ప్రధాన మంత్రి కార్యాలయం
పోలెండ్ లోని వార్సాలో గల నవానగర్ జామ్ సాహెబ్ స్మారకచిహ్నం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
21 AUG 2024 10:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలెండ్ లోని వార్సాలో గల నవానగర్ జామ్ సాహెబ్ స్మారకానికి చేరుకొని జామ్ సాహెబ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. నవానగర్ కు చెందిన జామ్ సాహెబ్ కు గుర్తుగా పోలెండ్ లోని వార్సాలో స్థాపించిన ‘నవానగర్ జామ్ సాహెబ్ స్మారకచిహ్నం’ దిగ్విజయ్ సింగ్ జీ రణజీత్ సింగ్ జీ జడేజా అందించిన మానవతా పూర్వక తోడ్పాటును గురించి ప్రముఖంగా చాటిచెబుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆశ్రయాన్ని కోల్పోయిన పోలెండుకు చెందిన బాలలకు వారు తలదాచుకొనేందుకు నవానగర్ జామ్ సాహెబ్ వసతిని కల్పించడమే కాకుండా వారి బాగోగుల పట్ల శ్రద్ధ వహించారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నవానగర్ జామ్ సాహెబ్ స్మృతిలో పోలెండ్ లోని వార్సాలో ఏర్పాటుచేసిన ‘నవానగర్ జామ్ సాహెబ్ స్మారక చిహ్నం’ వద్ద ఒక పూలమాలను తాను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినప్పటి దృశ్యాలను కూడా శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మానవీయత, కరుణ లు న్యాయభరిత, శాంతియుత జగతికి ప్రధాన పునాదులు. వార్సాలో నవానగర్ కు చెందిన జామ్ సాహెబ్ స్మృతిలో వార్సాలో ఏర్పాటు చేసిన ‘నవానగర్ జామ్ సాహెబ్ స్మారకచిహ్నం’ జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ రణజీత్ సింగ్ జీ జడేజా అందించిన మానవత భరిత తోడ్పాటును గురించి ప్రముఖంగా చాటిచెబుతున్నది. ఆయన రెండో ప్రపంచ యుద్ధం కాలంలో నిరాశ్రయులైన పోలెండుకు చెందిన బాలలకు తలదాచుకొనేందుకు వసతిని కల్పించడంతో పాటు వారి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకొన్నారు. జామ్ సాహెబ్ ను పోలెండ్ లో ఆప్యాయంగా ‘డోబ్ రీ మహారాజా’ అనే పేరుతో కూడా స్మరించుకొంటున్నారు.
ఈ స్మారకం వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించాను. దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇవిగో.’’
***
MJPS/ST
(Release ID: 2047610)
Visitor Counter : 45
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam