హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలీసు శాఖలో మహిళల నియామకం

Posted On: 06 AUG 2024 4:33PM by PIB Hyderabad

   ‘‘పోలీసు’’ అన్నది భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లోని జాబితా-II (రాష్ట్ర జాబితా)లోగల రాష్ట్రాల పరిధిలోని అంశం. లింగ సమతౌల్యంలో మెరుగుసహా మరింతమంది మహిళలను పోలీసు శాఖలో నియమించడం ప్రధానంగా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత  (యుటి) ప్రభుత్వాల బాధ్యత. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలలో మహిళల సంఖ్య పెంపుపై రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచనాత్మక సిఫారసు జారీచేస్తూంటుంది. ఈ మేరకు మొత్తం పోలీసుల సంఖ్యలో మహిళా ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 22.04.2013, 21.05.2014, 12.05.2015, 21.06.2019, 22.06.2021, 13.04.2022, 27.04.2023, 05.12.2023 తేదీల్లో సూచనాత్మక సిఫారసులు జారీచేసింది. భర్తీ చేయాల్సిన కానిస్టేబుల్/సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులలో మార్పు ద్వారా మహిళలకు ఆ ఉద్యోగాల్లో అదనపు పోస్టులు సృష్టించాలని కేంద్రం సూచించింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో 24 గంటలు పనిచేసే మహిళా సహాయ కేంద్రం నిర్వహించేలా కనీసం ముగ్గురు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండే విధంగా చూడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సూచనాత్మక సిఫారసులు జారీచేసింది.

   మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని కూడా కేంద్రం సూచించింది. అంతేకాకుండా వారి భద్రతకు భరోసా, గృహవసతి కల్పన, స్టేషన్లలో వైద్య-విశ్రాంతి గది వంటి సౌకర్యాలతో సానుకూల విధినిర్వహణ పరిస్థితులు సృష్టించాలని స్పష్టం చేసింది. తద్వారా వారు మరింత ఎక్కువ సంఖ్యలో పోలీసు బలగాల్లో చేరడానికి ఆసక్తి చూపేలా చర్యలుండాలని రాష్ట్రాలను కోరింది.

  ఈ సిఫారసులతో సరిపెట్టకుండా ‘‘పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ కోసం రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయం’’ [లోగడ రాష్ట్ర పోలీసు బలగాల ఆధునికీకరణ (ఎంపిఎఫ్‌) పథకం] కింద పురుష-మహిళా సిబ్బందికి వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు శిశు సంరక్షణ (క్రెష్) కేంద్రాల ఏర్పాటుకూ కేంద్రం నిధులిస్తోంది.

   పోలీసు వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోని అంశం కావడం వల్ల రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా పోలీసు సిబ్బంది నియామకాల సమాచారం కేంద్రం నిర్వహణలో ఉండదు. అయితే, ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్ అండ్ డి) సమీకరించే గణాంకాల ప్రకారం- గడచిన మూడేళ్లలో ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మహిళా సిబ్బంది వాస్తవ సమాచారాన్ని కింది అనుబంధ పట్టికలో చూడవచ్చు.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీగా గత మూడేళ్లలో పోలీసు బలగాలలో (పౌర+జిల్లా సాయుధ రిజర్వు+ సాయుధ + ఐఆర్‌బి) మహిళా సిబ్బంది వాస్తవ సంఖ్యలిలా ఉన్నాయి:

వ.సం.

రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలు

01.01.2021నాటికి

01.01.2022 నాటికి

01.01.2023నాటికి

(1)

(2)

(3)

(4)

(5)

1.

ఆంధ్ర ప్రదేశ్

3812

19299

18913

2.

అరుణాచల్ ప్రదేశ్

1038

1290

1345

3.

అస్సాం

5070

4191

4894

4.

బిహార్

14447

19790

24295

5.

ఛత్తీస్‌గఢ్

4225

4576

4903

6.

గోవా

861

835

842

7.

గుజరాత్

14718

14681

14775

8.

హర్యానా

4713

4829

5506

9.

హిమాచల్ ప్రదేశ్

2361

2404

2593

10.

జార్ఖండ్

4200

3880

4611

11.

కర్ణాటక

7750

8240

9081

12.

కేరళ

4013

4142

4472

13.

మధ్య ప్రదేశ్

5927

7656

7452

14.

మహారాష్ట్ర

28802

30432

32172

15.

మణిపూర్

2636

1962

1957

16.

మేఘాలయ

849

826

818

17.

మిజోరం

557

540

602

18.

నాగాలాండ్

2953

2599

2588

19.

ఒడిశా

5847

5909

6108

20.

పంజాబ్

7005

7117

8167

21.

రాజస్థాన్

8834

9996

10361

22.

సిక్కిం

462

531

470

23.

తమిళ్ నాడు

23006

22547

25334

24.

తెలంగాణ

4742

5349

5351

25.

త్రిపుర

1165

1164

1306

26.

ఉత్తర్ ప్రదేశ్

29435

33425

33319

27.

ఉత్తరాఖండ్

2586

2602

2609

28.

పశ్చిమ బెంగాల్

9627

9558

9603

29.

అండమాన్-నికోబార్

539

548

543

30.

చండీగఢ్

1319

1275

1327

31.

దాద్రా-నాగర్ హవేలీ; దమన్-దియ్యు

104
 

   

***


(Release ID: 2042495) Visitor Counter : 51