భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫేమ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు సబ్సిడీ

प्रविष्टि तिथि: 26 JUL 2024 3:38PM by PIB Hyderabad

ఫేమ్-ఇండియా పథకం రెండో దశ కింద ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు.  హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కొనుగోలు ధర ముందస్తు తగ్గింపు రూపంలో వినియోగదారులకు (కొనుగోలుదారులు/అంతిమ వినియోగదారులు) ప్రోత్సాహకం/రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. దీనిని భారత ప్రభుత్వం ఓఈఎంలకు (ఈవీ తయారీదారులకు) తిరిగి చెల్లిస్తుంది(రీయింబర్స్).

ఈ పథకం కింద ముందస్తు ధర తగ్గింపు రూపంలో డిమాండ్ ప్రోత్సాహకం లేదా సబ్సిడీ..హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాన్ని ఓఈఎంల నుంచి కొనుగోలు చేస్తున్న సమయంలో వినియోగదారుడికి బదిలీ అవుతుంది. గత ఐదేళ్లలో (01.04.2019 నుంచి 31.03.2024 వరకు) ఓఈఎంలు క్లెయిమ్ చేసుకున్న ప్రోత్సాహకానికి.. విభాగాల వారీగా రీయింబర్స్ చేసిన రాయితీ ఈ క్రింది విధంగా ఉంది:

 

క్రమ సంఖ్య

విభాగం

అందిన ప్రోత్సహాకం(రూ.కోట్లలో)

1

ఈ-2వీ

4,375.59

2

ఈ-3వీ

845.61

3

ఈ-4వీ

399.12

4

ఈ-బస్సులు *

1,322.00

 

మొత్తం

6,942.32

* రాష్ట్ర రవాణా సంస్థలకు విడుదలైన రాయితీ మొత్తం


ఈ మేరకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

***


(रिलीज़ आईडी: 2037864) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Tamil , Kannada