కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామాలు సహా అన్ని ప్రాంతాలను చేరుతున్న సార్వత్రిక అనుసంధానత, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు

2024 ఏప్రిల్ నాటికి 95.15% గ్రామాల్లో 3జీ/4జీ మొబైల్ అనుసంధానతతో ఇంటర్నెట్

2014 మార్చిలో 251.59 మిలియన్ల నుంచి 2024 మార్చిలో 954.40 మిలియన్లకు పెరిగిన మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు

టైడ్ 2.0, జెనెసిస్, సీవోఈలు, ఎన్జీఐఎస్ వంటి సాంకేతిక చోదక స్టార్టప్ లు, ఆవిష్కరణ కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం

Posted On: 02 AUG 2024 11:24AM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద మెట్రో నగరాలనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ, మారుమూల ప్రాంతాలను కూడా అనుసంధానం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది.

2024 మార్చి నాటికి భారతదేశంలోని మొత్తం 954.40 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారుల్లో 398.35 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు. 2024 ఏప్రిల్ నాటికి దేశంలోని 6,44,131 గ్రామాలలో (భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం గ్రామాల సంఖ్య) 6,12,952 గ్రామాల్లో 3జీ/4జీ మొబైల్ అనుసంధానత ఉంది. అంటే 95.15% గ్రామాల్లో ఇంటర్నెట్ లభ్యత ఉంది.

దేశంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2014 మార్చిలో 251.59 మిలియన్లు ఉండగా, అది 2024 మార్చి నాటికి 954.40 మిలియన్లకు పెరిగింది. 14.26% మిశ్రిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది.

గత పదేళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు; గ్రామాలు సహా భారత్ నలుమూలలనూ చేరుకునేలా టెలికాం నెట్వర్క్ విస్తరించింది.

 

2014 మార్చి 31

2024 మార్చి 31

పెరుగుదల శాతం (%)

బ్రాడ్ బ్యాండ్ వేగం

>= 512 కేబీపీఎస్

>= 2 ఎంబీపీఎస్

300

సగటు ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగంలో భారతదేశ ర్యాంకింగ్ [ఊక్లా వేగ పరీక్ష]

130

16

114 ర్యాంక్‌లు మెరుగైంది

సగటు డౌన్లోడ్ వేగం (ఎంబీపీఎస్) [ఊక్లా వేగ పరీక్ష]

4.18

105.85

2432.29

ఇంటర్నెట్ వినియోగదారులు (మిలియన్లలో)

251.59

954.40

279.34

మొత్తం వినియోగదారులు (మిలియన్లలో)

933

1199.28

28.54

పట్టణ టెలి-సాంద్రత

145.78%

133.72%

-8.27

గ్రామీణ టెలి-సాంద్రత

43.96%

59.19%

34.64

మొత్తంగా టెలి-సాంద్రత

75.23%

85.69%

13.90

సగటు డేటా వ్యయం/జీబీ (రూపాయల్లో)

268.97

9.18

-96.58

సగటు డేటా వినియోగం (జీబీ లలో)

0.26

20.27

7696

 

భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీతో అనుసంధానించి బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించాలని సంకల్పించారు. రెండు దశల భారత్‌నెట్‌ కింద మొత్తం ఉద్దేశిత 2.22 లక్షల గ్రామ పంచాయతీల్లో 2.13 లక్షల గ్రామ పంచాయతీలు సేవలందించడానికి సంసిద్ధమయ్యాయి. అలాగే, 42,000 అపరిధీయ గ్రామపంచాయతీలకు & మిగిలిన 3.84 లక్షల గ్రామాలకు డిమాండ్ ఆధారిత ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం, 1.5 కోట్ల గ్రామీణ గృహాలకు ఫైబర్ అనుసంధానం అందించాలని సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

యూఎస్ఓఎఫ్ పథకాల ద్వారా దేశంలోని మొత్తం 35680 అపరిధీయ గ్రామాలు/ఆవాసాలను వాటి పరిధిలోకి తెస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ఈ గ్రామాలు/ఆవాసాలన్నీ కొండ ప్రాంతం, దట్టమైన అడవుల వంటి సంక్లిష్టమైన భూభాగంతో దుర్గమమైన ప్రాంతాల్లో ఉన్నాయి. యుఎస్ఓఎఫ్ ద్వారా నిధులు సమకూరే వివిధ పథకాల కింద దాదాపు రూ.11,000 కోట్ల వ్యయంతో 9,000 గ్రామాలకు 4జీ అనుసంధానత కల్పించారు.

దేశంలో ఇంటర్నెట్ అనుసంధానతను పెంచడానికి ప్రభుత్వం అనేక ఇతర కార్యక్రమాలను కూడా చేపట్టింది:

  • సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు వీలుగా 2022 ఆగష్టులో లైసెన్సింగ్ నిబంధనలను సవరించింది.
  • ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే రూల్స్ 2016 జారీ; టెలికాం మౌలిక సదుపాయాలను వేగంగా, సులభంగా అమలు చేయడం కోసం ఎప్పటికప్పుడు సవరణ నిబంధనలు.
  • రైట్ ఆఫ్ వే అనుమతులను వేగవంతం చేయడం కోసం గతిశక్తి సంచార్ పోర్టల్ ప్రారంభించడం ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఆ అనుమతులు సులభతరమయ్యాయి.

డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్స్ (టైడ్ 2.0), జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నొవేటివ్ స్టార్టప్స్ (జెనెసిస్), డొమైన్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈలు), నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ (ఎన్జీఐఎస్) వంటి వివిధ సాంకేతిక చోదక స్టార్టప్ లు, ఆవిష్కరణ పథకాలను దాదాపు రూ. 800 కోట్ల నిధుల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను కూడా వీటి పరిధిలో చేర్చారు. అంతేకాకుండా, దేశంలోని 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 104 చిన్న నగరాలు/పట్టణాల్లో 246 బీపీవో యూనిట్ల ఏర్పాటు ద్వారా ఇండియా బీపీవో/బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ ప్రోత్సాహక పథకం (ఐబీపీఎస్), & ఈశాన్య బీపీవో ప్రోత్సాహక పథకాన్ని (ఎన్ఈబీపీఎస్) కూడా ప్రభుత్వం గతంలో ప్రారంభించింది.  

***




(Release ID: 2040761) Visitor Counter : 93