వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సోయాబీన్ పంటకు 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న బీమా సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించిన పర్భాని జిల్లా రైతాంగం
పీఎంఎఫ్‌బీవై కింద పెండింగ్ లో ఉన్న రూ.200 నుంచి రూ.225 కోట్ల బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని బీమా కంపెనీకి ఆదేశాలు జారీ
పర్భాని జిల్లాలోని సుమారు 2 లక్షల మంది రైతులకు ప్రయోజనం
Posted On:
24 AUG 2024 5:17PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ 21 ఆగస్టు 2024 న మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనలో భాగంగా రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా పర్భానీ జిల్లా రైతులు తమ సోయాబీన్ పంటకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బీమా బకాయిల సమస్యను కేంద్ర మంత్రికి వివరించారు. వారి సమస్యను విన్న మంత్రి తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 22 ఆగస్టు 2024 న జాతీయ సాంకేతిక సలహా కమిటీ సమావేశం నిర్వహించింది. పంట కోత ప్రయోగాలపై బీమా సంస్థ చేసిన అభ్యంతరాలను ఈ సమావేశంలో జాతీయ సాంకేతిక సలహా కమిటీ తోసిపుచ్చడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల పర్భాని జిల్లాలోని సుమారు రెండు లక్షల మంది రైతులకు రూ.200 నుంచి రూ.225 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి ఉంది.
దీనికి సంబంధించి వారం రోజుల్లోగా క్లెయిమ్ బకాయిలను చెల్లించాలని సెంట్రల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 24 ఆగస్టు 2024 సంబంధిత బీమా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
***
(Release ID: 2048551)
Visitor Counter : 83