జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో చేనేత మేళా విరాసత్ ప్రదర్శనను సందర్శించిన శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ పబిత్రా మార్గరీటా

Posted On: 12 AUG 2024 5:30PM by PIB Hyderabad

10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 3 నుంచి  16వరకు న్యూఢిల్లీలో ని జన్‌పథ్ లో  నిర్వహిస్తున్నచేనేత మేళా, పదిహేను రోజుల ప్రదర్శన “విరాసత్”ను కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా సందర్శించారు.

చేనేత కార్మికులు, కళాకారులతో శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. నేత కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన ఆదాయ అవకాశాలను కల్పించడం కోసం టెక్స్‌టైల్ వేల్యూ  చైన్‌ను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. సుస్థిరత, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించిన ప్రపంచంలోనే అతిపెద్ద చేనేత సంఘం భారత్‌లో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. సుస్థిరమైన ఉత్పత్తుల వినియోగం దిశగా ప్రపంచం ముందుకుసాగుతున్న క్రమంలో, కార్బన్ ఉద్గారాలు లేని, ఎలాంటి ఇంధనాలను, నీటిని కూడా ఉపయోగించకుండా పనిచేస్తున్న రంగంగా చేనేత పరిశ్రమ నిలుస్తుందని కొనియాడారు.

చేనేత రంగంలో సహజ పద్ధతిలో రంగులు వేసే ప్రక్రియ ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించిన శ్రీ పబిత్రా మార్గరీటా, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ పరిశ్రమలో సహజ రంగుల చేనేత వస్త్రాల మార్కెట్ కు  అధిక డిమాండ్‌ ఉందని అన్నారు. చేనేత కార్మికులు సహజ రంగులను ఉపయోగించడం ద్వారా విలువను జోడించడం మాత్రమే కాకుండా వారి ఆదాయాలను కూడా పెంచుకోవచ్చన్నారు.

చేనేత మేళాలో మొక్కలు నాటడం ద్వారా “ఏక్‌పేడ్‌మాకేనామ్” ప్రచారానికి మంత్రులు మద్దతు తెలిపారు. వారు "హర్‌ఘర్‌తిరంగా" ప్రచారంలో భాగంగా చేనేత నేత కార్మికులు, కళాకారులకు త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు.

ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో ఇందులో అమ్మకానికి ఉంచారు. వీటిలో కోసా, చందేరి, మధుబని, మంగళగిరి, మేఖ్లా చాదర్, మొయిరాంగ్ ఫీ, ఇక్కత్ మొదలైన రకాలు ఉన్నాయి.

చేనేత మేళాలో చేనేత కార్మికులు, చేతివృత్తుల కళాకారులు వారి ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి 75 స్టాల్స్, అపెక్స్ సొసైటీలు, బోర్డులు మొదలైన వాటి ద్వారా '౦౭' స్టాల్స్ ఏర్పాటు చేయడం సహా, చేనేత మేళాలో దేశపు సున్నితమైన చేనేత వస్త్రాల క్యూరేటెడ్ థీమ్ ప్రదర్శన, సహజ రంగులు, కస్తూరి కాటన్, డిజైన్, ఎగుమతులపై వర్క్‌షాప్‌లు, ఆగస్టు 12న నేత కార్మికులు, కళాకారుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం, లయన్ మగ్గం, ఫ్రేమ్ మగ్గం వంటి మగ్గాల ప్రత్యక్ష ప్రదర్శన, భారతదేశ జానపద నృత్యాలు, రుచికరమైన ప్రాంతీయ వంటకాల ప్రదర్శన మొదలైన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం మాత్రమే. ఉత్పత్తుల ప్రత్యేకతను హైలైట్ చేయడంతో పాటు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, వాటికి ప్రత్యేకమైన గుర్తింపును అందించడానికి, ఎలాంటి లోపాలులేని, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేని అధిక-నాణ్యత గల ఉత్పత్తుల బ్రాండ్ లుగా  ప్రభుత్వం చేనేతరంగం కోసం పలు పథకాలను ప్రారంభించింది. అలాగే కొనుగోలు చేసే ఉత్పత్తి నిజంగా చేతితోనే  నేశారనే భరోసాను  కొనుగోలుదారులకు ఇస్తుంది.

 

ప్రదర్శన కారులు తమ అత్యద్భుతమైన ఉత్పత్తులను ప్రదర్శించేలా ప్రోత్సహించడంతోపాటు చేనేత ఉత్పత్తుల మార్కెట్‌ను, చేనేత సంఘం ఆదాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

"విరాసత్" శ్రేణిలో ఈ "ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ ఎక్స్‌పో" గత సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు కొనసాగింపుగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7న 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అద్భుతమైన చేనేత, హస్తకళల సంప్రదాయంపై దృష్టి సారిస్తుంది. ఇది చేనేత నేత కార్మికులు, కళాకారులను మార్కెట్‌తో అనుసంధానిస్తుంది.

                                                                                                             

***



(Release ID: 2044936) Visitor Counter : 31