ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రాజస్థాన్ హైకోర్టు మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని

"జాతీయ ఐక్యత భారతదేశ న్యాయ వ్యవస్థకు పునాది రాయి,

దానిని బలోపేతం చేయడం అంటే దేశ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే"

"భారతీయ న్యాయ సంహిత స్ఫూర్తిని సాధ్యమైనంత ప్రభావవంతంగా చేయడం ఇప్పుడు మన బాధ్యత"

"పూర్తి అసంబద్ధంగా మారిన వందలాది వలస చట్టాలను మేం రద్దు చేశాం"

"భారతీయ న్యాయ సంహిత వలసవాద మనస్తత్వం నుండి ప్రజాస్వామ్యాన్ని విముక్తి చేస్తుంది"

"నేడు, భారతదేశపు కలలు పెద్దవి, పౌరుల ఆకాంక్షలు ఉన్నతమైనవి"

"జాతీయ సమస్యలపై అప్రమత్తంగా, చురుకుగా ఉండాల్సిన

నైతిక బాధ్యతను న్యాయవ్యవస్థ నిలకడగా నిర్వహిస్తోంది"

"వికసిత భారత్‌లో ప్రతి ఒక్కరికీ సులభంగా, అందుబాటులో, తేలిక పద్ధతిలో న్యాయాన్ని అందించడం చాలా ముఖ్యం"

Posted On: 25 AUG 2024 7:06PM by PIB Hyderabad

ఈ రోజు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో, రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాజస్థాన్ హైకోర్టు మ్యూజియాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

మహారాష్ట్ర నుండి బయలు దేరిన సమయంలో వాతావరణం సరిగా లేనికారణంగా- జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయనభారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. ఎందరో మహానుభావులు అందించిన న్యాయంవారి చిత్తశుద్ధీఅంకితభావాన్నీ గౌరవించుకునే సందర్భమిది అని ప్రధాన మంత్రి అన్నారు. "రాజ్యాంగం పట్ల దేశానికి ఉన్న విశ్వాసానికి నేటి కార్యక్రమం ఒక ఉదాహరణ" అనిఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవారందరికీరాజస్థాన్ ప్రజలకూ ప్రధాని అభినందనలు తెలియజేశారు.

రాజస్థాన్ హైకోర్టు ఉనికి చారిత్రకంగా భారతదేశ ఐక్యత సంబంధించినదని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. 500కు పైగా రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిభారతదేశాన్ని ఏర్పాటు చేసేందుకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చేసిన కృషిని శ్రీ మోదీ గుర్తు చేశారు. జైపూర్ఉదయపూర్కోటా వంటి రాజస్థాన్‌లోని వివిధ సంస్థానాలు సొంతంగా నిర్వహించే ఉన్నత న్యాయస్థానాలను ఏకీకృతం చేసి, రాజస్థాన్ హైకోర్టును తీసుకొచ్చారన్నారు. "జాతీయ ఐక్యత భారతదేశ న్యాయ వ్యవస్థకు పునాది రాయిదానిని బలోపేతం చేయడం దేశాన్నిదాని వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 

న్యాయం చాలా సులభమైనదీ, స్పష్టమైనదీ, అయితేకొన్నిసార్లు విధానాలు దానిని సంక్లిష్టంగా మారుస్తాయని ప్రధాన మంత్రి తెలిపారు. న్యాయాన్ని వీలైనంత సులభంగాస్పష్టంగా అందించేందుకు అన్ని రకాల  ప్రయత్నించడం మన సమష్టి బాధ్యత అని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా భారతదేశం అనేక చరిత్రాత్మకమైనకీలకమైన ప్రయత్నాలను చేపట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనేక అసంబద్ధమైన వలస చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన చెప్పారు.

దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాతవలసవాద ఆలోచనల నుండి బయటపడిన భారతదేశంభారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహితను స్వీకరించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. శిక్ష స్థానంలో న్యాయం’ అనే ఆదర్శంపై భారతీయ న్యాయ సంహిత ఆధారపడి ఉందనిఇది భారతీయ ఆలోచనకు ఆధారమని ఆయన అన్నారు. భారతీయ న్యాయ సంహిత మానవ ఆలోచనను పురోగమింపజేస్తుందనివలసవాద మనస్తత్వం నుండి మనల్ని విముక్తి చేస్తుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ న్యాయ సంహిత స్ఫూర్తిని సాధ్యమైనంత ప్రభావవంతంగా చేయడం ఇప్పుడు మన బాధ్యత అని ఆయన సూచించారు. 

