వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన్ పోషణ్ కేంద్రాలుగా మారిన 60 చౌక డిపోలు: పైలట్ ని ప్రారంభించిన ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి


'ఎఫ్‌పిఎస్ సహాయ్ అప్లికేషన్', 'మేరా రేషన్ యాప్ 2.0', 'క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్',

'క్వాలిటీ మాన్యువల్ హ్యాండ్‌బుక్', 'కాంట్రాక్ట్ మాన్యువల్ ఎఫ్‌సిఐ',

ఎన్ఏబిఎల్ ధ్రువీకృత 3 లాబొరేటరీల ప్రారంభోత్సవం

జన్ పోషణ్ కేంద్రాలు చౌక డిపో డీలర్లకు మెరుగైన ఆదాయాన్ని,

వినియోగదారులకు పోషకాహారాన్ని అందిస్తాయి: శ్రీ జోషి

Posted On: 20 AUG 2024 3:45PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి 60 చౌక ధరల దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మారుస్తూ పైలట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్‌పిఎస్ సహాయ్ అప్లికేషన్, మేరా రేషన్ యాప్ 2.0, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, క్వాలిటీ మాన్యువల్ హ్యాండ్‌బుక్, కాంట్రాక్ట్ మాన్యువల్ ఎఫ్‌సిఐ, ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్‌లను పొందిన 3 లేబొరేటరీలను కూడా ఆయన ఈరోజు ఇక్కడ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ప్రారంభించిన మొత్తం 6 కార్యక్రమాలు ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, పారదర్శకతను తీసుకురావడం, ఖచ్చితమైన నాణ్యత నియంత్రణ, పోషకాహార లోపాన్ని అరికట్టడం, వ్యవస్థలో లీకేజీలను అరికట్టడం కూడా జరుగుతుందని అన్నారు.

 

గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లోని 60 చౌక ధరల దుకాణాలను ప్రయోగాత్మకంగా జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చుతున్న సందర్భంగా శ్రీ జోషి మాట్లాడుతూ, భారతదేశం అంతటా ఉన్న చౌక ధరల దుకాణం (ఎఫ్పిఎస్) డీలర్ల డిమాండ్‌కు జన్ పోషణ్ కేంద్రం పరిష్కారాన్ని అందిస్తుంది. వారి ఆదాయ స్థాయిని పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. ఈ కేంద్రాలు వినియోగదారులకు విభిన్న శ్రేణి పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందిస్తాయి. అలాగే ఎఫ్పిఎస్ డీలర్‌లకు అదనపు ఆదాయ వనరులను అందిస్తాయి. కేంద్ర ప్రభుత్వం మొదటి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన జన్ పోషణ్ కేంద్రంలో పోషకాహారం కేటగిరీ కింద 50 శాతం ఉత్పత్తులను విక్రయించేందుకు, మిగిలినవి ఇతర గృహోపకరణాలను ఉంచడానికి సదుపాయాన్ని కలిగి ఉంటాయి. కేంద్ర మంత్రి చౌక ధరల దుకాణాల డీలర్లతో కూడా మాట్లాడారు.

 

 

గౌరవ ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో దేశం వికసిత భారత్ 2047 లక్ష్యం దిశగా చైతన్యవంతంగా ముందుకు సాగుతుందని శ్రీ జోషి అన్నారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ చేపట్టిన కార్యక్రమాలు అటువంటి పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని, దేశంలో ఆహార భద్రత పరిధిని పెంచేందుకు దాదాపు రూ. 12 లక్షల కోట్ల ఆర్థిక వ్యయంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఏవై)ని మరో ఐదేళ్ల పాటు పొడిగించారని ఆయన వివరించారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయాల్లేకుండా లావాదేవీలను సులభతరం చేస్తోందన్నారు.

 

డిజిటలైజేషన్‌లో శాఖ చురుకైన ప్రయత్నాల ఫలితంగా లబ్ధిదారులకు వినియోగదారు కేంద్రీకృత సేవలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మేరా రేషన్ యాప్ 2.0, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, క్వాలిటీ మాన్యువల్, కాంట్రాక్ట్ మాన్యువల్, ఎఫ్‌పిఎస్ సహాయ్ అప్లికేషన్, ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్ ఆఫ్ లాబొరేటరీస్ ప్రారంభించడం డిజిటలైజేషన్ ప్రయత్నాలకు మరింత ఊపునిస్తుందని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో మరిన్ని ఆవిష్కరణలు, మొత్తం మెరుగుదలను తీసుకురావడానికి  సూచనలను స్వీకరించడానికి డిపార్ట్ మెంటు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

సిడ్బి చేత అభివృద్ధి చేయించిన, “ఎఫ్‌పిఎస్ సహాయ్” అనేది ఆన్-డిమాండ్ ఇన్‌వాయిస్ బేస్డ్ ఫైనాన్సింగ్ (ఐబిఎఫ్) అప్లికేషన్, ఇది ఎఫ్‌పిఎస్ డీలర్లకు పూర్తిగా కాగిత రహిత, మనిషి ఎదురుగా లేకపోయినాఅనుషంగిక రహితమైన, నగదు ప్రవాహ ఆధారిత రుణం అందించడానికి రూపొందించారు. మేరా రేషన్ యాప్ 2.0 మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల కోసం మరిన్ని విలువ జోడించిన ఫీచర్లతో ప్రారంభించారు. డిపార్ట్ మెంట్ అధికారులు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన) కూడా రేషన్ కార్డులు, పిడిఎస్‌లకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందవచ్చు.

క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది డీ.ఎఫ్.పీ.డీ, ఎఫ్‌సిఐలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ల ఏకీకరణ కోసం ఒక డిజిటల్ అప్లికేషన్. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ల కోసం డిజిటల్ క్యూఎంఎస్ ఒక ముఖ్యమైన సాధనం, సేకరణ, నిల్వ, పంపిణీ దశల్లో రియల్ టైంలో అన్ని కీలక లావాదేవీలను నమోదు చేయగలదు. డిఎఫ్పిడి ఒక సమగ్ర నాణ్యత నియంత్రణ హ్యాండ్‌బుక్‌ను రూపొందించింది, ఇది సెంట్రల్ పూల్ ఆహార ధాన్యాల ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడానికి అనుసరించాల్సిన వివిధ విధానాలు, ప్రమాణాలు, రోడ్‌మ్యాప్, విధానాల ఖచ్చితమైన వివరణను అందిస్తుంది.

 

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) కాంట్రాక్ట్ మాన్యువల్‌ను కూడా ప్రారంభించారు.  ఎఫ్‌సిఐ కాంట్రాక్ట్ మాన్యువల్ అన్ని అస్పష్టతలను తొలగించడానికి, పోటీతత్వాన్ని నిర్ధారించడానికి, కాంట్రాక్టులలో అత్యంత పారదర్శకతను తీసుకురావడానికి మార్గదర్శక పత్రంగా పరిగణించవచ్చు. ఎన్ఏబిఎల్ ల్యాబ్‌ల అక్రిడిటేషన్ డిపార్ట్ మెంట్ లాబొరేటరీలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం, టెస్టింగ్, కాలిబ్రేషన్ సేవల్లో నాణ్యత, విశ్వసనీయతను నిర్ధారించడంతోపాటు వినియోగదారుల విశ్వాసం, సంతృప్తిని పొందడం చాలా కీలకం.

***


(Release ID: 2047111) Visitor Counter : 112