రక్షణ మంత్రిత్వ శాఖ
తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను రూపొందించిన డీఆర్‌డీవో
Posted On:
09 AUG 2024 3:08PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తేలికపాటి ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ (ఎఫ్‌హెచ్‌ఎపి) సహిత వినూత్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ (బీపీజే)ను రూపొందించింది. రెండు భిన్న రూపాల్లో వేర్వేరు ‘ఎఫ్‌హెచ్‌ఎపి’ రక్షణ సాంద్రతలుగల ఈ కవచంలో ఒకరకం- దానికదే ప్రత్యేకమైనది కాగా, రెండోది మిశ్రమ పద్ధతిలో రూపొందించింది. డీఆర్‌డీవో ఉత్పత్తి ప్రక్రియ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (టిఒటి) విధానం కింద భారతీయ పరిశ్రమలకు ఆధునిక సాంకేతికత బదిలీకి శ్రీకారం చుడుతూ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను రూపొందించారు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సరికొత్త డిజైన్ పద్ధతిలో రూపుదిద్దుకోగా, దీని తయారీలో కొత్త సరంజామాతోపాటు వినూత్న ప్రక్రియలను ఉపయోగించారు. ఈ ఉత్పత్తికి ‘బిఐఎస్’ ప్రమాణం-17051 కింద నాణ్యత ధ్రువీకరణ లభించింది. ఈ మధ్యరకం పరిమాణంగల జాకెట్ సుమారు 10.1 కిలోల బరువుతో ‘లెవల్-6’ కింద అత్యంత తేలికైనది కావడంతో పోరాట సమయంలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ‘క్విక్ రిలీజ్ మెకానిజం’ సహా ఇతర అనుబంధ విశిష్టతలు కూడా ఉండటం ఈ జాకెట్ ప్రత్యేకత. భారత సాయుధ దళాలు, ‘సిఎపిఎఫ్’ సిబ్బందికి ప్రస్తుతం గరిష్ఠంగా 7.62×54 ఆర్‌ఎపి/ఎపిఐ రౌండ్ల ముప్పు నుంచి ఇది రక్షణ కల్పించగలదు.
రక్షణ శాఖ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ నేడు లోక్‌సభలో బీజేపీ సభ్యుడు శ్రీ సి.ఎం.రమేష్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(Release ID: 2044190)
Visitor Counter : 69