ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

19వ సీఐఐ ఇండియా-ఆఫ్రికా బిజినెస్ సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగం- ముఖ్యాంశాలు

Posted On: 21 AUG 2024 12:59PM by PIB Hyderabad

ఆఫ్రికా, భారతదేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆత్మీయ సదస్సు (కాన్ క్లేవ్) ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆఫ్రికా-భారత్ 1.4 బిలియన్లు జనాభా చొప్పున కలిగిన దేశాలు. విశిష్ట ప్రముఖులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. అలాగే భారత ప్రజల తరఫున మీ దేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను.

‘‘ఒకే భవిష్యత్తును నిర్మించడం’’ ఈ ఇండియా-ఆఫ్రికా బిజినెస్ ఆత్మీయ సదస్సు ఇతివృత్తం. ఇది మన నాగరిక మూలాల్లోనే ఉంది. ఇండియాలో జరిగిన జి20 నినాదం 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' తో కలిసి, ఈ దృక్పథం మరింత విస్తరించింది. 

సమకాలీనమైన ఇతివృతంపై చర్చించడానికి, అందరి శ్రేయస్సును కోరి, ఉమ్మడి భవిష్యత్తుకు మార్గం వేసే దిశగా మన ప్రయత్నాలను సమన్వయం చేయడానికి అంతా కలవడానికి ఈ ఆత్మీయ సదస్సు ఒక అవకాశం!

మానవాళి మొత్తానికీ 'ఒకే భవిష్యత్తును నిర్మించడం' అత్యంత పవిత్రకార్యం. ఈ సవాలును స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం వద్దు. ప్రజల భాగస్వామ్యమే దీనికి గీటురాయి కాగలదు. చర్చలు సఫలం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను.

మానవాళికి పెను ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై అన్ని దేశాలు సమష్టిగా తమ ప్రయత్నాలను కేంద్రీకరించడం చాలా కీలకం. సమష్టి ప్రయత్నాలు, సామూహిక భాగస్వామ్యం, వనరులను గరిష్ట వినియోగం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు ఇక ఎంతోకాలం దీని కోసం వేచి ఉండలేం. ఎందుకంటే మనం నివశించడానికి మరో గ్రహం లేదు.

భారతదేశం-ఆఫ్రికా అభివృద్ధి భాగస్వామ్యంపై 19వ సీఐఐ ఇండియా-ఆఫ్రికా బిజినెస్ సదస్సు ముందు మరొక లక్ష్యం కూడా ఉంది. బలమైన ఆర్థిక భాగస్వామ్యాలను నిర్మించడం, మౌలిక సదుపాయాల కల్పన, అంతరిక్ష రంగ సహకారంతో పాటు, వ్యవసాయం, మైనింగ్ ఆహార శుద్ధి రంగాలలో విలువను పెంచడం వంటి ఎన్నో అవకాశాలకు ఇది బాటలు వేస్తుందని భావిస్తున్నాను.

భారీ డిజిటలైజేషన్, సాంకేతిక పురోగతితో గత దశాబ్దంలో అపూర్వమైన వృద్ధిని సాధించిన భారత్, పరస్పర సహకారం కోసం అనేక అవకాశాలను అందిస్తుంది. పరస్పర ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలను అందించనున్నది. ఉభయులకూ ఇది విజయాన్ని అందించేదే.

భారతదేశం, ఆఫ్రికాల మధ్య లోతుగా వేళ్లూనిన సంబంధాలు, భాగస్వామ్య చరిత్రలు, ఉమ్మడి పోరాటాలు, న్యాయమైన, ప్రగతిశీల భవిష్యత్తు కోసం పరస్పర ఆకాంక్షలు, ప్రపంచంలో సమానత్వం కోసం- ఈ భాగస్వామ్యాన్ని గతం కంటే సహజంగా, బలంగా చేస్తాయి.

భారతదేశం 43 ఆఫ్రికన్ దేశాలలో జన జీవితాలను ప్రభావితం చేసే 206 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో 12.37 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 21వ శతాబ్దానికి ఒక ఆఫ్రివాసిని సిద్ధం చెయ్యి'  అన్నది ఆఫ్రికన్ యూనియన్ ఈ ఏడాది ఇచ్చిన నినాదం. దీనిలో భాగంగా అవకాశాల కల్పన, శిక్షణ, విద్యావకాశాలను భారతదేశం అందించగలదు.

