికి మించిన పతనం సమాజానికి మరొకటి ఉండదుఫోరెన్సిక్ సైన్సు లేకుండాఈ సమస్యను అధిగమించడం అసాధ్యం.

ఫోరెన్సిక్ సైన్స్ అనేది నేర‌స్థుల‌ను న్యాయ‌స్థానానికి తెచ్చే సాధ‌నం మాత్ర‌మే కాదుప్రజలకు ఇదేనని భావిస్తారుకానీ దీనికి అంతకు మించిన బాధ్యతే ఉంది.

నేర‌స్థులు శిక్ష అనుభ‌వించి తీర‌తారుకానీఅదే సమయంలో అమాయకులను రక్షిస్తున్నాంఅమాయకుల ఆర్తనాదాల్ని పట్టించుకోని సమాజం దిగజారిపోతుంది.

మీరు దుర్భేద్యమైన కోట గోడలుఫోరెన్సిక్ సైన్సు యోధులుదురుద్దేశంతో కూడినవలపక్షంతో కూడిన మౌఖిక వాంగ్మూలంతో అమాయకుడిని శిక్షించేందుకు జరిగే ప్రయత్నాన్ని అడ్డుకునే రక్షణ కవచాలు మీరు.

ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గులుతున్న వారిని మీ నైపుణ్యాలుమీ చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిలువ‌రించి వారిని విస్మ‌యంలో ముంచెత్తుతాయిమిత్రులారామ‌న ప్ర‌పంచంలోని మిస్ట‌రీల‌ను ఛేదించ‌గ‌లమ‌న సామాజిక విభాగాల‌ను ర‌క్షించ‌గ‌ల‌జాతి అభివృద్ధికి బాట‌లు వేయ‌గ‌ల బ‌హుముఖీన ప్ర‌జ్ఞ‌తో కూడిన విభాగం ఇదిక‌ల్ప‌న‌ క‌న్నా వాస్త‌వం మరింత అబ్బురం కలిగించగలదని ఫోరెన్సిక్ సైన్స్ మనకు చూపిస్తుంది.

కొన్ని రకాల భయంకరమైన నేరాల్లో.. ఒక అమాయ‌కుడు నేరాభియోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందిమరో వైపు స‌మాజం యావ‌త్తు దోషిని శిక్షించాలంటూ నిన‌దిస్తుందిఅలాంటి సంద‌ర్భంలో ఫోరెన్సిక్ సైన్స్ ఆ అమాయ‌కుడికి చివ‌రి ఆశగా నిలుస్తుందిప‌ర్యావ‌ర‌ణ వైప‌రీత్యాల‌ను ద‌ర్యాప్తు చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి కీల‌క ప‌త్రాలు అధీకృతం చేసే వ‌ర‌కుకీల‌క ఆధారాలు విశ్లేషించ‌డం నుంచి సంక్లిష్ట‌మైన న్యాయ విచార‌ణ సాగుతున్న కేసుల్లో స‌త్యాన్ని వెలికి తీయ‌డం వ‌ర‌కు...మ‌న రోజువారీ జీవితాల్లోమ‌న జాతి పురోగ‌తిలో ఫోరెన్సిక్ సైన్స్ కీల‌క పాత్ర పోషిస్తుందిన్యాయ‌వాదిగా నేనున్న నాటి పరిస్థితులు మీకు ఇపుడు తెలిసే అవకాశం లేదు.

మౌఖిక సాక్ష్యం ఒక్కటే నాడు ఆధారంమరణశయ్యపై ఉన్నవారు సత్యమే తప్ప అసత్యం చెప్పరన్న నమ్మకం ఆనాడు ఉండేదిదీని వల్ల ఇవతలి వ్యక్తి ప్రాణాలు పోయేవిప్రజాభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉన్నా పట్టించుకునే వీల్లేదు.

వీలైనంత త్వరితంగానే మీ నైపుణ్యం ఉపయోగపడుతుందిమీ నైపుణ్యంలోతైన సాంకేతిక పరిజ్ఞానం అమాయకులను కాపాడగలుగుతుందినేరస్థులను ఉరికంబానికి పంపుతుందిసత్యాన్ని వెలికి తీయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఒక సాధనంగా ఉంటుందికొన్ని సందర్భాల్లో సత్యాన్ని వెలికి తీయడం తేలిక కాదు.

సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందికొన్ని సందర్భాల్లో సాంకేతిక పురోగతి ప్రత్యేకించి ఆధునిక టెక్నాలజీలు సత్యం బహిర్గతం కాకుండా దానిని కప్పి ఉంచుతాయిఅలాంటి సందర్భాల్లో వాస్తవాన్ని వెలికి తీసిసత్యాన్ని బహిర్గతం చేస్తారు.

ఫోరెన్సిక్ ఆధారాల్లోని స్పష్టతఆధారనీయత ప్రపంచవ్యాప్తంగా ఆధునిక న్యాయ వ్యవస్థలో అంతర్గత భాగంగా మారిపోయాయిమొదట రక్తం ఒక ఆధారంగా సరిపోతుందని నేను చెప్పాను.

అది మానవ రక్తం అయి ఉండాలని వారన్నారుఅది ఆర్ఎస్ నెగిటివ్ తో సరిపోలాలన్నారుమంచిదే.

దీనికంటే మెరుగ్గాఇప్పుడు డిఎన్ఏ వచ్చిందిదేశంలోని న్యాయచట్టాన్ని అది బలోపేతం చేస్తోందిఅది దేశంలోని న్యాయ చట్టాన్ని బలోపేతం చేస్తుందని నేను మరోసారి చెప్పదలచుకున్నాను.

సత్యానికి బలమైన అండగా నిలబడకపోతే న్యాయచట్టానికి అస్తిత్వమే ఉండదుఆ సత్యాన్ని వెలికి తీయడమే ప్రధానంకాని మనిషి ఆత్మాశ్రయం గనుక వ్యక్తుల ద్వారా సత్యం వెలికి రాకపోవచ్చు.

వారి సొంత అభిప్రాయాలు వారికుంటాయిరాబోయే ఫలితంపై కూడా వారు నిశ్చితాభిప్రాయంతో ఉంటారుఇలాంటి వాతావరణంలోనే దాని చుట్టూ ఒక మిస్టరీ ఆవరించి ఉంటుందిఫోరెన్సిక్ సైన్స్ అలాంటి అనుమానాలన్నింటినీ తొలగిస్తుందిఎట్టకేలకు వారు ఒక నిశ్చితాభిప్రాయానికి రావడానికి వీలు కలుగుతుంది.

ఇదే ప్రజాస్వామ్య విలువలకు శిఖరాయమానంనా యువ మిత్రులారాసైబర్ భద్రత విభాగంలో రోజురోజుకీ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయిఅది వ్యవస్థకుసమాజానికివ్యక్తులకు కూడా సవాలుగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ కొత్త బాట పట్టిందిసైబర్ ముప్పు అత్యంత ఆధునాతనంగాతీవ్రంగా మారిన నేపథ్యంలో సైబర్ నేరాలను దర్యాప్తు చేయగలమన డిజిటల్ మౌలిక వసతులను పరిరక్షించగల ఫోరెన్సిక్ నిపుణుల అవసరం గతం కన్నా పెరిగింది.

భారతదేశం వృద్ధిప‌థంలో పయనిస్తున్న దేశంఆ వృద్ధిని నిలువరించలేనిదిప్రత్యేకించి డిజిటైజేషన్ లో వృద్ధిని అసలు నిలువరించలేంమిత్రులారాప్రపంచంలో జరుగుతున్న ప్రత్యక్ష లావాదేవీల్లో 50 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయిమన తలసరి ఇంటర్నెట్ వినియోగం అమెరికాచైనా రెండు దేశాల ఉమ్మడి వినియోగం కన్నా అధికం.

10 కోట్ల మంది వ్యవసాయదారులు ప్రతీ ఏడాది మూడు విడతలుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందుతున్నారుఈ కోణంలో చూసినా భద్రత చాలా ప్రధానంఏ మాత్రం అవకాశం దొరికినా వ్యవస్థలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నించే మోసగాళ్ల బారి నుంచి మీ నైపుణ్యాలే వారిని కాపాడగలుగుతాయిఈ రంగంలో జరుగుతున్న కృషి మాత్రమే జాతి భద్రతనుసునిశిత సమాచారాన్ని కాపాడడంలోనుడిజిటల్ వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం చేయడంలోను కీలకంగా నిలుస్తుంది.

