ఆయుష్
పిఎం-జెఏవై కింద ఆయుష్ పథకం
Posted On:
09 AUG 2024 5:36PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి - జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) పథకమనేది ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణను అందించడమే లక్ష్యంగా రూపొందించిన పథకం. దేశ జనాభాలో 40శాతంగా ఉన్న 12.34 కోట్ల కుటుంబాలకు అంటే సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తారు.
ఆయుష్మాన్ భారత్ పిఎం- జెఏవై కింద ఆయుష్ ప్యాకేజీలను చేర్చాలని ప్రతిపాదన చేశారు.
ఈ విషయంలో, ఆయుష్మాన్ భారత్ పిఎం- జెఏవైతో ఆయుష్ ప్యాకేజీల ప్రతిపాదిత కలయిక అమలు నమూనాపై అవసరమైన చర్చల కోసం ఎన్ హెచ్ ఏ , ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం మధ్య సమావేశాలు జరిగాయనే విషయాన్ని గుర్తించాలి. అమలు చేసే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన విస్తృత వాటాదారులతో సంప్రదింపులు జరిగాయి. ఇంకా, ప్యాకేజీ రూపకల్పన, ప్యాకేజీ ఖర్చు, ఆయుష్ హాస్పిటల్ ఆన్-బోర్డింగ్, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు దింపులు జరిగాయి. ఇంకా, ప్యాకేజీ రూపకల్పన, ప్యాకేజీ ఖర్చు, ఆయుష్ హాస్పిటల్ ఆన్-బోర్డింగ్, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు , నిష్పాక్షికంగా నిర్వచితమైన చికిత్స ఫలితాలు, ఆర్థికపరమైన చిక్కులు మొదలైన వాటితో సహా ఆయుష్ ప్యాకేజీ ఏకీకరణకు చెందిన వివిధ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
(i) కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ( సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ )లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.. అల్లోపతి , ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, యునాని, సిద్ధ , హోమియోపతి వైద్య విధానాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలుగుతారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఒక ఆయుర్వేద ఆసుపత్రితో పాటు 110 ఆయుష్ వెల్నెస్ కేంద్రాలను నడుపుతోంది. అదనంగా, 20 మంది యోగా ఇంటర్నీలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా తో కలిసి వివిధ కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథక వెల్‌నెస్ కేంద్రాల లబ్ధిదారులకు యోగా చికిత్సలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం ఢిల్లీ / ఎన్ సి ఆర్ లో 54 ఎంప్యానల్ ఆయుష్ డే కేర్ థెరపీ కేంద్రాలను, దేశవ్యాప్తంగా 45 ఎంప్యానెల్డ్ ఐపిడి (ఇన్-పేషెంట్ డిపార్ట్‌మెంట్) ఆయుష్ హెల్త్ కేర్ సంస్థ లను కలిగి ఉంది. ఈ సౌకర్యాలు కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం లబ్ధిదారులకు ఆయుర్వేదం, యోగా. నేచురోపతి, యునాని, సిద్ధ వైద్య విధానంలోసమగ్ర ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి. ఈ పనిని కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకంవారి ఆమోదిత విధానాలు, రేట్ల ప్రకారం అందిస్తారు.
ఈ నెట్‌వర్క్ అనేది ఆయుష్ వ్యవస్థలను కలిగి , విభిన్న ఆరోగ్య సంరక్షణ చికిత్సలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రత్యేకంగా చాటుతోంది. తద్వారా కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంపూర్ణ ఆరోగ్య అవసరాలను తీరుస్తోంది.
(ii) ఆయుష్ మంత్రిత్వ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుర్ స్వస్థ్య యోజన ను అమలు చేసింది. పథకంలో 2 భాగాలు ఉన్నాయి, అవి..
