ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అవ‌య‌వ దానం మ‌నిషి స్వభావానికి అత్యుత్తమ నైతిక‌ ఉదాహ‌ర‌ణ‌: ఉప రాష్ట్రపతి అవ‌య‌వ‌ దానాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలన్న ఉప రాష్ట్రపతి


బలహీనుల వంచనకు పాల్పడే వ్యాపారంగా అవయవ దాన కార్యక్రమం ఉండరాదన్న ఉప రాష్ట్రపతి

స‌మాజ సంక్షేమానికి సాధనంగా మాన‌వ‌దేహం: ఉప రాష్ట్రపతి

ప్రజాస్వామ్యాన్ని వంచించిన గతానుభవాలను చెప్పడం ద్వారా యువతను చైతన్యవంతం చేయాలి: ఉప రాష్ట్రపతి

Posted On: 18 AUG 2024 2:38PM by PIB Hyderabad

అవ‌య‌వ‌దానం ప్రాధాన్యత గురించి ఉప రాష్ట్రపతి శ్రీ ధ‌న్ ఖర్ మాట్లాడుతూ "అవ‌య‌వ‌దానం ఆధ్యాత్మికం, మాన‌వ స్వభావానికి అత్యుత్తమ నైతిక ఉదాహ‌ర‌ణ‌" గా ఆయ‌న‌ అభివర్ణించారు. అవ‌య‌వ‌దానం సాధారణ దాతృత్వానికి మించిన‌ద‌కీ, క‌రుణ, నిస్వార్థం అనే గొప్ప సుగుణాల‌ను ప్రతిఫలిస్తుందని ఆయ‌న నొక్కి చెప్పారు. 

జైపూర్ కు చెందిన జైన్ సోష‌ల్ గ్రూప్స్ ( జెఎస్ జి) కేంద్ర కార్యాల‌యం, ఢిల్లీలోని ద‌ధీచి దేహ్ దాన్ స‌మితి జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. అవయవ దానం చేసిన‌ వారి కుటుంబాల‌ను సత్కరించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. అవ‌య‌వాల దానాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలనీ, మాన‌వాళికి సేవ‌ చేసే అత్యుత్తమ సంప్రదాయంగా దీనిని చూడాల‌ని ఆయ‌న కోరారు.

ప్రపంచ అవ‌య‌వ‌దాన దిన స్ఫూర్తిని గుర్తు చేస్తూ "ఇత‌రుల జీవితాల్లో మీరు చిరున‌వ్వులు పూయించండి" అని ఆకాంక్షించారు. ఈ అత్యుత్తమ సేవ‌కు వ్యక్తిగతంగా, కుటుంబ‌ప‌రంగా అందరూ నిబద్ధతను కలిగి ఉండాలంటూ అంద‌రినీ ప్రోత్సహించారు. ‘‘ఇదం శరీరం పరమార్థ సాధనమ్’’ అన్న ఆర్యోక్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక గొప్ప పని చేయడానికి మానవ దేహం ఎలా ఉపయోగపడుతున్నదీ స్పష్టం చేశారు. విస్తృత సామాజిక సంక్షేమానికి మానవ దేహం ఉపకరిస్తుందని తెలిపారు.

సమాజ హితం కోసం పనిచేయగలిగిన తెలివితేటలు ఉన్న యువకులున్నారని, వారికి అవసరమైన అవయవాలు లేక వారు అనుకున్న పనులు చేయలేకపోతున్నార చెబుతూ ‘‘మీరు వారికి సాయం చేస్తే, వారు సమాజానికి భారం కాకుండా, సమజానికి వరంగా మారతారు’’ అని ఉప రాష్ట్రపతి సూచించారు.

అవ‌య‌వ‌దానంలో పెరుగుతున్న వ్యాపార ధోరణిని ప్రస్తావిస్తూ, దానిని వైరస్ మహమ్మారితో పోల్చారు ఉప రాష్ట్రపతి.

వ్యాపార దృష్టితో కాకుండా సామాజిక హిత దృష్టితో అవ‌య‌వదానం చేయాలని శ్రీ ధ‌న్ ఖర్ మార్గనిర్దేశం చేశారు. వైద్యవృత్తిని దైవ కార్యంగా అభివర్ణిస్తూ, కోవిడ్ స‌మ‌యంలో ఆరోగ్య సిబ్బంది చేసిన నిస్వార్థ సేవ‌ల‌ను గుర్తు చేశారు. కానీ, ఆరోగ్య రంగానికి చెందిన కొంత‌మంది స్వార్థపరుల కార‌ణంగా అవ‌య‌వ‌దానానికి ఉన్న గొప్పదనం తెలియకుండా పోతోందన్నారు. బలహీనతలను ఆధారంగా చేసుకుని మోసపూరిత వ్యాపారం చేసే వారికి అవయవ దానం ఒక అవకాశంగా ఉండటాన్ని అనుమతించరాదని సూచించారు.

నిస్వార్థ సేవకూ, త్యాగానికీ నిలయమైన భారత దేశపు చరిత్ర, సంస్కృతులను గుర్తు చేశారు. వేదాలు, ప్రాచీన గ్రంథాల్లోని జ్ఞానానీ, దార్శనికతనూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితవు పలికారు.

 

భిన్నాభిప్రాయాలు ఉండటం ప్రజాస్వామ్య లక్షణమని, అయితే ఈ విభేదాల కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టకూడదని అన్నారు. గ‌తంలో అత్యయిక పరిస్థితిని విధించిన స‌మ‌యంలో ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ప్రమాదాల గురించి యువ‌త‌రంలో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వ్యాపారవేత్తలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యంత అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తువుల‌ను మాత్రమే దిగుమ‌తి చేసుకోవాల‌ని శ్రీ ధన్ ఖర్ త‌న ప్రసంగంలో సూచించారు.

ఉప రాష్ట్రపతి ప్రసంగంలోని కీల‌క అంశాల‌ కోసం లింక్‌:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2046404

***



(Release ID: 2046562) Visitor Counter : 33