ద్వైపాక్షిక వాణిజ్యంలో 85 బిలియన్ డాలర్లు, పెట్టుబడులుగా 75 బిలియన్ డాలర్లతో భారతదేశం- ఆఫ్రికాకు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. లోతైన ఆర్థిక ఏకీకరణ కోసం, పరస్పర అభివృద్ధి  కోసం- ఏఎఫ్సిఎఫ్టిఏ, భారతదేశపు డిఎఫ్టిపి పథకం అపారమైన అవకాశాలను అందిస్తాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికీ, మానవాళిలో ఆరవ వంతు జనాభాకు నివాసంగా ఉన్న భారతదేశం- 33 ఆఫ్రికన్ దేశాలకు ఇ-వీసా సౌకర్యాలను విస్తరించడం ద్వారా ప్రజా సంబంధాల రూపంలో ఆఫ్రికాతో తన బంధాన్ని పెంపొందించుకుంది. 16 కొత్త దౌత్య కార్యాలయాల ప్రారంభంతో ఆఫ్రికాలో దౌత్య సంబంధాలను పెంపొందించుకుంటున్నాం. ఆఫ్రికా ఖండంలో మొత్తం భారతీయ దౌత్య కార్యాలయాల సంఖ్య 46కి చేరుకోవడం వృద్ధి పథానికి సూచిక.

కోవిడ్-19 సమయంలో, భారతదేశం ఆఫ్రికాకు వైద్య సామాగ్రి, వ్యాక్సిన్లను అందించడం ద్వారా సహాయం చేసింది. సైనిక శిక్షణ, మూడో అతిపెద్ద యుఎన్ శాంతి దళాల రూపంలో- భారతదేశం, ఆఫ్రికా బలమైన రక్షణ సంబంధాలను కలిగి ఉన్నాయి. భారతదేశం సముద్ర భద్రతలో కూడా చురుకుగా పాల్గొంది. ఈ దిశగా ఆఫ్రికన్ ప్రాంతాలలో కార్యక్రమాలను చేపట్టింది. 

సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం, ఆఫ్రికా కీలకమైన ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరుస్తాయి. భారతదేశం ఎదుగుదల, సమ్మిళిత బహుపాక్షికత... గ్లోబల్ సౌత్ పురోగతిని ప్రోత్సహిస్తుంది.

2023లో మా అధ్యక్షతన జరిగిన జి20 సందర్బంగా ఇప్పటికే ఉన్న యూరోపియన్ యూనియన్‌తో పాటు ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యునిగా చేర్చడం చాలా గర్వించదగిన విషయం. ఇది చాలా ముఖ్యమైన భౌగోళిక-రాజకీయ అభివృద్ధి. యుఎన్ లో ఆఫ్రికాకు మరింత ఊతం అందించడానికి, మేము కూడా ఆఫ్రికన్ యూనియన్ 'ఎజుల్విని ఏకాభిప్రాయం', 'సిర్టే డిక్లరేషన్' కు అండగా నిలబడతాం.

భారతదేశం ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ), గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్, కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ)లో ఆఫ్రికన్ దేశాల భాగస్వామ్యాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తున్నాము.

చిరుతలను అందించడం ద్వారా మా జీవ-వైవిధ్యాన్ని పునఃసృష్టించడంలో సహాయం చేసినందుకు భారతదేశం ఆఫ్రికాకు కృతజ్ఞతలు తెలుపుతోంది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరాల్సిందిగా ఆఫ్రికన్ దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఈ పరిణామం దేశాన్ని ఉత్సాహపరిచింది. భారత్, ఆఫ్రికాల మధ్య భావోద్వేగ సంబంధాన్ని తీసుకువచ్చింది.

మిత్రులారా,

సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి భారతదేశం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంది. ఇది ప్రపంచ ఖ్యాతిని పొందింది. "ఇండియా స్టాక్" వంటి కార్యక్రమాలపై ఆఫ్రికాతో ఈ నైపుణ్యానికి సహకరించడం, సాంకేతిక ప్రపంచం ఇప్పటి వరకు చూడని అత్యున్నత స్థాయిని ఇది  కలిగి ఉంది. స్థిరమైన అభివృద్ధిని సాధించే దిశగా ఆఫ్రికా ముందుకు సాగేందుకు అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిష్కారాలను భారత్ అందిస్తుంది. ఇది అపారమైన అందించే ప్రాంతమిది. ఈ దిశగా భారతదేశం ఇప్పుడు ప్రపంచ దిగ్గజాల్లో ఒకటిగా ఉంది.  ముడిసరుకు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, వస్తు ఉత్పత్తి, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉండలాన్న ఆలోచనల్లో భారత్, ఆఫ్రికాల మధ్య సారూప్యత ఉంది.

ఈ దిశగా తీసుకునే చొరవ తప్పకుండా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా,

ఆఫ్రికాలోని సహజ వనరుల గురించి ఆఫ్రికాలోని ఉపాధ్యక్షుల ద్వారా వినే అవకాశం నాకు లభించింది. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అగ్రిమెంట్- ఏఎఫ్సిఎఫ్టిఏ- ద్వారా జనాభా పరంగా ప్రయోజనం, పెరుగుతున్న ఆర్థిక ఏకీకరణ పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆఫ్రికా మారింది. ఈ చర్చల్ని మరో స్థాయికి తీసుకుపోవడమే పూర్ణత్వం అవుతుంది. అదే సాంత్వనను అందించగలదు. అదే లోపరహితమూ కాగలదు.

