వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

14వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న వాణిజ్య శాఖ కార్యదర్శి


ప్రపంచ వాణిజ్య సంస్థ అభివృద్ధి అంశం, గ్లోబల్ వాల్యూచైన్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ డాక్యుమెంటేషన్ డిజిటలైజేషన్ తో ముడిపడి ఉన్న సమకాలీన సమస్యలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఎంఎస్ఎంఈల్లో సహకారం వంటి అంశాలపై దృష్టి సారించిన వాణిజ్య శాఖ కార్యదర్శి

బ్రిక్స్ స్ఫూర్తికి సమానత్వం, సమ్మిళితత్వం, ఏకాభిప్రాయం, పరస్పర గౌరవం, అవగాహనకు మద్దతు పలికిన వాణిజ్య శాఖ కార్యదర్శి

Posted On: 28 JUL 2024 10:39AM by PIB Hyderabad

రష్యా అధ్యక్షతన 26 జూలై 2024 న జరిగిన 14 వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశానికి కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్ హాజరయ్యారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న బ్రిక్స్ ఇతివృత్తం 'కేవలం ప్రపంచ అభివృద్ధి కోసం బహుళపక్షవాద బలోపేతం'. రష్యా అధ్యక్షతన సమకాలీన సమస్యలపై ప్రతిపాదనను తీసుకువచ్చినందుకు శ్రీ సునీల్ బర్త్వాల్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిక్స్ లో కొత్త సభ్యత్వం పొందిన ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఎఇ దేశాలను స్వాగతించారు. ఈ ఏడాది జరిగిన ఫలప్రదమైన చర్చలలో పాల్గొన్నందుకు వారిని అభినందించారు.


ప్రపంచ వాణిజ్య సంస్థతో బహుళపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం, సంయుక్త వాల్యూచైన్స్ సమర్థనీయత, ఎంఎస్ఎంఈల మధ్య పరస్పర చర్యలను విస్తరణ, డిజిటలైజేషన్, ఈ-కామర్స్ పై భారత్ విజయ ప్రస్థానం , ప్రత్యేక ఆర్థిక మండలాల మధ్య సహకారం యొక్క ఔచిత్యాన్ని వాణిజ్య కార్యదర్శి సమావేశంలో వ్యక్తం చేశారు.

కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి బహుళపక్షవాద బలోపేతంపై, డబ్ల్యుటిఓ దీర్ఘకాలంగా అనిశ్చితిలో ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం సమిష్టి ప్రయత్నాలపై, ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రత్యేక, భిన్నత్వ చికిత్స గురించి ఆయన పునరుద్ఘాటించారు.  పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ కు త్వరితగతిన శాశ్వత పరిష్కారం, రెండంచెల వివాద పరిష్కార వ్యవస్థ ఏర్పాటు, డబ్ల్యూటీవో సూత్రాలు, లక్ష్యాలపై ఆధారంగా డబ్ల్యూటీవో సంస్కరణలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా డబ్ల్యూటీవోను ఉత్తేజపరచడం, 2025 నాటికి సంస్థ 30 ఏళ్లు పూర్తికాకముందే డబ్ల్యూటీవోకు కనీసం 30 నిర్వహణ మెరుగుదలలు తీసుకురావడం వంటి అంశాల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.  వికేంద్రీకరణ, వైవిధ్యీకరణ ద్వారా సరఫరా గొలుసు స్థితిస్థాపకతను బలోపేతం చేయడం, జీవీసీల కోసం జీ20 జనరిక్ మ్యాపింగ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా విలువ గొలుసుల్లో సహకారాన్ని పెంపొందించడం, సహకారానికి మార్గదర్శక సూత్రాలను రూపొందించడంపై ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ దిశగా తొలి అడుగుగా బిల్ ఆఫ్ లాడింగ్ వంటి డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ తో సహా కాగిత రహిత వాణిజ్యాన్ని ఆయన తెలిపారు

గ్రీన్ ట్రాన్సిషన, వాతావరణ స్థితిస్థాపకత కోసం అందరికీ అందుబాటులో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంపై సహకార అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ప్రధానంగా ప్రస్తావించారు. వాణిజ్యాన్ని ప్రభావితం చేసే వాతావరణ సంబంధిత ఏకపక్ష చర్యలపై కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రత్యేక బహుళపక్ష పర్యావరణ ఒప్పందాలు, ఎన్డిసి సూత్రాల ఉల్లంఘన, సిబిడిఆర్ సూత్రాలను విస్మరణ కింద హక్కులు, బాధ్యతలు రద్దు అవుతాయని ఆయన అన్నారు.


