వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పాట్నాలో రైతులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి 6 సూత్రాలు: శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రపంచంలోనే బిహార్ ప్రతిభ అద్భుతమైనది. ఈ ప్రతిభను సక్రమంగా ఉపయోగించుకోవడం వల్ల బిహార్ భారత్‌లో అగ్రగామిగా మారటమే కాకుండా దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా చేస్తుంది: చౌహాన్
Posted On:
23 AUG 2024 3:29PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు బిహార్‌లోని పాట్నాలో రైతులతో సమావేశమయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, రైతులే దాని ఆత్మ అని అన్న ఆయన.. రైతులకు సేవ చేసే బాధ్యతను తనకు అప్పగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సేవ చేయటం దేవున్ని ఆరాధించటం వంటిదని, దేశంలో రైతు సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
మూడు రెట్లు వేగంగా పనిచేస్తానని, దేశంలోని రైతుల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తానని ప్రధాని ఎర్రకోట నుంచి ప్రకటించారని అన్నారు. నిరంతరం వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందుకు బిహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖను ఆయన అభినందించారు. ఇక్కడున్న స్టాల్స్ చూశానని… మఖానా, బియ్యం, తేనె, మొక్కజొన్న, టీ ఇలా ప్రతిదీ అద్భుతంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బిహార్ రైతులకు వందనం(సెల్యూట్) చేశారు. మన దగ్గర భూకమతాల విస్తీర్ణం ఎక్కువగా లేదని, 91 శాతం మంది సన్నకారు రైతులేనని, అయినా కర్షకులు అద్భుతాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
***
(Release ID: 2048529)
Visitor Counter : 77