హోం మంత్రిత్వ శాఖ
ఎన్ సిబి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ధ్వంసం
Posted On:
07 AUG 2024 4:50PM by PIB Hyderabad
మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో (ఎన్ సిబి) స్వాధీనం చేసుకునే మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేయడంపై గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులు, సంబంధిత ఇతర నిబంధనలు అన్నింటినీ పొందుపరుస్తూ ఒక మార్గదర్శక పుస్తకాన్ని ఎన్ సిబి ప్రచురించింది. మాదక ద్రవ్యాల చట్టాలు అమలుపరిచే సంస్థలు (డిఎల్ఇఏ) వాటిని తేలిగ్గా అందుకునేందుకు వీలుగా ఆ పుస్తకాన్ని నార్కో కోఆర్డినేషన్ (ఎన్ కార్డ్) పోర్టల్ లో అప్ లోడ్ చేశారు.
వివిధ డిఎల్ఇఏలు ఎన్ సిబికి అందించిన సమాచారం ఆధారంగా గత మూడు సంవత్సరాల కాలంలో ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాలు, మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేసే ఇతర పదార్థాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంవత్సరం
|
పరిమాణం
(కిలోగ్రాముల్లో)
|
సీసాలు
(సంఖ్యలో)
|
టాబ్లెట్లు
(సంఖ్యలో)
|
ఇంజెక్షన్లు
(యాంపిల్స్)
|
2021
|
1,31,294
|
95,222
|
41,78,623
|
6192
|
2022
|
7,55,091
|
12,87,175
|
2,09,22,799
|
46,387
|
2023
|
6,34,604
|
14,96,399
|
43,42,987
|
3367
|
ఆధారం : ఎన్ సిబి
వివిధ డిఎల్ఇఏలు ఎన్ సిబికి నివేదించిన విధంగా గత మూడు సంవత్సరాల కాలంలో ఏడాది వారీగా ధ్వంసం చేసిన అక్రమ గంజాయి, నల్లమందు.
పంట
|
2021 (ఎకరాల్లో)
|
2022 (ఎకరాల్లో)
|
2023 (ఎకరాల్లో)
|
నల్లమందు
|
11,027
|
13,796
|
31,786
|
గంజాయి
|
34,866
|
26,266
|
22,507
|
ఆధారం : ఎన్ సిబి
హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.
***
(Release ID: 2043405)
Visitor Counter : 49