సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పిఎమ్-అజయ్’ పథకం

Posted On: 07 AUG 2024 3:02PM by PIB Hyderabad

   కేంద్ర ప్ర‌భుత్వం 2021-22లో మూడు పథకాలు- ‘‘ఆదర్శ్ గ్రామ్, షెడ్యూల్డ్ కులాల ఉప-ప్రణాళిక కోసం కేంద్ర ప్రత్యేక సహాయ పథకం, బాబూ జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన’’ల‌  విలీనం ద్వారా ‘‘ప్రధాన‌మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ (పిఎమ్-ఎజెఎవై) యోజన’’ పేరిట సాముదాయ‌క ప‌థ‌కాన్ని ప్రారంభించింది.

   గ‌డ‌చిన మూడేళ్ల‌లో విలీన కార్య‌క్ర‌మాలవారీగా ‘‘పిఎం-అజ‌య్‌’’ పురోగ‌మ‌న గ‌ణాంకాలు కింది విధంగా ఉన్నాయి:

(మొత్తాలు రూ. కోట్లలో)

ఆర్థిక సంవత్సరం

2021-22

2022-23

2023-24

కార్యక్రమాలు

వ్యయం

విజయం

వ్యయం

విజయం

వ్యయం

విజయం

ఆదర్శ గ్రామం

1017.07

215 ఆదర్శ గ్రామాలుగా  ధ్రువీకరణ

51.62

3609 ఆదర్శ గ్రామాల ధ్రువీకరణ

236.30

2489 ఆదర్శ గ్రామాలుగా ధ్రువీకరణ

ఆర్థిక సహాయం

758.64

444 ప్రాజెక్టులకు  ఆమోదం

99.83

1072 ప్రాజెక్టులకు ఆమోదం

165.17

1893 ప్రాజెక్టులకు ఆమోదం

వసతి గృహాలు

42.54

19 వసతి గృహాల (13 బాలికల; 6 బాలుర) నిర్మాణం

11.69

4 వసతి గృహాల (3 బాలికల;1 బాలుర) నిర్మాణం

64.16

21 వసతి గృహాల (8 బాలికల; 13 బాలుర) నిర్మాణం

               

   కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి శ్రీ రామ్‌దాస్ అఠావలె ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

***


(Release ID: 2042902) Visitor Counter : 162