సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 సంవత్సరానికి గాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన. ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'ఆట్టమ్'


ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును దక్కించుకున్న అయేనా (మిర్రర్). ఉత్తమ డాక్యుమెంటరీగా ‘మర్మర్స్ ఆఫ్ ది జంగిల్’

కాంతారా హీరో- రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి పురస్కారం, తిరుచిత్రాంబళం చిత్రానికి గాను ఉత్తమ నటిగా నిత్యామీనన్.

ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా, ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా.

ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్)లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ

ఉత్తమ సినీ పుస్తకంగా ఎంపికైన కిశోర్ కుమార్: ది అల్టిమేట్ బయోగ్రఫీ

Posted On: 16 AUG 2024 4:15PM by PIB Hyderabad

2022 ఏడాదికి గానూ 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ కమిటీ ఈ రోజు ప్రకటించింది.

ఫీచర్ చిత్రాల జ్యూరీ చైర్ పర్సన్ రాహుల్ రవైల్, నాన్ ఫీచర్ చిత్రాల జ్యూరీ చైర్ పర్సన్ శ్రీ నీలా మాధబ్ పాండా, ఉత్తమ సినీ రచన జ్యూరీ చైర్ పర్సన్ శ్రీ గంగాధర్ ముదలియార్ ఇతర జ్యూరీ సభ్యులు కేంద్ర రైల్వే శాఖ, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ను కలిసి 2022 సంవత్సరానికి గాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల అవార్డు విజేతల జాబితాను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్ మురుగన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలు) వృందా దేశాయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జ్యూరీలో భారతీయ సినీరంగంలోని ప్రఖ్యాత దర్శకులు, సినీ ప్రముఖులు ఉన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలు) శ్రీమతి బృందా దేశాయ్ సమక్షంలో ఫీచర్ చిత్రాల జ్యూరీ చైర్ పర్సన్ రాహుల్ రవైల్, నాన్ ఫీచర్ చిత్రాల జ్యూరీ చైర్ పర్సన్ శ్రీ నీలా మాధబ్ పాండా, ఉత్తమ సినీ రచన జ్యూరీ చైర్ పర్సన్ శ్రీ గంగాధర్ ముదలియార్ అవార్డులను ప్రకటించారు.

 

70వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ఆనంద్ ఏకార్షి దర్శకత్వం వహించిన ఆట్టమ్ (ది ప్లే) ఎంపిక కాగా, ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా సిద్ధాంత్ సరీన్ దర్శకత్వం వహించిన అయేనా (మిర్రర్) చిత్రానికి పురస్కారం లభించింది.
అనిరుద్ధ భట్టచార్జి, పార్థివ్ ధార్ రచించిన ‘‘కిశోర్ కుమార్: ది అల్టిమేట్ బయోగ్రఫీ’’కి ఉత్తమ సినీ పుస్తకంగా అవార్డు పొందింది.
సంపూర్ణ వినోదాన్ని అందించే విభాగంలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కాంతార పురస్కారాన్ని గెలుపొందింది.

'కాంతార' చిత్రంలో నటనకు గాను రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా, తిరుచిత్రాంబళం చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యామీనన్ పురస్కారాన్ని గెలుపొందారు.

ఉత్తమ సహాయ నటుడి విభాగంలో పవన్ రాజ్ మల్హోత్రా, ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా ఎంపికయ్యారు.


వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లతో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్) విభాగంలో ఉత్తమ చిత్రంగా బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, 
 జయకర్ ఆరుద్ర, విరాల్ టక్కర్, నీలేష్ గోరే వీఎఫ్ఎక్స్ పర్యవేక్షకులుగా ఉన్నారు.

అవార్డులు పొందినవారి పూర్తి జాబితా కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2045960

***


(Release ID: 2046196) Visitor Counter : 167