పర్యటక మంత్రిత్వ శాఖ
మన దేశం ప్రపంచంలోనే గొప్పదిగా ఎదుగుతుందనే తిరుగులేని నమ్మకాన్ని కల్పించడంతో పాటు మన ఆశావహ భవిష్యత్తును సచేతనంగా చిత్రీకరించిన ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
Posted On:
15 AUG 2024 2:23PM by PIB Hyderabad
మన దేశం ప్రపంచంలోనే గొప్పదిగా ఎదుగుతుందనే తిరుగులేని నమ్మకాన్ని కల్పించడంతో పాటు మన ఆశావహ భవిష్యత్తును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సచేతనంగా చిత్రీకరించిందని కేంద్ర సంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
'ఎక్స్' మాధ్యమంలో చేసిన పోస్టులో శ్రీ షెకావత్.. “మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌ను ఉద్దేశించి చేసిన తన 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం మన ఆశావహ భవిష్యత్తును సచేతనంగా చిత్రీకరించడంతో పాటు ప్రపంచంలోనే గొప్పదిగా మన దేశం ఎదుగుతుందనే తిరుగులేని నమ్మకాన్ని కల్పించింది. గత దశాబ్దకాలంలో భారత్ ప్రపంచ మేలు కోసం ధైర్యం చేసే, శ్రద్ధ చూపే, మార్పు దిశగా నడిచే నూతన భారత్‌గా మారిపోయింది. ఈ నూతన భారత్ సమ్మిళిత వృద్ధితో సాధించే ప్రపంచ కీర్తిని ఆశిస్తోంది. ఈ నూతన భారత్ వలస పాలన పరదాను వదిలేసి వారసత్వ, సంప్రదాయ విలువలను గర్వంగా ధరించడంతో పాటు ప్రపంచాన్ని సైతం తన తోవలో నడవాలని కోరుతోంది. ప్రజల చేత సాగే పరిపాలన ఉన్న నూతన భారత్.. సుపరిపాలన, ప్రజాస్వామ్య నాయకత్వంపై కొత్త అధ్యయాన్ని లిఖిస్తుంది.” అని పేర్కొన్నారు.
***
BY
(Release ID: 2045639)
Visitor Counter : 100