హోం మంత్రిత్వ శాఖ
రిటైర్డ్ అగ్నివీరులకు ఉద్యోగాలు
Posted On:
06 AUG 2024 4:32PM by PIB Hyderabad
కేంద్ర సాయుధ దళాలు (సిఏపిఎఫ్), అస్సాం రైఫిల్స్ లో దళాల వారీగా పోస్టుల మంజూరైన తర్వాత సిబ్బంది సంఖ్య, ప్రస్తుత సిబ్బంది సంఖ్య (01.07.2024 నాటికి)
దళాలు
|
మంజూరు తర్వాత సిబ్బంది
|
ప్రస్తుత సిబ్బంది
|
అస్సాం రైఫిల్స్ (ఏఆర్)
|
65,536
|
62,575
|
సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)
|
2,65,808
|
2,55,663
|
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్)
|
1,86,924
|
1,51,925
|
కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్ పిఎఫ్)
|
3,30,851
|
2,98,033
|
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)
|
98,858
|
90,000
|
సశస్ర్త సీమ బల్ (ఎస్ఎస్ బి)
|
97,774
|
91,922
|
మొత్తం
|
10,45,751
|
9,50,118
|
ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ. యుపిఎస్ సి, ఎస్ఎస్ సి, సంబంధిత దళాల ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను మంత్రిత్వ శాఖ చిత్తశుద్ధితో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో 67,345 నియామకాలను చేపట్టారు. ఇవి కాకుండా మరో 64,091 ఖాళీలున్నాయనీ, వీటి భర్తీ వివిధ దశల్లో ఉంది.
దీనికి తోడు సిఏపిఎఫ్, ఎఆర్ లలో ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి వీలుగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది.
i. కానిస్టేబుల్ పోస్టుల (జనరల్ డ్యూటీ)ను ప్రతి ఏడాదీ భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీతో (ఎస్ఎస్ సి) ఒక అవగాహన కుదుర్చుకున్నారు.
ii. జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీని సమన్వయం చేసేందుకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), సబ్-ఇన్ స్పెక్టర్ (జిడి), అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ) స్థాయుల్లో దీర్ఘకాలిక ప్రాతిపదికన సమన్వయ కమిటీని నియమించారు.
iii. నిర్దిష్ట కాలపరిమితిలో నాన్-జనరల్ డ్యూటీ క్యాడర్ లోని ఖాళీల భర్తీకి నియామకాలు చేపట్టేందుకు కేంద్ర సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ కు ఆదేశాలు జారీ చేశారు.
iv. ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడానికి ఉద్దేశించిన పోస్టుల కోసం నిర్దిష్ట కాలపరిమితిలో డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) సమావేశాలు నిర్వహిస్తున్నారు.
v. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి వైద్యపరీక్షలకు అయ్యే సమయాన్ని తగ్గించారు.
vi. అభ్యర్థుల కొరతను దృష్టిలో ఉంచుకుని, కానిస్టేబుల్/జిడి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించారు ( కొరత ఉన్న విభాగాలకు).
సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ సహా కేంద్ర సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)/ రైఫిల్ మాన్ ఖాళీల్లో 10% మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు, శారీరక దారుఢ్య పరీక్ష నుంచి మినహాయంపు కూడా ఇస్తున్నారు.
అన్ని దళాల్లోనూ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)/ రైఫిల్ మాన్ (జనరల్ డ్యూటీ) నియామక నిబంధనలు సవరించారు. మాజీ అగ్నివీరులు సుశిక్షితులైన వారు కావడం వల్ల సిఏపిఎఫ్ దళాల్లో చేరిన అనంతరం వారికి ఆ దళానికి సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీని వల్ల వారు తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించేందుకు సిద్ధం కాగలుగుతారు. ఆ రకంగా సిఏపిఎఫ్ సిబ్బంది నిర్వహించే విధుల్ని చేపట్టేందుకు వీలుగా మాజీ అగ్నివీరులు శిక్షితులు కావడంతో పాటు అందుకు అవసరమైన నైపుణ్యాలు సంపాదిస్తారు.
హోం శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద రాయ్ లోక్ సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ అంశాలను తెలియచేశారు.
***
(Release ID: 2046506)
Visitor Counter : 33