ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు చర్యలు


2014కు ముందు 387గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య నేడు 731 (88%) కి పెరిగింది.

2014కు ముందు 51,348గా ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 118 శాతం పెరిగి 1,12,112కు చేరింది.

పీజీ సీట్లు 2014కు ముందు 31,185 ఉండగా, ప్రస్తుతం 72,627కు 113 శాతం పెరిగాయి.

Posted On: 30 JUL 2024 4:18PM by PIB Hyderabad

వైద్య కళాశాలల సంఖ్యను, ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వం పెంచింది. 2014కు ముందు 387గా ఉన్న మెడికల్ కాలేజీలు ప్రస్తుతం 731 (88%) కి పెరిగాయి. 2014కు ముందు 51,348గా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు 1,12,112 (118%) కు పెరిగాయి. 2014కు ముందు 31,185గా ఉన్న పీజీ సీట్ల సంఖ్య133% పెరుగుదలతో ఇప్పుడు72,627కు చేరింది. 

గత మూడేళ్లలో ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, పీజీ సీట్ల (ఎన్ బి ఇ ఎంఎస్ సీట్లు మినహాయించి) వివరాలు ఇలా ఉన్నాయి.

 

సెషన్ 

ప్రభుత్వ  మెడికల్ కాలేజీలు

ప్రైవేటు మెడికల్ కాలేజీలు 

యు జి సీట్లు 

పి జి సీట్లు

యు జి సీట్లు

పి జి సీట్లు 

2021-22

48212

28260

43915

17858

2022-23

51912

30211

44365

19362

2023-24

56300

33416

52640

21418

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచడానికి,  విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని  చర్యలు: -

  1. జిల్లా/ రిఫరల్ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రాయోజిత పథకం (సిఎస్ఎస్) కింద 157 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చారు. వీటిలో ఇప్పటికే 109 పనిచేస్తున్నాయి.

  2. ఎంబీబీఎస్, పీజీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడం/ అప్ గ్రేడ్ చేయడం. దీని కింద రూ.5,972.20 కోట్లతో 83 కాలేజీల్లో 4,977 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు మద్దతు, ఫేజ్-1లో 72 కాలేజీల్లో 4,058 పీజీ సీట్లకు రూ.5,972.20 కోట్లు, ఫేజ్-1లో 4,058 పీజీ సీట్లకు రూ.1,499కోట్లు; ఫేజ్  - 2 లో 65 కాలేజీల్లో రూ. 4,478.25  కోట్లతో 4000 పి జి సీట్లకు ఆమోదం 

  3. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్ ఎస్ వై) లోని "సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ల నిర్మాణం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల అప్ గ్రేడేషన్" కింద, మొత్తం 75 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది, వీటిలో 66 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.  

  4. కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద 22 ఎయిమ్స్ లకు ఆమోదం తెలిపింది. వీటిలో 19 చోట్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభమయ్యాయి.

  5. అధ్యాపకుల కొరతను తీర్చేందుకు టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకానికి డీ ఎన్ బి ని అర్హత గా గుర్తించారు.

  6. మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు/ డీన్/ ప్రిన్సిపాల్/ డైరెక్టర్ పోస్టుల నియామకం/ పొడిగింపు/ పునర్నియామకానికి వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా సింగ్ పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు. 

 

***



(Release ID: 2039332) Visitor Counter : 23