గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ-పట్టణ జనాభా ఆర్థిక సర్వే

Posted On: 07 AUG 2024 1:58PM by PIB Hyderabad

తాజా ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం 2030 నాటికి భారత జనాభాలో 40 శాతానికి పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. నీతి ఆయోగ్ అధ్యయనాలు, నివేదికల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు.


వలసలకు సంబంధించిన సమాచారం చూస్తే, జూలై 2020 - జూన్ 2021 మధ్య గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో కుటుంబ సభ్యుల వలసల వివరాలను సేకరించారు. నాలుగు రకాల గ్రామీణ-పట్టణ వలసల ద్వారా (అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు)జరిగిన అంతర్గత వలసల శాతాలు కింది విధంగా ఉన్నాయి.


 

దేశం మొత్తం

గ్రామీణం నుంచి గ్రామీణానికి

పట్టణాల నుంచి గ్రామీణానికి

గ్రామీణం నుంచి పట్టణాలకు

పట్టణాల నుంచి పట్టణాలకు

మొత్తం

వ్యక్తులు

55.0

10.2

18.9

15.9

100.0




ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) సహాయ మంత్రి(స్వతంత్ర) శ్రీ రావ్ ఇందర్జిత్ సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 

***


(Release ID: 2043112) Visitor Counter : 107