హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్ముాకశ్మీర్ లో ఉగ్రవాదం..

Posted On: 30 JUL 2024 4:32PM by PIB Hyderabad

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించని విధానాన్ని ప్రభుత్వం అవలంభిస్తోంది. ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించడమే ప్రభుత్వ ఉద్దేశం. జమ్ముాకశ్మీర్‌లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భద్రతా చర్యలను పటిష్టం చేస్తోంది. జమ్ముాకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలను అరికట్టేందుకు అనుసరించిన వ్యూహాలు, తీసుకున్న చర్యలు:

1. ఉగ్రవాదులు, వాళ్లకు మద్ధతిచ్చే వ్యవస్థలపై సమర్థవంత, నిరంతర, స్థిరమైన చర్యలు.

2. ప్రభుత్వం అన్ని విభాగాలను ఉపయోగించి ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించడం.

3. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని నిలిపివేసేందుకు ఉగ్రవాదులు, వాళ్ల సహచరులకు చెందిన ఆస్తులను సంబంధిత చట్టం కింద జప్తు చేయడం వంటి చర్యలతో పాటు జాతి వ్యతిరేక సంస్థలను నిషేధించడం
4. ఉగ్రవాదానికి వ్యూహాత్మక మద్దతుదారులను గుర్తించడం, ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారి యంత్రాంగాలను బహిర్గతం చేయడానికి దర్యాప్తులను ప్రారంభించడం వంటి నివారణ చర్యలు.

5. చొరబాట్లను నిరోధించడానికి బహుముఖ వ్యూహం.

6. ప్రతిఘటన గ్రిడ్‌ను మెరుగుపరచడం.

7. భద్రతా పరికరాల ఆధునీకరణ, బలోపేతంపై ప్రత్యేక దృష్టి.

8. వ్యూహాత్మక ప్రాంతాల్లో వద్ద 24 గంటల పనిచేసే పోలీస్ చెక్ పాయింట్లు(నాకాస్).

9. ఉగ్రవాద సంస్థలు విసురుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లు(సీఏఎస్‌ఓ)
10. జమ్ముాకశ్మీర్‌లో పనిచేస్తున్న అన్ని భద్రతా దళాల మధ్య రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం.

11. పగలు, రాత్రి భద్రతా సిబ్బంది పహారా

పైన పేర్కొన్న వ్యూహాలు, చర్యల వల్ల జమ్ముాకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.


 

వివరణ

2018

2023

2024 (21 జులై,2024 వరకు)

వ్యవస్థీకృత రాళ్లు రువ్వడం

1328

00

00

వ్యవస్థీకృత హర్తాల్

52

00

00

ఉగ్రవాద ప్రేరేపిత సంఘటనలు

228

46

11

ఎన్‌కౌంటర్లు/సీటీ ఆపరేషన్లు

189

48

24

భద్రతా సిబ్బంది మరణాలు

91

30

14

ప్రజా మరణాలు

55

14

14

 

(మూలం: జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం)

 

లోక్ సభలో ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***


(Release ID: 2039551) Visitor Counter : 55