కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్‌లో టెలికాం కనెక్టివిటీని పునరుద్ధరించి, విస్తృతం చేసిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు

రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారులు, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కమ్యూనికేషన్‌ వ్యవస్థ

నివాసితులకు చేదోడుగా ఉండేలా కంట్రోల్ రూమ్‌లు, సహాయ పంపిణీ కేంద్రాలు అందుబాటులోకి

Posted On: 01 AUG 2024 8:56PM by PIB Hyderabad
భారీ కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైన వాయనాడ్‌లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు యుద్ధ ప్రాతిపదికన టెలికాం కనెక్టివిటీని పునరుద్ధరించి, పెంచే కార్యక్రమం చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారులు, ప్రజలకు అవసరమైన కమ్యూనికేషన్ ఛానెల్‌లను నిర్వహించడానికి, ఏర్పాటు చేయడానికి,  వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, రిలయన్స్ జియో,విఐ వంటి ప్రధాన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాయనాడ్‌లో నిరంతర కవరేజీని అందించడానికి టెలికాం మౌలిక సదుపాయాలు పెంచి అందుబాటులోకి తెస్తున్నారు. 

వాయనాడ్‌లోని నివాసితులకు మద్దతుగా కంట్రోల్ రూమ్‌లు, రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు యాక్టివేట్ చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు  మద్దతు ఇవ్వడానికి, నిరంతర కవరేజీని నిర్ధారించడానికి టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడానికి అనేక  చర్యలు చేపట్టారు.

భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్):

  • వాయనాడ్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడిన చూరల్‌మల, ముండక్కై ప్రాంతాల్లో 4జి సేవలను అందించింది. విద్యుత్ లేనప్పుడు కూడా టవర్లు పనిచేసేలా డీజిల్ ఇంజన్లు ఏర్పాటు చేసారు. 
  • జిల్లా పరిపాలనకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు, ఆరోగ్య శాఖకు టోల్-ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది  

రిలయన్స్ జియో :

  • రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల నుండి వచ్చిన అభ్యర్థన ఆధారంగా,  ఈ సమయంలో విశ్వసనీయమైన కనెక్టివిటీ క్లిష్టమైన అవసరాన్ని గుర్తించి, ప్రభావిత ప్రాంతంలో మరింత సహాయాన్ని అందించడానికి జియో రెండవ ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేసింది. నెట్‌వర్క్ సామర్థ్యం, కవరేజీలో పెరుగుదల వల్ల ఆపదలో ఉన్న నివాసితులు, రెస్క్యూ వర్కర్లు, విపత్తు నిర్వహణ బృందాలకు ఈ ఏర్పాటు పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది.
  • రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో మెరుగైన సమన్వయం కోసం కంట్రోల్ రూమ్, వివిధ రిలీఫ్ క్యాంపులను చేర్చడానికి నెట్‌వర్క్ కవరేజీని విస్తరించారు.  

ఎయిర్ టెల్ :

  • చెల్లుబాటు గడువు ముగిసిన ప్రీపెయిడ్ కస్టమర్‌లు రీఛార్జ్ చేసుకోలేని వారికి రోజుకు 1 జీబీ ఉచిత మొబైల్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తున్నారు. ఇది 3 రోజులు చెల్లుబాటు అవుతుంది. 
  • పోస్ట్‌పెయిడ్ – కస్టమర్‌లు మొబైల్ సేవకు అంతరాయం లేకుండా యాక్సెస్‌ను కలిగి ఉండేలా అన్ని పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు ఎయిర్‌టెల్ బిల్లు చెల్లింపు తేదీలను 30 రోజులు పొడిగించింది.
  • రిలీఫ్ మెటీరియల్‌తో స్థానిక పరిపాలనకు మద్దతివ్వడం - ఎయిర్ టెల్ కేరళలోని తన 52 రిటైల్ స్టోర్‌లను రిలీఫ్ కలెక్షన్ పాయింట్‌లుగా మార్చింది, ఇక్కడ ప్రజలు రిలీఫ్ మెటీరియల్‌లను వదిలివేయవచ్చు, వీటిని వాయనాడ్‌లోని బాధిత సంఘాలకు పంపడానికి స్థానిక పరిపాలనకు అందజేస్తున్నారు. 

 

వోడాఫోన్ (విఐ): 

  • ప్రీపెయిడ్ కస్టమర్: ఏడు రోజుల పాటు రోజుకు 1జీబీ మొబైల్ డేటా ఉచితం. ఈ అదనపు డేటా వినియోగదారుల ఖాతాలకు స్వయంచాలకంగా క్రెడిట్ చేస్తారు. అంతరాయం లేకుండా సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
  • పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు, వొడాఫోన్ ఐడియా బిల్లు చెల్లింపుల గడువు తేదీలను 10 రోజులు పొడిగించింది. ఈ పొడిగింపు విపత్తు తక్షణ పరిణామాలను నిర్వహిస్తున్న వారికి కొంత ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించింది. 
  • కొనసాగుతున్న సహాయక చర్యలకు సహాయపడే ప్రయత్నంలో, విఐ కేరళ అంతటా ఉన్న అన్ని దుకాణాలను సహాయ సామగ్రి కోసం సేకరణ కేంద్రాలుగా మారుస్తోంది. వాయనాడ్‌లో సహాయక చర్యలకు మద్దతుగా ప్రజలు ఏదైనా విఐ స్టోర్‌లో అవసరమైన వస్తువులను విరాళంగా ఇవ్వవచ్చు. 
  • తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లోని 17 సైట్‌లతో సహా జిల్లాలోని తన మొత్తం 263 సైట్‌లు పూర్తిగా పనిచేస్తున్నాయని విఐ నిర్ధారించింది.

 వాయనాడ్‌లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్పిలు) నిర్వహించిన కార్యకలాపాల ఫోటోగ్రాఫ్‌లు: 

 

***


(Release ID: 2040620) Visitor Counter : 78