కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉత్సాహంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించిన తపాలా శాఖ; అహ్మదాబాద్
జీపీవోలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ యాదవ్
స్వాతంత్ర్య దినోత్సవం వేడుక మాత్రమే కాదు; స్వాభిమానానికి, గౌరవానికీ ప్రతీక - పోస్ట్ మాస్టర్
జనరల్ కృష్ణ కుమార్ యాదవ్
అన్ని పోస్టాఫీసుల్లో స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు డాక్ చౌపాల్స్ నిర్వహణ ద్వారా ప్రభుత్వ
సంక్షేమ సేవలపై అవగాహన
Posted On:
15 AUG 2024 1:30PM by PIB Hyderabad
తపాలా శాఖ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఉత్తర గుజరాత్ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీకృష్ణ కుమార్ యాదవ్ అహ్మదాబాద్ జీపీవో వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వివిధ రంగాలలో విశేష సేవలందించిన తపాలా ఉద్యోగులను సన్మానించారు. ఉత్తర గుజరాత్ లోని అన్ని పోస్టాఫీసుల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డాక్ చౌపాళ్లను నిర్వహించారు.
పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని;స్వాభిమానానికి, గౌరవానికి ప్రతీక అని అన్నారు. జాతీయ పతాకం జాతీయ సమగ్రతను సూచిస్తుందని, ప్రతి భారతీయుడి ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం కింద ఇంటింటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చేయడం ద్వారా తపాలా శాఖ దేశభక్తిని పెంపొందించింది. తమ రంగంలో నిజాయితీగా పనిచేస్తూ,ప్రజలకు సేవలందించడం ద్వారా, దేశ పురోగతికి దోహదపడగలమని ఆయన స్పష్టంచేశారు. స్వాతంత్ర్య దినోత్సవం మన స్వేచ్ఛా భావనను పునరుత్తేజితం చేసుకునే అవకాశాన్నిచ్చి; హక్కులతో పాటు విధులపైనా అవగాహన కల్పిస్తుందన్నారు.
స్వాతంత్య్ర ఆదర్శాలను గుర్తించి, మహాత్ముల త్యాగాలను స్మరించుకుంటూ, ఇది యువతరాన్ని భాగస్వామ్యం చేయాల్సిన సమయమని శ్రీ యాదవ్ అన్నారు.
‘డాక్ చౌపాల్’ ప్రారంభోత్సవం సందర్భంగా పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సేవలందించడంలో ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య తపాలా కార్యాలయాలు ముఖ్యమైన అనుసంధానంగా మారాయన్నారు. పోస్టాఫీసుల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సమాజంలోని అన్ని వర్గాలకు ఈ సేవలను అందించడం ద్వారా మన విధి నిర్వహణతో పాటు ప్రజల హక్కులను నిలబెట్టగలమని, ఇదే స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తి అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకాలు, మహిళా సమ్మాన్ పొదుపు ధ్రువీకరణ పత్రాలను అందించారు.
బలమైన, సుసంపన్నమైన మహిళా సాధికారత గల సమాజం ఆవశ్యకమని పిలుపునిచ్చారు.
సేవింగ్స్ బ్యాంకులు, పోస్టల్ జీవిత బీమా, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పాస్ పోర్ట్
సేవలు, ఆధార్ నమోదు - నవీకరణ, ఉమ్మడి సేవా కేంద్రాలు, డాక్ ఘర్ నిర్యత్ కేంద్ర వంటి ప్రభుత్వ పరమైన పనుల్లో తపాలా శాఖ నిమగ్నమై ఉందని పోస్టు మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు. ఐపీపీబీ ద్వారా పోస్టుమ్యాన్ లు ఇప్పుడు సంచార బ్యాంకులుగా పనిచేస్తున్నారు. పిల్లల కోసం ఆధార్ నమోదు, మొబైల్ నవీకరణలు, డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రాలు, డీబీటీ, బిల్లు చెల్లింపులు, ఏఈపీఎస్ లావాదేవీలు, వాహన బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన వంటి సేవలను పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటింటికీ అందిస్తున్నారు.
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, పోస్టల్ సేవల డైరెక్టర్ శ్రీమతి ఎం.కె. షా అందరికీ హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో తపాలా సేవలు పోషించిన కీలక పాత్రను ఆమె తన ప్రసంగంలో వివరించారు. దేశాభివృద్ధి, అనుసంధానతలో ఆ శాఖ అందించిన కీలక సహకారాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా, పోస్టల్ సేవల డైరెక్టర్ ఎం.కె. షా, ఎంఎంఎస్ మేనేజర్ శ్రీ ధరమ్ వీర్ సింగ్, ముఖ్య పోస్టు మాస్టర్ శ్రీగోవింద్ శర్మ, ఉప ముఖ్య పోస్టు మాస్టర్ శ్రీ రితుల్ గాంధీ, సహాయక డైరెక్టర్ శ్రీమతి ఎం.ఎ. పటేల్, గణాంక అధికారి శ్రీ పంకజ్ స్నేహి, సహాయక గణాంక అధికారి శ్రీ చేతన్ సైన్, సహాయక విచారకుడు శ్రీ దవళ్ బావిసి, శ్రీ జినేశ్ పటేల్, శ్రీ రమేశ్ పటేల్, పోస్టు ఇన్ స్పెక్టర్లు శ్రీ భవిన్ ప్రజాపతి, శ్రీమతి పాయల్ పటేల్, శ్రీ యోగేంద్ర రాథోడ్, శ్రీ విపుల్ చదోతరతో
పాటు పలువురు అధికారులు హాజరై స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు
***
(Release ID: 2045761)
Visitor Counter : 53