బొగ్గు మంత్రిత్వ శాఖ
జాతీయ బొగ్గు గనుల భద్రతా నివేదిక పోర్టల్: మెరుగైన భద్రత దిశగా ముందడుగు
Posted On:
24 AUG 2024 12:08PM by PIB Hyderabad
బొగ్గు కంపెనీల భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా శుక్రవారం జాతీయ బొగ్గు గనుల భద్రతా నివేదిక పోర్టల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్) చైర్మన్, దాని అనుబంధ సంస్థల సీఎండీలు, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని బొగ్గు గనుల్లో 100% భద్రతా ఆడిట్‌లు నిర్వహించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. "సున్నా ప్రమాదాలు, విఫలం కానీ భద్రత" సాధించాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. సీఐఎల్ చైర్మన్ పోర్టల్‌ను ప్రదర్శించారు. బొగ్గు గనులలో భద్రతా మెరుగుపరిచేందుకు అధికారులు విలువైన సూచనలు చేశారు.
పోర్టల్ ప్రదర్శనలో రెండు కీలక మాడ్యూళ్లు ఉన్నాయి. అవి ప్రమాద, భద్రతా ఆడిట్ మాడ్యూళ్లు. బొగ్గు గనులలో నిర్వహణ, వృత్తిపరమైన ప్రమాదాల దృష్ట్యా వాటిలో సురక్షితంగా పనిచేయడానికి కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ అవసరం. బొగ్గు కంపెనీలు తమ దార్శనికత, లక్ష్యానికి అనుగుణంగా సమగ్ర భద్రతా విధానాన్ని అమలు చేయడానికి అంకితమయ్యాయి.
భద్రతా నిర్వహణలో జాతీయ బొగ్గు గనుల భద్రతా నివేదిక పోర్టల్ అనేది గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సత్వర ప్రతిస్పందన, సమగ్ర విశ్లేషణ, 24 గంటల రిపోర్టింగ్‌కు ప్రమాద మాడ్యుల్ వీలు కల్పిస్తుంది. భద్రతా ఆడిట్ మాడ్యూల్.. ఆడిటింగ్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బొగ్గు గనుల రంగం అంతటా భద్రతా పద్ధతులు, విధివిధానాలను బలోపేతం చేస్తుంది. ఈ అధునాతన మాడ్యూల్స్ వల్ల క్లిష్టమైన భద్రతా సవాళ్లను పరిష్కరించవచ్చు. అంతేకాకుండా భద్రతా నిర్వహణకు కొత్త మైలురాళ్లు నిర్ధేశించుకోవచ్చు.
బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు-పీఎస్‌యూలు ఆ శాఖ మంత్రివర్యుల నాయకత్వంలో సంభవించే ఆస్కారం ఉన్న ప్రమాదాలను గుర్తించి, వాటిని తగ్గించేందుకు వీలుగా ప్రమాద మదింపు విధానాలను అనుసరించటం ద్వారా "గనుల భద్రతా సంస్కృతిని" పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాయి. సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం, విధానాలను ఉపయోగించడం ద్వారా, బొగ్గు మంత్రిత్వ శాఖ భద్రత, ఉత్పాదకత సంస్కృతిని ప్రోత్సహించడం.. బొగ్గు గనుల రంగంలోని ఉద్యోగులందరి శ్రేయస్సును నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2048829)