ఇప్పటివరకు మనం అన్ని దేశాల కన్నా ఎంతో ముందున్నాంకాని సవాళ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయిఅందువల్ల మీరు సదా అప్రమత్తంగా ఉండాలిసోక్రటీస్ శకం ముందు కాలం నాటి తత్వవేత్త హెరాక్లిటస్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తున్నాయిజీవితం అంటే మార్పు అని ఆయన సిద్ధాంతీకరించాడుఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒకే నదిలోకి రెండు సార్లు ప్రవేశించలేడనివ్యక్తీ ఒకేలా ఉండడునదీ ఒకేలా ఉండకపోవడమే అందుకు కారణమని అన్నాడుఅయితే వేలాది సంవత్సరాల క్రితం హెరాక్లిటస్ ఊహించిన దాని కన్నా వేగంగా మార్పు చోటు చేసుకుంటున్నందు వల్ల మీరు దాని గురించి జాగ్రత్త తీసుకోవాలినా యువ మిత్రులారాప్రపంచం వాతావరణ మార్పులుపర్యావరణ క్షీణత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఫోరెన్సిక్ సైన్స్ వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తోంది.

కాలుష్యాన్ని గుర్తించడంలో అది సహాయపడుతుందివన్యప్రాణుల వేటను నిరోధించగలుగుతుందిపర్యావరణ నిబంధనలకు కట్టుబాటును పర్యవేక్షించగలుగుతుందిమనం నిర్లక్ష్యంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నామని నేను దీర్ఘకాలంగా చెబుతూ వస్తున్నానుఅలా చేయడం ద్వారా మన అస్తిత్వానికే మనం ముప్పు తెచ్చుకుంటున్నాంమనకు నివశించేందుకు మరో మండలం లేదన్న విషయం మనం మర్చిపోతున్నాం.

భవిష్యత్ తరాల కోసం మనం ఈ భూమండలాన్ని కాపాడుకోవాలిఈ భూమండలం ఎలా ఉందో అలా నిలబెట్టుకోవడానికిమరింత మెరుగుపరిచేందుకు మానవ వనరులన్నీ సంఘటితం కావడం అవసరంఇందులో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పర్యావరణ వినాశానికి కారణం ఏమిటో శాస్ర్తీయంగా నిర్ధారించగల సామర్థ్యం అత్యంత కీలకంకారణం తెలిసినప్పుడే దాన్ని మీరు పరిష్కరించగలుగుతారుభవిష్యత్ తరాల కోసం జాతీయ వనరులను సంరక్షించుకోవడంనియమాలు ఉల్లంఘించే వారిని బాధ్యులను చేయడం అత్యంత కీలకం.

మిత్రులారా, 1989లో నేను పార్లమెంటుకు ఎన్నికయ్యాను. 1990లో మంత్రిని అయ్యానునాటి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం లండన్పారిస్ నగరాల ఆర్థిక వ్యవస్థల పరిమాణానికి సమానంగా ఉండేదిమీకు అది నమ్మశక్యం కాకపోవచ్చుకాని మనం ఇప్పుడెక్కడ ఉన్నాంగత 10 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగాంమరో రెండేళ్లలో లేదా అంతకన్నా ముందుగానే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదగబోతున్నాంఈ నేపథ్యంలో భారత్ తన ఎదుగుదలను కొనసాగించుకోవాలిఆ క్రమంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.

దుర‌దృష్ట‌వ‌శాత్తు లోపలి నుంచివెలుపలి నుంచి కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయిప్రజలు జాతీయతను గౌరవించడంలేదురాజకీయస్వార్ధ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు సమున్నత స్థానం కల్పించడం ఈ మహోన్నత దేశ పౌరులుగా మనందరి బాధ్యత.

దేశంలో ఏ పాటి కల్లోలం జరిగినా దాన్ని స్వప్రయోజనాలకు వాడుకునే కొందరున్నారునా యువ మిత్రులారామన పొరుగు దేశంలో ఏదో జరిగితే ఈ దేశంలో కూడా అది జరగవచ్చునని ప్రచారం చేస్తున్న వారుండడం ఎంత బాధాకరంవారిలో కొందరు న్యాయవాదులుకొందరు మంత్రులుమరి కొందరు విదేశాంగ సర్వీసులో పని చేసిన వారు ఉన్నారుకాని అలాంటి అవకాశమే లేదు.

అలాంటి ప్రజలకు సమాధానం మీ మౌనం కాదుమీరంతా ఆలోచనలకు పదును పెట్టాలిఈ భూమండలంపై అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అస్థిరం చేసేందుకు జరుగుతున్న హానికరమైన చర్యలను తిప్పికొట్టేందుకు మీరు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలి.

వారిని మనం తటస్థం చేయాలిమిత్రులారాఉగ్రవాదంవ్య‌వ‌స్థీకృత‌ నేరాలపై పోరాటంపర్యావరణ క్షీణతసైబర్ ముప్పు వంటివి తిప్పి కొట్టడంలో మీ నైపుణ్యాలు ఎంతో సహాయకారి అవుతాయిమీ నైపుణ్యాల అవసరం బాగా పెరుగుతోంది.

