కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
‘ఇఎస్ఐసి’ డైరెక్టర్ జనరల్‌గా శ్రీ అశోక్ కుమార్ సింగ్ పదవీబాధ్యతల స్వీకారం
प्रविष्टि तिथि:
19 AUG 2024 3:05PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన ‘ఐఎఎస్’ అధికారి శ్రీ అశోక్ కుమార్ ఇవాళ న్యూఢిల్లీలో అధికార బాధ్యతలు స్వీకరించారు.
శ్రీ అశోక్ కుమార్ సింగ్ 1999 బ్యాచ్ ఐఎఎస్ అధికారి కాగా, కేరళ కేడర్ కింద ఆ రాష్ట్ర జల వనరుల శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రాష్ట్ర/జిల్లా స్థాయి సంస్థల పరిపాలన, నిర్వహణ విధులలో ఆయనకు అపార అనుభవం ఉంది.
అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసిజి) కార్యనిర్వాహక సంచాలక బాధ్యతలతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆర్థిక శాఖలో డైరెక్టరుగా కూడా శ్రీ అశోక్ కుమార్ సింగ్ సేవలందించారు.
శ్రీ సింగ్ న్యూఢిల్లీలోని ‘నేషనల్ డిఫెన్స్ కాలేజీ’ నుంచి ఎం.ఫిల్., ఐఐటి-కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా సాధించారు.
***
(रिलीज़ आईडी: 2046814)
आगंतुक पटल : 118