విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాకు భరోసాయే లక్ష్యం

Posted On: 05 AUG 2024 3:46PM by PIB Hyderabad

   విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనలు-2020లోని నిబంధన (10) కింద విద్యుత్ పంపిణీ లైసెన్సు పొందిన సంస్థ ప్రజలందరికీ (24 గంటలూ) నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలి. అయితే, వ్యవసాయం వంటి కొన్ని కేటగిరీల వినియోగదారులకు తక్కువ సరఫరా సమయాన్ని కమిషన్ నిర్దేశించవచ్చు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు/పట్టణాలు, గ్రామాలతో నిమిత్తం లేకుండా అన్ని ప్రాంతాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

   దేశంలో అన్ని నివాస గృహాలకూ నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం దిశగా రాష్ట్రాలకు మద్దతునిస్తూ  కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డిడియుజిజెవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవ‌ల‌ప్‌మెంట్‌ (ఐపిడిఎస్), ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) వంటి పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థ బలోపేతానికి రూ.11,391 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించింది. వీటికింద కొత్త సబ్-స్టేషన్ల నిర్మాణం/ఉన్నతీకరణ, కొత్త హెచ్‌టి/ఎల్‌టి లైన్ల ఏర్పాటు/ఉన్నతీకరణ, ‘ఎబిసి’, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులు చేపడతారు. ఈ నేపథ్యంలో ‘డిడియుజిజెవై’ కింద 2,583, ‘సౌభాగ్య’ కింద 17,30,708 వంతున గ్రామీణ విద్యుదీకరణ పూర్తయింది.

   మరోవైపు ‘పునర్నవీకృత పంపిణీ రంగ పథకాన్ని’ (ఆర్‌డిఎస్ఎస్‌) కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. సుస్థిర ఆర్థిక-సమర్థ నిర్వహణాత్మక పంపిణీ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు విశ్వసనీయ-నాణ్యమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరిచడం ఈ పథకం లక్ష్యం. దీని అమలుకు 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరందాకా ఐదేళ్లకుగాను రూ.3,03,758 కోట్ల అంచనా వ్యయంతో రూ.97,631 కోట్ల మేర వార్షిక బడ్జెట్ కేటాయించింది. ఈ నిధుల నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి పంపిణీరంగ మౌలిక సదుపాయాల పనులు, స్మార్ట్ మీటర్ల అమరిక కోసం రూ.4,181 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అంతేగాక ‘పిఎం-జన్మన్’ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) కింద గుర్తించిన అన్ని ‘పివిటిజి’ గృహాలకూ ‘ఆర్‌డిఎస్ఎస్‌’ మార్గదర్శకాల మేరకు ‘ఆన్-గ్రిడ్ విద్యుత్ కనెక్షన్’తో విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. తదనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 9,134 ‘పివిటిజి’ గృహాల విద్యుదీకరణకు రూ.53.39 కోట్ల పనులు మంజూరయ్యాయి.

   అంతేకాకుండా గడచిన ఐదేళ్లలో తూర్పు భారత ప్రాంతంలో 6,220 మెగావాట్ల సామర్థ్యంతో (జార్ఖండ్ వాటాసహా) ప్రారంభించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఆ రాష్ట్రానికి 613 మెగావాట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలోని పట్రాటులో 800 మెగావాట్ల సామర్థ్యంగల 3 యూనిట్లు, ఉత్త‌ర క‌ర‌ణ్‌పురాలో 660 మెగావాట్ల యూనిట్ సహా బీహార్‌లోని ‘బాఢ్‌’లో మరో 660 మెగావాట్ల యూనిట్ నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నటిలోనూ జార్ఖండ్ రాష్ట్రానికి 2,272 మెగావాట్ల వాటా లభిస్తుంది.

   ఈ చర్యలన్నిటి వల్ల 2024-2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గరిష్ఠ, సాధారణ  డిమాండ్ల మధ్య వ్యత్యాసం స్వల్పస్థాయికి వచ్చింది (వివరాలను కింది అనుబంధంలో చూడవచ్చు).

అనుబంధం

జార్ఖండ్: విద్యుత్ సరఫరా స్థితిగతులు (2024-25)

 

విద్యుత్ వివరాలు

గరిష్ఠ డిమాండ్ వివరాలు

సం.

విద్యుత్ అవసరం

విద్యుత్ లభ్యత

మిగులు/లోటు

(-)

గరిష్ఠం

సరఫరా

మిగులు/లోటు

మి.యూ

మి.యూ

మి.యూ

శాతం

మె.వా

మె.వా

మె.వా

శాతం

ఏప్రిల్-24

1,313

1,284

-30

-2.2

2,133

2,133

0

0.0

మే-24

1,403

1,395

-9

-0.6

2,295

2,292

-3

-0.1

జూన్-24

1,424

1,410

-13

-0.9

2,330

2,330

0

0.0

మొత్తం (జూన్ దాకా)

4,140

4,089

-52

-1.3

6,758

6,755

0

0.0

 

కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ వివరాలతో రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

                        

                                              

 

 

                               

 

***


(Release ID: 2042081) Visitor Counter : 113