మీరందరూ వెలుపలికి రావాలిదేశంలోనే కాదుదేశం వెలుపల కూడా మీ నైపుణ్యాల అవసరం ఉందినేను ముందుగానే చెప్పినట్టు ఉగ్రవాదులునేరస్థులను పట్టుకోవడంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఫోరెన్సిక్ న్యాయ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందిపరిశోధనఇన్నోవేషన్ లో అద్భుతాలు ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేయాలని ఈ సుప్రసిద్ధ విద్యా సంస్థ విద్యార్థులుఅధ్యాపకులను కోరుతున్నాను.

భార‌త‌దేశం నిరంత‌రం అద్భుత‌మైన వృద్ధి బాట‌లో ప‌య‌నిస్తూ గ‌ణాంకాల‌కు అతీత‌మైన వేగంతో పురోగ‌మిస్తున్న నేప‌థ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ లో మీ కృషి ప్ర‌పంచ ప్ర‌మాణాల‌కు దీటుగానే కాదుకొత్త బెంచ్ మార్క్ లు కూడా నెల‌కొల్పేదిగా ఉండాలిమ‌న ముందు ఎవ‌రున్నారు అని ఆలోచించే ప‌రిస్థితిలో మ‌నం లేంవ‌రుస‌లో ద్వితీయ స్థానంలో ఉన్న వారి క‌న్నా మ‌నం ఎంతో ముందుండాలి.

నా ప్రియ మిత్రులారాఈ వేగం అన్ని రంగాల్లోనూ చోటు చేసుకుంటోందిభారతదేశం అత్యాధునిక టెక్నాలజీల్లో భారత్ సాధిస్తున్న వేగాన్ని ప్రపంచంలోని ఎన్నో దేశాలు అందుకోలేకపోతున్నాయిఒక్కసారి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించండిహరిత హైడ్రోజెన్ కార్యక్రమం కూడా అలాంటిదేఅలాగే మనం మెషీన్ లెర్నింగ్బ్లాక్ చెయిన్ వంటి టెక్నాలజీలపై మనం దృష్టి సారిస్తున్నాం. 2025 నుంచి వాణిజ్యపరంగా 6జి వినియోగం ప్రారంభం కానుందిఅంటే ప్రతీ రంగంలోనూ భారత్ పురోగమించి తీరాలి.

ప్రమాదం అంచున ఉన్న నుంచి అగ్రగామి దేశాల్లో చేరడం అంటే మాటలానా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. 1989, 1990 సంవత్సరాల్లో నేను మంత్రిగా ఉన్న కాలంలో కనీసం దీని గురించి ఆలోచించలేకపోయానుమన విదేశీ మారకం నిల్వలు వంద కోట్ల డాలర్ల స్థాయిలో కదలాడిన రోజులున్నాయి.

రెండు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడానికి బంగారాన్ని స్విట్జర్లాండ్ కు విమానాల్లో తరలించాల్సి వచ్చిందికాని నేడు మన విదేశీ మారకం నిల్వలు 66 వేల కోట్ల డాలర్ల స్థాయిని దాటాయిఒక్క వారంలో మనం 600 నుంచి 700 కోట్ల డాలర్లు విదేశీ మారకం నిల్వలకు జోడించగలిగాండిజిటైజేషన్ లో భారతదేశం సాధించిన పురోగతి ప్రపంచం కూడా నేర్చుకోగల స్థాయిలో ఉన్నదని ప్రపంచబ్యాంకు చెబుతోంది.

దశాబ్దాలకు పైబడి సాధించలేని దాన్ని మనం కేవలం సంవత్సరాల్లో సాధించాంపెట్టుబడులుఅవకాశాలకు మెరుగైన కేంద్రంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత్ ను గుర్తించిందిప్రపంచం అంతటిలో ప్రతికూల పవనాలు వీస్తున్నఅత్యంత సంక్లిష్టమైన బాటలో పయనిస్తున్నప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లోనే గాలిబుడగల వంటి వాతావరణం నిండిన నేపథ్యంలో భారత్ అనుకూల ప్రపంచ గమ్యంగా నిలిచింది.

చంద్రయాన్ 3ని ఇంతవరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా అడుగు పెట్టని చంద్రమండల దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దించడం ద్వారా అంతరిక్ష రంగంలో కూడా మనం చరిత్ర సృష్టించాంఎన్నో అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో మనం ముందువరుసలో ఉన్నాం.

