పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రా విమానాశ్రయంలో రూ.1549 కోట్ల అంచనా వ్యయంతో నూతన పౌర విమానయాన సదుపాయానికి మంత్రివర్గం ఆమోదం
प्रविष्टि तिथि:
16 AUG 2024 8:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1549 కోట్ల అంచనా వ్యయంతో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని బాగ్దోగ్రా విమానాశ్రయంలో పౌర విమానయాన సదుపాయం అభివృద్ధి చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ) చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనం 70,390 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో రద్దీ సమయాల్లో 3000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రానుంది. దీని వార్షిక సామర్థ్యం 10 మిలియన్ల మంది ప్రయాణీకులు. ఏ-321 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనువైన 10 పార్కింగ్ బేలు, అలాగే రెండు లింక్ టాక్సీవేలు, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్‌లను ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగిన ఒక అప్రాన్ నిర్మాణం ఈ ప్రాజెక్ట్లో ముఖ్య భాగాలు. పర్యావరణ బాధ్యతను నొక్కి చెబుతూ, టెర్మినల్ భవనం గ్రీన్ బిల్డింగ్‌గా ఉంటుంది, పునరుత్పాదక ఇంధన వనరులను ఏకీకృతం చేస్తుంది. పర్యావరణ దుష్పరిణామాలను తగ్గించడానికి సహజ కాంతిని పెంచుతుంది.
ఈ కొత్త నిర్ణయం బాగ్దోగ్రా విమానాశ్రయం ఆపరేషన్ సామర్థ్యాన్ని, ప్రయాణీకుల అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది, ఈ ప్రాంతానికి కీలకమైన విమాన ప్రయాణ కేంద్రంగా దాని పాత్రను బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2046266)
आगंतुक पटल : 100