(ఎ) ఆయుష్, ప్రజారోగ్యం
(బి) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఇ)
ఆయుష్, ఆయుర్ స్వస్థ్య యోజన ప్రజారోగ్య విభాగం కింద ...గ్రామీణ ప్రాంతాలు, గిరిజన నివాసాలు, నగరాల్లోని మురికివాడలు మొదలైన చోట్ల ఆయుష్ మందుల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడానికి సదుపాయాలు వున్నాయి.. ఈ భాగం పరిధిలోకి వచ్చే జనాభా కనీసం 1.5 లక్షలు వుండాలి. వైద్య చికిత్సలద్వారా తక్కువలో తక్కువ 1000 మంది ప్రయోజనం పొందాలి.
(iii) ప్రజారోగ్యం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ప్రజలకు ఆయుష్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చే ప్రాధమిక బాధ్యత ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే. అయినప్పటికీ కేంద్ర ఆయుష్ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ ఆయుష్ మిషన్ ( ఎన్ ఏ ఎం)ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా అమలు చేస్తోంది. ఆయుష్ వ్యవస్థ అభివృద్ధికోసం, ప్రచారం కోసం ఈ పని చేస్తోంది. ఎన్ ఏ ఎం మార్గదర్శకాల ప్రకారం వివిధ కార్యక్రమాల కింద ఆయుష్ మందుల వ్యవస్థ ద్వారా ప్రజలకు చికిత్స, సదుపాయాలను అందించే కృషికి సహకారం అందిస్తోంది.
జాతీయ ఆయుష్ మిషన్ అనేది అన్నిటితోపాటు కింద తెలియజేసిన సేవలను అందిస్తోంది.
(i) ఇప్పటికే ఉన్న ఆయుష్ డిస్పెన్సరీలు, ఆరోగ్య ఉప కేంద్రాలను ఆధునీకరణ చేయడం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్) ను నిర్వహిస్తోంది
(ii) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సిలు) . జిల్లా ఆసుపత్రుల (డిహెచ్‌లు) వద్ద ఆయుష్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది
(iii) ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులు, ప్రభుత్వ డిస్పెన్సరీలు , ప్రభుత్వ/ప్రభుత్వ సహాయ బోధనా సంస్థ ఆయుష్ ఆసుపత్రులకు అవసరమైన మందులను సరఫరా చేస్తోంది
(iv)ప్రస్తుతం ఉన్న స్వతంత్ర ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులను ఆధునీకరిస్తోంది.
v)ప్రస్తుత ప్రభుత్వ/పంచాయతీ /ప్రభుత్వ సహాయంతో ఉన్న ఆయుష్ డిస్పెన్సరీల ఆధునీకరణ/ప్రస్తుతం ఉన్న ఆయుష్ డిస్పెన్సరీ కోసం భవన నిర్మాణం (అద్దె వసతులు/శిథిలమైన వసతుల స్థానంలో)/ కొత్త ఆయుష్ డిస్పెన్సరీని స్థాపించడానికి భవన నిర్మాణం మొదలైన పనులను చేస్తుంది.
(vi) 50/30/10 పడకల ఏకీకృత ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుంది
(vii) ఆయుష్ ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణ
(viii) ప్రభుత్వ రంగంలో ఆయుష్ బోధనా సంస్థలు ఆశించినంతగా లేకపోతే ఆయా రాష్ట్రాల్లో కొత్త ఆయుష్ కళాశాలలను ఏర్పాటు చేస్తుంది
(ix) ఆయుష్ అండర్ గ్రాడ్యుయేట్ సంస్థల్లో మౌలిక సదుపాయాలను అభివృద్దిని చేస్తుంది
(x) ఆయుష్ పీజీ సంస్థల్లో, ఫార్మసీ, పారామెడికల్ కోర్సులనందించేసంస్థల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధిని చేపడుతుంది.
ఎన్ ఏ ఎం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలద్వారా ప్రతిపాదనల్ని సమర్పించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.
ఇది లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఈ రోజు కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి (స్వయంప్రతిపత్తి) శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం.
***
(Release ID: 2044202)
Visitor Counter : 127