పునరుత్థానమైన ఆఫ్రికా, ఎదుగుతున్న భారతదేశం... ఊహించండి. దక్షిణ-దక్షిణ సహకారానికి, ప్రత్యేకించి క్లీన్ టెక్నాలజీ, వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయం, సముద్ర భద్రత, కనెక్టివిటీ, బ్లూ ఎకానమీ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.  ఇరు పక్షాల మధ్య సహకారం కోసం మరింత సమకాలీన ఎజెండాను అందించడానికి ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్-4 నిర్వహించేందుకు భారతదేశం ఎదురుచూస్తోంది.

మా ప్రాధాన్యతలలో ఆఫ్రికా అగ్రస్థానంలో ఉంటుందని మేము గట్టి హామీని ఇస్తున్నాం. విశ్వ బంధు అన్న నానుడికి  అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన, పరస్పర గౌరవప్రదమైన సంబంధం కోసం మేము ఎదురుచూస్తున్నాము.

గౌరవనీయులైన ఉపాధ్యక్షుల గొప్ప ఉపన్యాసాలు నన్ను ఉత్తేజపరిచాయి. వారు రెండు దేశాల మధ్య అందుబాటులో ఉన్న శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించేలా మాట్లాడారు.

భారతదేశం పురోగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ. గత దశాబ్దంలో ఈ పెరుగుదల విపరీతంగాను, చారిత్రాత్మకమైనదిగాను, ప్రపంచవ్యాప్తంగా గుర్తించే స్థాయిలో ఉంది. ఇక్కడ చర్చలు గొప్ప మార్పునకు మార్గం వేస్తాయి.   

భారతదేశం, ఆఫ్రికాల వృద్ధి భాగస్వామ్యం ఉత్ప్రేరకం వలె ఉపయోగపడుతుంది.  ఇది ప్రపంచ శాంతి, సామరస్యానికి మంచి సూచననిచ్చే గ్లోబల్ సౌత్‌ను, బలోపేతం చేయడానికి వేగవంతమైన గ్లోబల్ రీబ్యాలెన్సింగ్‌కు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని నేను ఆశాజనకంగా ఉన్నాను.

చర్చలు చాలా ఫలవంతంగా, ఉత్పాదకంగా ఉంటాయి. మన  ప్రయాణంలో అభివృద్ధిని తదుపరి స్థాయికి మనల్ని తీసుకువెళతాయి.

వైవిధ్యమైన పద్ధతిలో స్నేహ బంధాలను బలోపేతం చేస్తూ, అన్ని స్థాయిలలో మన సహకారాన్ని పెంపొందించుకుంటూ, మానవాళి సంక్షేమం కోసం ప్రతి రంగంలో కలిసి పని చేద్దాం. మానవ వనరులు, గొప్ప ఖనిజ సంపద, సమృద్ధిగా ఉన్న సహజ సంపద పూర్తి సామర్థ్యాన్ని సాధించడంపై ప్రధానంగా దృష్టి సారిద్దాం. వనరులు ఇరువైపులా ఉన్నాయి,  ఇప్పటికే శక్తివంతమైన ఈ భాగస్వామ్యాన్ని విప్లవాత్మకంగా, పరివర్తనాత్మకంగా మార్చండి, తద్వారా భూగోళంలోని ఈ భాగం ప్రపంచ స్థిరత్వం, ప్రపంచ సామరస్యానికి దోహదం చేస్తుంది.

భారతదేశ పెరుగుదల, భారతదేశం వృద్ధి, మానవాళిలో ఆరవ వంతుకు విస్తరించిన, శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగపరంగా అన్ని స్థాయిలలో నిర్మాణాత్మకంగా ప్రపంచ స్థిరత్వం, శాంతికి సూచన. 

భారతదేశం భాగస్వామ్యం, భారతదేశం అడుగుజాడలు, భారతదేశం అందించే చేయూత, భారతదేశం కలిసి పని చేయాలనుకోవడం విస్తరణ కాంక్ష కాదు. చరిత్రాత్మకంగా, ఈ దేశం విస్తరణను ఎన్నడూ విశ్వసించలేదు. అందువల్ల, మా భాగస్వామ్యం, చరిత్రలో లోతుగా నిర్మితమైన ఈ భాగస్వామ్యం, మానవాళి అభివృద్ధికి పెద్ద ప్రపంచ మార్పునకు దోహదం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

****



(Release ID: 2047560) Visitor Counter : 13