భారతదేశం అసాధారణమైనఅద్భుత పురోగతి పథంలో అడుగేస్తున్న ప్రస్తుత వాతావరణంలో మీరు చదువుకుంటున్న రంగంలో నిపుణులుగా నిలవడమే కాదుభారతదేశ భవిష్యత్తుకు ఆశాజ్యోతులుగా మీరు నిలవాలని నేను కోరుతున్నానునా దృష్టిలో దేశ పరిపాలనలోనుఏ రంగంలో అయినా దేశ పురోగతిలోనూ మీరంతా భాగస్వాములేభారతదేశం స్వాతంత్ర్య శత వార్షికోత్సవాల దిశగా 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా సాగించే ప్రయాణంలో మీరంతా అత్యంత కీలకమైన చోదక శక్తులుగా నిలవాలి.

ఈ అద్భుత ప్రయాణానికి మీరే సారథులుముందుగా కాకపోయినా 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందిఅందుకే నా యువ మిత్రులారా మనం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సవాళ్ల నుంచి వెలుపలికి రావడానికి మీ నైపుణ్యాలు ఉపయోగించండిసమాజం యావత్తుకు ఆచరణీయమైన పరిష్కారాలు అందించడానికి ప్రభుత్వ సంస్థలుపరిశ్రమలో సహకరించండి.

ప్రభుత్వ సర్వీసులో మాత్రమే చేరాలన్న భావంలో చిక్కుకుపోకండికోచింగ్ సెంటర్లకు పరుగులు తీయకండిఇతర రంగాల్లో అవకాశాలు పుష్కలంగామరింత ఉత్పాదకంగా ఉన్నాయిఅందుకే ఈ బంధనాల్లో చిక్కుకోకండి.

ఆ రంగాలు మీ నైపుణ్యాలనుజ్ఞానాన్ని పరీక్షిస్తాయిమిమ్మల్ని నవకల్పనలుపరిశోధన బాటలో నడుపుతాయిఈ రంగంలో నైపుణ్యం లేదా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు పరుగులు తీయాలిఆలోచించండి.

మీ వృత్తిలో అత్యున్నత నైతిక ప్రమాణాలుసమగ్రత పాటించాలని నేను ఈ రంగంలోని ప్రతి విద్యార్థినివృత్తి నిపుణుడిని అభ్యర్థిస్తున్నానుమీరు ఏ మాత్రం అలసత్వం వహించినా ఉగ్రవాదులు తప్పించుకుంటారుఅమాయకులు జైళ్లకుఉరికంబాలకు చేరతారుసత్యం మాత్రమే మీ పనికి గీటురాయిగా తీసుకోండిఎలాంటి పక్షపాతంరాజీ లేకుండా న్యాయం అందేలా చూడండి.

నైతికంగా బలహీనం అయితే ఫోరెన్సిక్ నైపుణ్యాలు ఒక పెద్ద కొండలాఅందుకోలేనివిగా కనిపిస్తాయిఅందుకే ఎల్లప్పుడూ ఫోరెన్సిక్ విశ్లేషణలో నిజాయతీకి కట్టుబడండిఈ సైన్స్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకుభావి ఆలోచనలను ప్రేరేపించడానికి అధ్యాపకులుపరిశోధకులు చేస్తున్న నిరంతర కృషిని నేను అభినందిస్తున్నాను.

మరింత న్యాయబద్ధమైనసమానత్వంతో కూడిన సమాజానికి మీ కృషి పునాది అవుతుందిఅందుకు ఈ సమాజం మీకెంతో రుణపడి ఉంటుందినేను ప్రపంచం అంతటా పర్యటించానుభారతదేశం పట్ల గౌరవ భావం గల వ్యక్తులను చూశాను.

నేను కలిసిన వారిలో భారతదేశం పేరు చెబితేనే ఒక రకమైన పులకరింత కలిగిందిశతాబ్దాల క్రితం భారత్ విశ్వగురు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందేతిరిగి దేశాన్ని ఆ స్థానంలో నిలిపే దిశగా మనం వేగంగా అడుగేస్తున్నాంసైన్స్ మార్గదర్శకంలో శక్తివంతంసురక్షితంసుసంపన్నం అయిన భారత్ ను మనందరం కలిసికట్టుగా నిర్మించుకుందాం.

మీ జీవితంకెరీర్ ఉజ్వలంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

ధన్యవాదాలు.   

 

***


(Release ID: 2048835) Visitor Counter : 49