గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్వయం సమృద్ధి గ్రామవికాసం

Posted On: 26 JUL 2024 2:37PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం ఓ  ఆర్ డి ) బహుముఖ  వ్యూహాలను అవలంబించింది. ఉపాధి అవకాశాలను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత , సామాజిక భద్రత రక్షణ, గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి  కార్యక్రమాల ద్వారా గ్రామీణ భారతదేశాన్ని 'ఆత్మనిర్భర్'గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం (ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్), ప్రధానమంత్రీ ఆవాస్ యోజన - గ్రామీణ (పి ఎం ఏ వై -జి ), ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పి ఎం జి ఎస్  వై ), దిన్దాయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి  ఏ వై ఎన్ ఆర్ ఎల్  ఎం), దిన్దాయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి డి యూ -జి కే వై), జాతీయ సామాజిక సహాయం పథకం (ఎన్ ఎస్ ఏ పి), ప్రధాన మంత్రి కృష్ణి సించయీ యోజన (డబ్ల్యూ డి సి - పి ఎం కే ఎస్  వై) వంటి వివిధ గ్రామీణాభివృద్ధి పథకాలను వర్షాధారం/ నిస్సారమైన భూములను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం గా పనిచేస్తోంది.

 

గ్రామాల్లో పౌర సదుపాయాలను సృష్టించడానికి, పొలాలకు సమీపంలో మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు  ఈ మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది.  రోడ్డు అనుసంధాన లేని అర్హత కలిగిన గ్రామీణ ప్రాంతాలకు అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే రోడ్డు ద్వారా గ్రామీణ అనుసంధానాన్ని ఒకసారి ప్రత్యేక జోక్యం ద్వారా కల్పించడానికి భారత ప్రభుత్వం పి ఎం జి ఎస్  వై పథకం ప్రారంభించింది. గ్రామలలో కనీస మౌలిక సదుపాయాలైన పక్కా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేదరికాన్ని తొలగించే ఈ పథకం 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ పథకం ప్రారంభించబడినప్పటి నుండి 22.07.2024 వరకు మొత్తం 8,27,419 కి.మీ పొడవున రోడ్లను మంజూరు చేయడం జరిగింది, దీనిలో 7,65,512 కిమీ పొడవు రోడ్లను  పూర్తి చేయడం జరిగింది.

 

పి ఎం జి ఎస్  వై కింద  ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజనులకు (పి వి టీ జీ ) రోడ్డు అనుసంధానం కోసం ప్రత్యేకంగా కొత్త విభాగం ఇటీవలి ప్రారంభించబడింది. దీని లక్ష్యం 5 సంవత్సరాల (2023-24 నుండి 2027-28)  కాల వ్యవధి లో 8,000 కి.మీ. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీ ఎం జన్మన్) కింద 2,813.11 కి.మీ ఇప్పటికే మంజూరు చేయబడ్డాయి.

 

పి ఎం ఏ వై -జి పథకం కింద కనీస మౌలిక సదుపాయాల తో పక్కా గృహ నిర్మాణం కోసం సాయం అందించడం ద్వారా వారికి ఆత్మనిర్భర్ సాధించడం ప్రాథమిక లక్ష్యంగా తీసుకోబడింది. ఈ పథకం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఇతర పథకాలతో కలిపి లబ్ధిదారులకు మరుగుదొడ్డి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్ పి జి) కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, సురక్షితమైన మంచినీరు, పరిశుభ్రమైన విద్యుత్ కోసం సోలార్ రూఫ్‌టాప్, స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జిలు) లో సభ్యత్వం మొదలైనవి  లబ్ధిదారులకు అందించడానికి  నిబంధనలు రూపొందించబడ్డాయి. మొత్తం లక్ష్యం 2.95 కోట్లలో 2.94 కోట్లకు పైగా గృహాలు మంజూరు చేయబడ్డాయి మరియు 2.64 కోట్ల ఇళ్లు ఇప్పటికే నిర్మించారు. 

 

గ్రామీణాభివృద్ధి కేంద్ర మంత్రి, శ్రీ కమలేష్ పాశ్వాన్ రాజ్యసభలో లిఖతపూర్వకంగా ఇచ్చిన సమాధానం లో ఈ సమాచారం ఇచ్చారు.

***



(Release ID: 2037862) Visitor Counter : 38