గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చిన్న, మధ్యతరహా నగరాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు
Posted On:
01 AUG 2024 1:17PM by PIB Hyderabad
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డబ్ల్యూ నిబంధనల ప్రకారం ఏడు, పన్నెండో షెడ్యూళ్లలోని పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలు రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వారి పట్టణాభివృద్ధి ఎజెండాలోని కార్యక్రమాలకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ ప్రధాన పథకాల ద్వారా మద్దతు ఇస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ లో భాగమైన అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ (యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ) 31 మార్చి 2014 వ తేదీన ముగిసింది. 31 మార్చి 2014 నాటికి 50% లేదా అంతకంటే ఎక్కువ కేంద్ర సహాయం అందుకున్న లేదా పురోగతి 50% లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లేదా మిషన్ యొక్క పరివర్తన దశలో మంజూరు చేయబడిన యుఐడిఎస్ఎస్ఎంటి కి చెందిన అన్ని ప్రాజెక్టులకు 31 మార్చి 2017 వరకు ‘అమృత్’ కింద నిధుల కోసం ఆమోదం లభించింది.
ఈ కాలపరిమితి కూడా ముగుస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలకు అప్పగించారు.
మంత్రిత్వ శాఖ అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0), స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్-పట్టణ 2.0 వంటి ఇతర పథకాల ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేస్తుంది. కేంద్ర సహాయం నగరాలకు కాకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంజూరు అవుతుంది. మిషన్, పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకాలను అమలు చేస్తాయి.
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 100 నగరాలను ఎంపిక చేయగా, అందులో 66 నగరాల్లో 10 లక్షల లోపు జనాభా ఉంది. ఇందులో లక్ష లోపు జనాభా ఉన్న నగరాలు 12, అదేవిధంగా 1-5 లక్షల మధ్య జనాభా ఉన్న 33 నగరాలు కాగా, 5-10 లక్షల మధ్య జనాభా ఉన్న 21 నగరాలు (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్నాయి. ఈ 66 నగరాలకు రూ.29,693 కోట్ల కేంద్ర నిధులను విడుదల చేశారు. ఈ నగరాల్లో రూ.91,143 కోట్లతో మొత్తం 5,162 ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో రూ.76,735 కోట్ల విలువైన 4,548 ప్రాజెక్టులు (మొత్తం ప్రాజెక్టుల్లో 84 శాతం) పూర్తయ్యాయి.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు నేడు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2040047
****
(Release ID: 2040521)
Visitor Counter : 52