రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వర్షాకాలంలో జాతీయ రహదారుల స్థితిగతులు
Posted On:
07 AUG 2024 1:15PM by PIB Hyderabad
జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రధానంగా బాధ్యత వహిస్తుంది.
ప్రధాన రహదారుల అభివృద్ధి, నిర్వహణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటిప్పుడు జాతీయ రహదారుల స్థితిగతులను కేంద్ర మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల అధికారిక సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ), నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్ హెచ్ ఐ డి సిఎల్ ), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ ఓ ) మొదలైన వివిధ నిర్వహహణా సంస్థలు అంచనా వేస్తాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్లు ( పిడబ్ల్యుడీలు) / రహదారుల నిర్మాణ విభాగాలు ( ఆర్ సీడీలు) / రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కార్పొరేషన్లు మొదలైనవి కూడా ఈ అంచనా వేస్తాయి.
జాతీయ రహదారులను ప్రయాణ యోగ్యమైన స్థితిలో ఉంచడానికి జాతీయ రహదారులపై నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతుంది. వివిధ కారణాల వల్ల ఏర్పడిన లోపాలు, నష్టాలను సరిదిద్దడం, జాతీయ రహదారుల కారణంగా ఏర్పడే పునరావాస పనులను చేయడం, రహదారులను పటిష్టం చేయడం , తగిన డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం మొదలైనవి కూడా ఇటువంటి పనులలో ఉన్నాయి.
అన్ని జాతీయ రహదారుల అభివృద్ధి / ఆధునీకరణ ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ( డిపీఆర్) తయారీ సమయంలోనే వర్షపాతం, అధిక వరద స్థాయి, నేల తీరు, మట్టి రకం తదితరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారం, రోడ్‌పక్కన గల లైన్డ్/లైన్ చేయని డ్రైనేజీల నిర్మాణం, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలను ( అంటే సహజ ప్రవాహాలు/డ్రెయినేజీల మీదుగా కల్వర్ట్‌లు, చిన్న, ప్రధాన వంతెనలు మొదలైనవాటిని) కాంట్రాక్టర్ / రాయితీదారు ప్రామాణిక నిర్దేశాల ప్రకారం కాంట్రాక్ట్ పరిధిలో నిర్మిస్తారు. ఈ పనిని ప్రామాణిక నియమ నిబంధనలు, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కోడ్‌ల ప్రకారం చేస్తారు.
బాధ్యతాయుతమైన నిర్వహణ ఏజెన్సీ ద్వారా వంతెనలతో సహా అన్ని జాతీయ రహదారుల విభాగాల నిర్వహణ, మరమ్మత్తు (ఎం అండ్ ఆర్ )లు జరపడానికిగాను కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక యంత్రాంగాన్ని రూపొందించింది.
ఆయా జాతీయ రహదారులకు సంబంధించిన నిర్వహణ మరమ్మత్తు ( ఎం అండ్ ఆర్) అనేది సంబంధిత రాయితీరులు / కాంట్రాక్టర్లదే. లోపాల బాధ్యత సమయ వ్యవధి ( డిఎల్ పి) / రాయితీ వ్యవధి ముగిసేవరకూ వారు ఈ పని చేయాలి. అదే విధంగా టిఓటి ( టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్)కింద, ఇన్ విట్ (ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ ) కింద చేపట్టిన జాతీయరహదారుల ఎంఅండ్ ఆర్ బాధత్య అనేది సంబంధిత రాయితీదారులదే. వారు ఈ పనిని రాయితీ వ్యవధి ముగిసేవరకూ చేయాలి.
మిగిలిన జాతీయ రహదారుల విషయంలో , కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ద్వారా నిర్వహణ పనులను చేపట్టాలని కేంద్ర మంత్రిత్వ శాఖ విధాన నిర్ణయం తీసుకుంది, ఇది పనితీరు ప్రాతిపదిక నిర్వహణ ఒప్పందం (పిబిఎంసీ) లేదా స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందం (ఎస్ టి ఎంసీ) ప్రకారం కొనసాగుతుంది. బాధ్యతాయుతమైన కాంట్రాక్టు మెయింటెనెన్స్ ఏజెన్సీ లేకుండా జాతీయ రహదారులలో ఏ విభాగాన్ని వదిలివేయకుండా ఈ విధాన నిర్ణయాన్ని ప్రకటించారు.
గత ఏడాది జాతీయ రహదారుల నిర్వహణకోసం రూ. 6, 523 కోట్ల ను కేంద్ర మంత్రిత్వశాఖ ఖర్చు చేసింది.
రాజ్యసభలో కేంద్ర రోడ్డు రవాణ, ప్రధాన రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాతపూర్వకంగా ఇచ్చిన సమాచారమిది.
***
(Release ID: 2043226)
Visitor Counter : 48