గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ ప్రాంతాల్లో పేదలకోసం ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు
Posted On:
01 AUG 2024 1:18PM by PIB Hyderabad
భూములు, కాలనీల నిర్మాణం అనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. కాబట్టి గృహనిర్మాణానికి సంబంధించిన పథకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పౌరులకోసం అమలు చేస్తాయి. అయితే కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- పట్టణ ప్రాంతాలు ( పిఎంఏవై-యు) పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్ధిక సహాయం అందజేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం 2015 జూన్ 25నుంచి మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలను పట్టణాల్లోని అర్హతగల లబ్ధిదారులకు అందజేస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా పేద ప్రజలకు నివాసాలు లభిస్తున్నాయి.
డిమాండ్ ఆధారంగా అమలయ్యే పథకం పిఎంఏవై-యు. కాబట్టి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం 22-07-2024 నాటికి పిఎంఏవై-యు కింద 118.64 లక్షల ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మంజూరైన ఇళ్లలో 114.33 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. వాటిలో 85.04 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవ్వడంగానీ, లబ్ధిదారులకు అందించడంగానీ జరిగింది. మంజూరైన ఇళ్లకు కేంద్రప్రభుత్వ ఆర్ధిక సాయం దాదాపు రూ.2 లక్షల కోట్లు వుంటుంది. అందులో 1.64 లక్షల కోట్లను ఇంతవరకూ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా మంజూరైన ఇళ్ల వివరాలు, నిర్మాణం ప్రారంభమైనవాటి వివరాలు, పూర్తయిన వాటి వివరాలు, లబ్ధిదారులకు అందించినవాటివివరాలు, పిఎంఏవై-యు ప్రారంభమైనప్పటినుంచీ కేంద్రప్రభుత్వ సాయం వివరాలను అనుబంధం -1లో చూడవచ్చు. పిఎంఏవై-యు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలవారీగా పూర్తయిన ఇళ్ల వివరాలను, లబ్ధిదారులకు అందించిన వాటి వివరాలను, గత మూడు సంవత్సరాల్లో ప్రతి ఏడాది వారీగా లబ్ధిదారులకు అందించిన ఇళ్ల వివరాలను అనుబంధం 2లో చూడవచ్చు.
ఈ పథకం కాలపరిమితి గతంలో 31-03-2022వరకూ వుండేది. దీన్ని 31-12-2024వరకూ పొడిగించడం జరిగింది. రుణంతో సంబంధమున్న రాయితీ పథకం (సిఎల్ ఎస్ ఎస్) వర్టికల్ తప్పిస్తే నిధుల కేటాయింపు, అమలు విధానంలో ఎలాంటి మార్పులు లేవు.
...............
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ టోకన్ సాహు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.
మరిన్ని వివరాలకోసం: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2040048
*****
(Release ID: 2040523)
Visitor Counter : 47