గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల విధానం

Posted On: 01 AUG 2024 12:53PM by PIB Hyderabad

కేంద్ర రంగ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇఎంఆర్ ఎస్) పథకాన్ని నిర్వహించడానికి, అమలు చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) నివేదించిన ప్రకారం, ఇఎంఆర్ ఎస్ కోసం బోధన, బోధనేతర సిబ్బంది కేంద్రీకృత నియామకం విజయవంతంగా పూర్తయింది.

నియామక పరీక్షలో హిందీ భాషపై పరీక్ష అర్హత స్వభావం కలిగి ఉంది. నెస్ట్స్ నివేదించిన ప్రకారం , పోస్టింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులను ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లభ్యతకు లోబడి వీలైనంత వరకు వారి స్వరాష్ట్రాల్లో నియమించామని నెస్ట్స్ తెలిపింది. స్థానిక భాషల పరిజ్ఞానానికి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర విద్యా సొసైటీల ద్వారా స్థానిక భాషలపై సెషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

2022-23 నుంచి 2026-27 నాటికి దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయాలనే సలహాతో దేశవ్యాప్తంగా అన్ని ఇఎంఆర్ ఎస్ లకు 38,480 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను సృష్టించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం నెస్ట్స్ 2023లో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ను ప్రారంభించింది. ప్రస్తుతం 8 వేలకు పైగా నియామక ఉత్తర్వులను నెస్ట్స్ జారీ చేసింది. 

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

 

***



(Release ID: 2040334) Visitor Counter : 45