సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక శాఖ పరిధిలోని సంస్థలు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా 2024 లో భాగంగా ఢిల్లీలో తిరంగా యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు


లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యం లో తిరంగా కార్యక్రమం

తిరంగా యాత్రలో 2500 మందికి పైగా పాఠశాల విద్యార్థులు, యువకులు, కళాకారులు, సృజనాత్మక కళాకారులు, యువ వ్లాగర్లు, అధికారులు

Posted On: 13 AUG 2024 6:57PM by PIB Hyderabad

భారత  78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే సందర్భంగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని 3 సంస్థలు - లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలు కలిసి ఢిల్లీలో అద్భుతమైన తిరంగా యాత్రను నిర్వహించాయి.

వర్ణశోభితమైన ఈ కార్యక్రమంలో యువకులు, కళాకారులు, సృజనాత్మక కళాకారులు, కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, యువ వ్లాగర్లు, అధికారులు, 2500 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యా విహార్ పాఠశాల, కాస్మోస్ పాఠశాల, కాథర్సిస్ వరల్డ్ స్కూల్ వంటి వివిధ సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, కథక్ కేంద్ర కళాకారులు, అధికారులు, సిబ్బంది తిరంగా యాత్రలో పాల్గొన్నారు.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉమా నందూరి, సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యా పూరేచా, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస రావు, లలిత కళా అకాడమీ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి శ్రీ రాజు దాస్ నేతృత్వంలో తిరంగా యాత్ర రబీంద్ర భవన్, మండీ హౌస్ నుంచి  ప్రారంభమై 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

దేశభక్తి స్ఫూర్తికి సంకేతంగా కళాకారులు,  కళాశాల విద్యార్థులు కలిసి 30-అడుగుల పొడవైన పెయింటింగ్‌ను రూపొందించారు. "హర్ ఘర్ తిరంగా" అనే ఇతివృత్తంతో పెయింటింగ్ పోటీని నిర్వహించారు.  ఇది యువ కళాకారుల సృజనాత్మకత, ప్రతిభను ప్రదర్శించడం ద్వారా ఈ వేడుకలో  మరింత ఉత్సాహం నింపింది.

సంగీత నాటక అకాడమీ కళాకారుల మంత్రముగ్ధం చేసే ప్రదర్శనలు ఈ వేడుకను ఉత్సవీకరించాయి. ఈ  ఊరేగింపు  ముందుభాగంలో  చివరన నడిచిన కళాకారుల ఆకర్షణీయమైన సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలను వర్ణభరితం చేస్తూ ఓ ఉత్సవానుభూతిని నింపాయి.

కళాశాల, విద్యా విహార్ పాఠశాల, కాస్మోస్ పాఠశాల, కాథర్సిస్ వరల్డ్ స్కూల్ వంటి వివిధ సంస్థల నుండి 2,500 మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, కథక్ కేంద్ర కళాకారులు, అధికారులు, సిబ్బంది   ఉత్సాహంగా పాల్గొన్నారు.

తిరంగా యాత్ర భారతదేశ ఘనమైన వారసత్వం, దేశ సమైక్యత కోసం దేశభక్తి స్ఫూర్తికి ఒక శక్తిమంతమైన  గుర్తుగా నిలిచింది. 

****


(Release ID: 2045313) Visitor Counter : 38