భారత పోటీ ప్రోత్సాహక సంఘం
డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ చేతికి ఏటీసీ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
* 100% వాటా కొనుగోలు
* ఆమోదం తెలిపిన సిసిఐ
* మరికొన్ని లావాదేవీలకు సైతం సిసిఐ ఆమోదం
Posted On:
07 AUG 2024 6:50PM by PIB Hyderabad
ఏటీసీ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 100% వాటా మూలధనాన్ని కొనుగోలు చేయాలనే డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ప్రతిపాదనకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
అంతర్గత సంబంధమున్న మరికొన్ని లావాదేవీలను కూడా సిసిఐ ఆమోదించింది.
డిఐటి ( డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ )అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల ట్రస్టులు) నిబంధనలు 2014 కింద పేరును నమోదు చేసుకున్న సంస్థ. డిఐటి తనకున్న స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా భారత టెలికమ్ మౌలికసదుపాయాల సేవల రంగంలో పని చేసే వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది.
అమెరికన్ టవర్ ఇంటర్నేషనల్ సంస్థ పరోక్ష అనుబంధ సంస్థే ఏటీసీ ఇండియా. ఇది భారత టెలికమ్ మౌలికసదుపాయాల సేవల రంగంలో పని చేసే వ్యాపారసంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది.
దీనికి సంబంధించిఅన్ని వివరాలతో కూడిన సిసిఐ ఆదేశాలు రావాల్సి వుంది.
****
(Release ID: 2043224)
Visitor Counter : 45