హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మానసిక ఆరోగ్య కార్యక్రమాలు

Posted On: 30 JUL 2024 4:33PM by PIB Hyderabad

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన ఆత్మహత్యలపై గణాంక డేటాను క్రోడీకరించి, ఎన్సీఆర్బీ ప్రచురణ 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా (ఎడిఎస్ఐ)' లో ప్రచురిస్తుంది.  ప్రచురితమైన నివేదికలు 2022 సంవత్సరం వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  

 

భారత ప్రభుత్వం దేశంలో, మానసిక రుగ్మతల భారాన్ని తగ్గించేందుకు జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని  అమలు చేస్తోంది. ఇది దేశంలోని 767 జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని(డీఎంహెచ్పీ) అమలు చేసేందుకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేస్తుంది.  కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిల్లో డీఎంహెచ్పీ కింద ఔట్ పేషంట్ సేవలు, పరీక్షలు, కౌన్సిలింగ్/ సైకో సోషల్ ఇంటర్వెన్షన్స్, తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్నవారికి నిరంతర సంరక్షణ, మద్దతు, ఔషదాలు, అవగాహన సేవలు, అంబులెన్స్ సేవలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, జిల్లా స్థాయిలో 10 పడకల ఆసుపత్రి సదుపాయం కూడా ఉంది.

 

ప్రభుత్వం మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. 1.73 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, యూహెచ్డబ్ల్యూసీలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా ప్రభుత్వం ఆధునీకరించింది. ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అందించే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద సేవల ప్యాకేజీలో మానసిక ఆరోగ్య సేవలను చేర్చారు. ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మానసిక, నాడీ, పదార్థ(మత్తు పదార్థాలు/ పానీయాలు, ఔషదాలు) వినియోగ రుగ్మతలపై కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటి జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహాన్ని రూపొందించింది. ఈ వ్యూహాన్ని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ (www.mohfw.gov.in)లో అందుబాటులో ఉంది.

 

వీటితో పాటు, ఈ రుగ్మతలతో బాధపడేవారి కోసం నాణ్యమైన మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్, సంరక్షణ సేవలను మరింత మెరుగుపరచడానికి 10 అక్టోబర్ 2022 వ తేదీన "నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్" ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది. 23.07.2024 నాటికి 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలీ మానస్ సెల్స్ ను ఏర్పాటు చేసి టెలీ మెంటల్ హెల్త్ సేవలను ప్రారంభించాయి.  హెల్ప్ లైన్ నంబర్ కు 11,76,000 కాల్స్ వచ్చాయి. ఉన్నత విద్యాశాఖ తమ పరిధిలోని విద్యాసంస్థల్లో ఎన్టీఎంహెచ్పీ/ టెలీ మానస్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఒత్తిడి, సవాలు సమయాల్లో హెల్ప్ లైన్ ను వినియోగించుకునేందుకు వాటిని విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. ఎన్‌టిఎమ్‌హెచ్‌పి/ టెలీ మానస్ ను ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో ముఖ్యంగా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్ని రాష్ట్రాలను కోరారు. అన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు, ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉచిత, గోప్యంగా మద్దతు కోసం ఏ సమయంలోనైనా హెల్ప్ లైన్ ను వాడేందుకు టెలీ మానస్ ను విద్యార్థులలో ప్రచారం చేయాలని కోరారు.

 ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 

***


(Release ID: 2039552) Visitor Counter : 63