పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బఫర్ జోన్ లో హోటళ్ళు/రిసార్టుల నిర్మాణం

Posted On: 05 AUG 2024 12:20PM by PIB Hyderabad

పర్యావరణ పరంగా సున్నితమైన మండలం (ఇఎస్‌జడ్) పరిధిలో ఏ ప్రయోజనానికైనా సరే, ఎలాంటి కొత్త శాశ్వత నిర్మాణానికి అయినా అనుమతిని ఇవ్వడం జరగదు అని 2022 జూన్ 3 నాటి ఉత్తర్వులో  సుప్రీం కోర్టు  ఆదేశాలు పేర్కొంటున్నాయి.  ప్రస్తావిత ఉత్తర్వులతో పాటు 2023 ఏప్రిల్ 26నాటి ఆదేశాల్లోను కోర్ట్ స్పష్టతను ఇచ్చింది. తదనుగుణంగా  మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలన్న షరతును అనుసరించి కార్యకలాపాలకు అనుమతిని ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పాటు మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఎకో-సెన్సిటివ్ జోన్స్ (ఈఎస్‌జడ్ లు) సహా అటవీ ప్రాంతాల పరిరక్షణ మరియు నిర్వహణ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు  తప్పక పాటించవలసి ఉంటుంది.

ఈ సమాచారాన్ని పర్యావరణం, అడవులు-వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్థన్ సింగ్ లోక్ సభకు ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.


(Release ID: 2041764) Visitor Counter : 147