రక్షణ మంత్రిత్వ శాఖ
అమెరికాలోని నావల్ సర్ఫేస్ వార్‌ఫేర్ సెంటర్ ను సందర్శించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్
Posted On:
25 AUG 2024 11:06AM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా, టెన్నెస్సీలోని మెంఫిస్ వద్ద ఉన్న నావల్ సర్ఫేస్ వార్‌ఫేర్ సెంటర్‌లోని విలియం బి మోర్గాన్ లార్జ్ కావిటేషన్ ఛానల్(ఎల్‌సిసి)ను సందర్శించారు. జలాంతర్గాములు, టార్పెడోలు, నావికా ఉపరితల నౌకలు, ప్రొపెల్లర్లను పరీక్షించడానికి ఎల్‌సిసి ప్రపంచంలోని అతిపెద్ద, సాంకేతికంగా అధునాతన నీటి సొరంగ సదుపాయాలలో ఒకటి. అధికారులు రక్షణ మంత్రికి ఇందులోని సదుపాయాల గురించి వివరించారు. నీటి సొరంగంలో మంత్రి ప్రయాణించి అందులోని వ్యవస్థల గురించి తెలుసుకున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ వెంట అమెరికాలోని భారత రాయబారి, భారత నౌకాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్, డిఆర్‌డిఒ డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిలర్ తదితరులు ఉన్నారు. నేవీ ఫర్ పాలసీకి చెందిన అమెరికా డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆయనకు స్వాగతం పలకగా, ఎన్‌ఎస్‌డబ్ల్యూసీ కమాండర్, టెక్నికల్ డైరెక్టర్ ఆయనకు వివరించారు.
భారత్‌లో స్వదేశీ డిజైన్, అభివృద్ధి కోసం ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చలు చేస్తున్నారు.
***
(Release ID: 2048818)