రక్షణ మంత్రిత్వ శాఖ
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా(ఆర్మీ) చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్
Posted On:
01 AUG 2024 10:35AM by PIB Hyderabad
లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ప్రతిష్టాత్మక ఆర్మీ మెడికల్ సర్మీసెస్ డైరెక్టర్ జనరల్ పదనిని చేపట్టిన మొదటి మహిళగా నిలిచారు. ఈ మేరకు అగస్టు 01న బాధ్యతలు తీసుకున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ పుణెలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట అకడమిక్ రికార్డుతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1985 డిసెంబర్‌లో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరారు. ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్… మాతాశిశు ఆరోగ్యం, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాలు చేశారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో రెండేళ్ల శిక్షణ పొందారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలతో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్‌ఫేర్.. స్విట్జర్లాండ్ రక్షణ దళాలతో మిలిటరీ మెడికల్ ఎథిక్స్ సంబంధించి శిక్షణ పొందారు. ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ట్రైనింగ్ కమాండ్‌కు తొలి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా ఆమె గుర్తింపు పొందారు.
జాతీయ విద్యా విధానంలోని వైద్యారోగ్య విద్యకు సంబంధించిన ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్‌ను నిపుణురాలుగా నామినేట్ చేశారు. ఆమె చేసిన సేవలకు గాను వెస్ట్రన్ ఎయిర్ కమాండ్- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ప్రశంసాపత్రాలను అందుకున్నారు. వీటితో పాటు విశిష్ట సేవా పతకాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
***
(Release ID: 2040202)
Visitor Counter : 117