రాష్ట్రపతి సచివాలయం
జన్మాష్టమి కి ముందు రోజు న భారతదేశం రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
25 AUG 2024 5:20PM by PIB Hyderabad
జన్మాష్టమి కి ముందు రోజున భారతదేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ఇలాగ పేర్కొన్నారు: -
‘‘మంగళప్రదమైన జన్మాష్టమి సందర్భంలో, నేను నా తోటి పౌరులందరికి మరియు విదేశాల్లో జీవిస్తున్న భారతీయులకు నా స్నేహపూర్ణమైన శుభాభినందనలతో పాటు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను.
జన్మాష్టమి రోజున, మనం భగవాన్ శ్రీ కృష్ణుడిని పూజిస్తాం. భగవాన్ శ్రీ కృష్ణుడి పవిత్ర ఆదర్శాలకు మనలను మనం సమర్పించుకోవడానికి ఈ ఆనందాల పండుగ రోజు మనకు స్ఫూర్తిని ఇస్తున్నది. అర్జునునికి మరియు శ్రీ కృష్ణునికి మధ్య సాగిన సంభాషణ ‘శ్రీమద్ భగవద్ గీత’ సమస్త మానవజాతికి ఉత్తేజపరచేటటువంటి మరియు తెలియజెప్పేటటువంటి ఒక శాశ్వత ప్రవాహంగా నిలుస్తున్నది.
ఈ సందర్భంలో, భగవాన్ శ్రీ కృష్ణుని బోధనలను సంపూర్ణంగా మన మనస్సులలో లోలోపలకు స్వీకరించి, మరి దేశ ఉన్నతికి, దేశ అభ్యుదయానికి శ్రమించాలి అనే సంకల్పాన్ని చెప్పుకొందాం, రండి.’’
Click here to see President's Message in Hindi
(పైన పేర్కొన్న వాక్యానికి రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయగలరు అని అర్థం వస్తుంది.)
(Release ID: 2048822)
Visitor Counter : 67