భారతదేశం 10వ స్థానం నుండి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ గడిచిన దశాబ్దంలో దేశం వేగంగా రూపాంతరం చెందిందని ప్రధాని ఉద్ఘాటించారు. "నేడుభారతదేశ కలలు పెద్దవిపౌరుల ఆకాంక్షలు ఉన్నతమైనవి" అంటూ కొత్త భారతదేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలువ్యవస్థల ఆధునీకరణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అందరికీ న్యాయం’ సాధించడం కూడా అంతే ముఖ్యం అని ఆయన అన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో సాంకేతిక పరిజ్ఞానంముఖ్యమైన పాత్రను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ-కోర్టుల’ ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 18,000కు పైగా కోర్టులను కంప్యూటరీకరించామని, 26 కోట్లకు పైగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ద్వారా కేంద్రీకృత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచామని ఆయన తెలియజేశారు. మూడు వేలకు పైగా కోర్టు సముదాయాలు, 1200 కు పైగా జైళ్లను వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలకు అనుసంధానం చేసినట్లు శ్రీ మోదీ చెప్పారు. కాగిత రహిత న్యాయస్థానాలుఇ-ఫైలింగ్ఎలక్ట్రానిక్ సమన్ సేవవర్చువల్ హియరింగ్ కోసం సౌకర్యాలు కల్పిస్తూ వందలాది కోర్టులను కంప్యూటరీకరించిన ఈ దిశలో రాజస్థాన్ చేపడుతున్న పనుల వేగం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న న్యాయస్థానాల ప్రక్రియలు నిదానంగా సాగేవని ప్రస్తావిస్తూసాధారణ పౌరులపై భారాన్ని తగ్గించేందుకు దేశం తీసుకున్న ప్రభావవంతమైన చర్యలు భారతదేశంలో న్యాయంపై కొత్త ఆశను నింపాయని ప్రధాని పేర్కొన్నారు. దేశం న్యాయ వ్యవస్థను నిరంతరం సంస్కరించడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాలను కొనసాగించాలని ప్రధాన మంత్రి ఉద్బోధించారు. శతాబ్దాల నాటి మన మధ్యవర్తిత్వ ప్రక్రియను తాను గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించానని ప్రధాని గుర్తు చేశారు.  "ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం" యంత్రాంగం నేడు దేశంలో తక్కువ ఖర్చుతో శీఘ్ర నిర్ణయాలకు ముఖ్యమైన మార్గంగా మారిందని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ వివాద యంత్రాంగ వ్యవస్థ దేశంలో సులభతరం జీవనంతో పాటుసులభతర న్యాయాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. చట్టాలను సవరించడంకొత్త నిబంధనలను జోడించడం ద్వారా ప్రభుత్వం ఈ దిశగా అనేక చర్యలు చేపట్టిందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. న్యాయవ్యవస్థ మద్దతుతో ఈ వ్యవస్థలు మరింత పటిష్టంగా మారుతాయని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. "జాతీయ సమస్యలపై అప్రమత్తంగాచురుకుగా ఉండాలనే నైతిక బాధ్యతను న్యాయవ్యవస్థ స్థిరంగా నిర్వహిస్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు భారతదేశం ఏకీకరణకు సరైన ఉదాహరణ అని ఆయన అన్నారు. మానవీయమైన సీఏఏ చట్టాన్ని కూడా ప్రస్తావించారు. కోర్టు నిర్ణయాలు సహజ న్యాయంపై తమ వైఖరిని స్పష్టం చేశాయని అన్నారు. సుప్రీంకోర్టుహైకోర్టులు దేశం ముందు’ అనే సంకల్పాన్ని బలోపేతం చేశాయని ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోట నుండి తన ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించిన సెక్యులర్ సివిల్ కోడ్‌ గురించి మాట్లాడుతూప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీభారతదేశ న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ దానికి అనుకూలంగా వాదిస్తూనే ఉందని అన్నారు. జాతీయ సమైక్యత విషయంలో కోర్టు వైఖరి పౌరులలో విశ్వాసాన్ని నింపుతుందని ఆయన అన్నారు. 

21వ శతాబ్దపు భారతదేశంలో సమగ్రత’ అనే పదం ప్రధాన పాత్ర పోషించబోతోందని ప్రధాని తెలిపారు. రవాణాడేటాఆరోగ్య వ్యవస్థల ఏకీకరణ - దేశంలోని విడివిడిగా పని చేస్తున్న అన్ని ఐటి వ్యవస్థలు ఏకీకృతం కావాలిపోలీస్ఫోరెన్సిక్స్ప్రాసెస్ సర్వీస్ మెకానిజమ్స్. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నుండి జిల్లా కోర్టుల వరకు అందరూ కలిసి పని చేయాలి”, అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు. ఈ రోజు రాజస్థాన్‌లోని అన్ని జిల్లా కోర్టులలో ప్రారంభమైన ఇంటిగ్రేషన్ ప్రాజెక్టుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి భారతదేశంలో నిరుపేదల సాధికారత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పరీక్షించే సూత్రంగా మారిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో భారతదేశం అనేక గ్లోబల్ ఏజెన్సీలుసంస్థల నుండి ప్రశంసలు పొందిందని ఆయన అన్నారు. డీబీటీ నుండి యూపీఐ వరకు అనేక రంగాలలో భారతదేశం పనిచేస్తూగ్లోబల్ మోడల్‌గా ఎదిగిందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థలో కూడా అదే అనుభవాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ దిశలోసాంకేతికతచట్టపరమైన పత్రాలను తమ సొంత భాషలో పొందడం పేదల సాధికారత కోసం అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం 'దిశఅనే వినూత్న పరిష్కారాన్ని కూడా ప్రోత్సహిస్తోందనిఈ ప్రచారంలో సహాయం చేయడానికి న్యాయ విద్యార్థులుఇతర న్యాయ నిపుణులను ఆహ్వానించారు. చట్టపరమైన పత్రాలుతీర్పులను స్థానిక భాషల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కృషి చేయాల్సి ఉందని కూడా ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. న్యాయపరమైన పత్రాలను 18 భాషల్లోకి అనువదించగలిగే సాఫ్ట్ వేర్ సహాయంతో భారత సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిని ప్రారంభించిందని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థ చేపట్టిన అన్ని విశిష్ట ప్రయత్నాలను శ్రీ మోదీ ప్రశంసించారు.

న్యాయస్థానాలు సులభతర న్యాయ విధానాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. "వికసిత భారత్‌లో ప్రతి ఒక్కరికీ సులభంగాఅందుబాటులోతేలిక పద్ధతిలో న్యాయాన్ని అందించడం చాలా ముఖ్యం" అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

*****

MJPS/SR/TS


(Release ID: 2048820) Visitor Counter : 88