నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు ముప్ఫై మూడింటిలో పంతొమ్మిది సంస్థలు ప్రత్యేకంగా మహిళలకే
మహిళలకు ఉద్దేశించిన జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సిఐటిఎస్) లో 19 కోర్సులను, క్రాఫ్ట్స్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ లో 23 కోర్సులను అందిస్తాయి
మహిళలకు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ
Posted On:
31 JUL 2024 1:48PM by PIB Hyderabad
జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు (ఎన్ఎస్‌టిఐ లు) ముప్ఫయ్ మూడు ఉండగా వాటిలో పంతొమ్మిది ఎన్ఎస్ టిఐ లను అచ్చంగా మహిళల కోసం నిర్వహించడం జరుగుతోంది. ఈ మహిళా ఎన్ఎస్‌టిఐ లు క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సిఐటిఎస్) లో భాగంగా 19 కోర్సులను, అలాగే క్రాఫ్ట్స్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సిటిఎస్) భాగంగా 23 కోర్సులను అందిస్తున్నాయి. మహిళా ఎన్ఎస్‌టిఐ లు సిటిఎస్, ఇంకా సిఐటిఎస్ లు రెండిటిలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్-ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సిఒపిఎ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మన్, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్, డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్.. మొదలైన ట్రేడ్ లలో కోర్సులను మహిళా శిక్షణార్థులకు అందిస్తున్నాయి. ఇండోర్, వడోదర లలో ఉన్న మహిళా ఎన్ఎస్‌టిఐ లలో ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడ్ ను కూడా ప్రారంభించారు. 2023-24 సెషన్ లో ‘సర్వేయర్’ ట్రేడ్ ను ప్రారంభించారు. ఎనిమిది ఎన్ఎస్‌టిఐ లలో 2024-25 సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ‘ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్’ పేరుతో ఒక కొత్త ట్రేడ్ ను సిటిఎస్ లో భాగంగా ప్రారంభిస్తున్నారు.
సిఐటిఎస్ లో భాగంగా మంజూరైన 50.45 శాతం సీట్లు మహిళా శిక్షణార్థులకు ఉద్దేశించినవి కాగా ఎన్ఎస్ టిఐలలో సిటిఎస్ శిక్షణ లో భాగంగా శిక్షణను పొందుతున్న వారిలో 84 శాతం మంది మహిళలు ఉన్నారు.
మహిళలకు ఉద్దేశించిన కోర్సులలో ప్రాతినిధ్యాన్ని మరింత పెంచడం కోసం, మహిళా అభ్యర్థులు అందరికీ ట్యూషన్ మరియు పరీక్ష ఫీజును రద్దు చేయడమైంది. జనరల్ ఎన్ఎస్‌టిఐ లలో ప్రవేశాలకు సంబంధించి జనరల్ ట్రేడ్ లలో 30 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేశారు.
ఈ సమాచారాన్ని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌధరి ఈ రోజు రాజ్య సభ లో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2039637)