ఎంఎస్ఎంఈ సంబంధిత పరిణామాలు, గ్లోబల్ వాల్యూ చైన్స్ లో వాటి అనుసంధానంపై వాణిజ్య శాఖ కార్యదర్శి ప్రస్తావించారు. 2023 లో భారతదేశం అధ్యక్షతన జారీ చేసిన ఎంఎస్ఎంఈలకు సమాచార ప్రాప్యతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని జైపూర్ పిలుపును పునఃసమీక్షిస్తూ, బ్రిక్స్ సభ్యులలో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సమాచారాన్ని క్రోడీకరించడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా చొరవను ముందుకు తీసుకువెళ్ళినందుకు రష్యా అధ్యక్షతను ఆయన ప్రశంసించారు. బ్రిక్స్ సభ్యదేశాల్లో ఎంఎస్ఎంఈలు అంతర్భాగం కాబట్టి, ఎంఎస్ఎంఈలకు ఫలితాల ఆధారిత ఆదరణ కోసం సహకారం, సమిష్టి కృషి ప్రాధాన్యతను వాణిజ్య శాక కార్యదర్శి నొక్కి చెప్పారు. పరిశోధానభివృద్ధి, సాంకేతికత బదలాయింపు, జాయింట్ వెంచర్స్, వ్యాపార అభివృద్ధి అవకాశాల రూపంలో సహకారాన్ని అన్వేషించడం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సమ్మిళిత డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను వాణిజ్య శాఖ కార్యదర్శి సమావేశంలో ప్రధానంగా చెప్పారు. డిజిటల్ పారిశ్రామికీకరణలో భాగంగా ఓపెన్ సోర్స్ ఇండియా స్టాక్ ఆఫ్ క్రిటికల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం ద్వారా భారతదేశం సాధించిన విజయగాథను ప్రస్తావిస్తూ, ఓపెన్ యాక్సెస్, పారదర్శకత, డేటా రక్షణ, గోప్యతకు గౌరవం వంటి ప్రధాన సూత్రాల ఆయన తెలిపారు. చెల్లింపుల డొమైన్లలో ఇ-విప్లవం, ఈ-కామర్స్, జాతీయ గుర్తింపు, బ్యాంకింగ్, విద్య మొదలైన అంశాల పట్ల బ్రిక్స్ దేశాలతో అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లలో సహకారంపై రష్యా అధ్యక్షతన తీసుకున్న చొరవను వాణిజ్య శాఖ కార్యదర్శి అంగీకరించారు. సెజ్ ల ద్వారా కలిగే ఉపాధి అవకాశాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతులను పెంచడం, సమాచార మార్పిడి ప్రాముఖ్యతను, దానికి సంబంధించిన ఉత్తమ పద్ధతులను ఆయన నొక్కిచెప్పారు.

ముగింపులో, బ్రిక్స్ దేశాల ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తు కోసం  సహానుభూతి, అవగాహన సూత్రాల కింద సవాళ్లను ఎదుర్కోవటానికి  ఐక్యత, పారదర్శకతతో పాటు సహకార ప్రయత్నాలు, నిబద్ధత ప్రాముఖ్యతను వాణిజ్య శాఖ కార్యదర్శి నొక్కి చెప్పారు.

కేంద్ర వాణిజ్య మంత్రి సమావేశం గతంలో పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించిన జాయింట్ కమ్యూనికేషన్ తో పాటు 6 ఫలితాల పత్రాలను ఆమోదించింది.

వాణిజ్య శాఖ కార్యదర్శి బ్రిక్స్ టిఎంఎం సమావేశం సందర్భంగా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మాక్సిమ్ రెషెట్నికోవ్, బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (మినిస్టర్) సభ్యుడు, యురేషియన్ ఎకనామిక్ కమిషన్ ఆండ్రీ స్లెప్నేవ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డిప్యూటీ మంత్రి అలెక్సీ గ్రుజ్దేవ్, ఎఫ్ ఎస్ విపిఎస్ అధిపతి, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన సెర్గీ డాంక్వర్ట్, దక్షిణ ఆఫ్రికా వాణిజ్య, పరిశ్రమ మరియు పోటీ విభాగానికి డిప్యూటీ మినిస్టర్ జుకో గోడ్లింపి, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జీయూదీలతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్య సమస్యల సత్వర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కోసం చర్చించారు.

 

***



(Release ID: 2038819) Visitor Counter : 40