సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారతదేశ 43 వ ఎంట్రీగా అహోం రాజవంశ సమాధుల వ్యవస్థ - మొయిడామ్స్
"యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మొయిడామ్స్ గుర్తింపు భవిష్యత్ తరాల కోసం మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది": శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
ఒకే దశాబ్దంలో భారతదేశంలో మొత్తం 13 వారసత్వ ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
అత్యధిక ప్రపంచ వారసత్వ సంపద కలిగిన దేశాల్లో ఆరవ స్థానంలో భారత్
"ప్రపంచ వేదికపై భారతదేశ వారసత్వాన్ని ఆవిష్కరించాలనే న్యూ ఇండియా అలుపెరగని ప్రయత్నానికి ఈ గ్లోబల్ గుర్తింపు ఒక నిదర్శనం": శ్రీ షెకావత్
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లో చేరిన తర్వాత భారత్ ఇప్పుడు తొలిసారిగా ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తోంది.
Posted On:
26 JUL 2024 3:58PM by PIB Hyderabad
భారతదేశానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక విజయం గా అస్సాం నుండి అహోం రాజవంశ సమాధులవ్యవస్థ ‘మొయిడామ్స్ ‘ కు అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. ఢిల్లీలో ఈ రోజు (2024, జూలై 26) వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ లో ఈ ప్రకటన చేశారు. ఇది భారత్ నుంచి యునెస్కో జాబితాలో చేరిన 43వ ప్రాపర్టీ .
ఇది 1985 లో సహజ కేటగిరీ కింద చేర్చిన కజిరంగా నేషనల్ పార్క్ ,మానస్ వన్యప్రాణి అభయారణ్యం తరువాత అస్సాం నుండి ఇది మూడవ ప్రపంచ వారసత్వ సంపద. అద్భుతమైన వాస్తుశిల్పం తో రాజ వంశ ఘనతను చాటుతూ , సంరక్షించబడుతున్న చరైడియో మొయిడామ్ లు పురాతన చైనాలోని ఈజిప్టు ఫారోల పిరమిడ్లు , రాజ సమాధులతో పోల్చదగినవి.
ఈ వారసత్వ ప్రదేశాలను యునెస్కో జాబితాలో చేర్చడం లోని ఉద్దేశ్యం - 195 దేశాలలో సాంస్కృతిక, సహజ , మిశ్రమ ఆస్తులలో కనిపించే ఒయువి(అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్) ల ఆధారంగా భాగస్వామ్య వారసత్వాన్ని పరిరక్షించడం ప్రోత్సహించడం. 2021-25 మధ్య ప్రపంచ వారసత్వ కమిటీలో సభ్యదేశంగా మారిన భారత్ ప్రస్తుతం యునెస్కో 1972 వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లో చేరిన తర్వాత తొలిసారిగా ఈ సదస్సుకు ఆతిధ్యమిస్తొంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ 46వ సదస్సు ఈ నెల 21న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు జరుగుతుంది.
ఈ వార్షిక సదస్సులో 150 కి పైగా రాష్ట్ర భాగస్వాములు పాల్గొంటున్నారు, vయునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ పై సంతకం చేసిన వీరంతా జాబితాలో చేర్చే కొత్త ప్రదేశాల ఎంపిక తో సహా ప్రపంచ వారసత్వానికి సంబంధించిన వ్యవహారాల నిర్వహణ బాధ్యత కలిగి ఉంటారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక గుర్తింపు చరైడియో అహోం రాజుల 700 సంవత్సరాల పురాతన గుట్ట తరహా ఖనన వ్యవస్థ ను ప్రపంచ దృష్టిని తీసుకువస్తుందని, ఇది అస్సాం , భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని హైలైట్ చేస్తుందని అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దిశగా మొయిడామ్స్ ప్రయాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. ఈ పురాతన కట్టడాలను 2023 లో భారతదేశ అధికారిక ఎంట్రీ గా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ మొయిడామ్ ల సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తుందని, ,ఇది మొదటి సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా, ఈశాన్యం నుండి ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన మూడవ మొత్తం ప్రదేశం అని ఆయన అన్నారు.
గత దశాబ్ద కాలంలో భారతదేశం 13 ప్రపంచ వారసత్వ ఆస్తులను విజయవంతంగా లిఖించిందని, ఇప్పుడు అత్యధిక సంఖ్యలో ప్రపంచ వారసత్వ ఆస్తులతో ప్రపంచవ్యాప్తంగా 6 వ స్థానంలో ఉందని మంత్రి తెలియజేశారు. భారత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పాలన్న న్యూ ఇండియా అలుపెరగని ప్రయత్నానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు నిదర్శనం.
మొయిడామ్ లను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం వాటి విశిష్ట విశ్వవ్యాప్త విలువకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసిఒఎం ఒఎస్) ఒక సాంస్కృతిక సంప్రదాయానికి మొయిడామ్ ల అసాధారణ సాక్ష్యాన్ని , మానవ చరిత్రలో ముఖ్యమైన దశలకు వారి ప్రాతినిధ్యాన్ని తెలియ చెప్పింది. ఈ చారిత్రక సంపదను పరిరక్షించడంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ), అస్సాం ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఇటువంటి స్మారక చిహ్నాల పరిరక్షణను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని శ్రీ షెకావత్ ఉద్ఘాటించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మొయిడామ్స్ గుర్తింపు భావితరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ఈ ప్రదేశాలను సందర్శించడం , మద్దతు ఇవ్వడం ద్వారా, మనం వాటి పరిరక్షణకు , భారతదే గొప్ప వైవిధ్యమైన చరిత్ర విస్తృత కథనానికి దోహదం చేస్తాము.
మొయిడామ్స్ గురించి - అహోం రాజవంశం గుట్ట సమాధుల వ్యవస్థ
ఈశాన్య భారతదేశంలో తాయ్-అహోం సృష్టించిన రాజ వంశ గుట్ట శ్మశానం - మొయిడామ్స్ తూర్పు అస్సాంలోని పట్కై పర్వత శ్రేణుల దిగువన ఉంది. ఈ సమాధి గుట్టలను తాయ్-అహోం పవిత్రంగా భావిస్తారు . ఇవి వారి ప్రత్యేకమైన అంత్యక్రియల ఆచారాలను ప్రతిబింబిస్తాయి. తాయ్ -అహోం ప్రజలు 13 వ శతాబ్దంలో అస్సాంకు వచ్చి చరైడియోను వారి మొదటి నగరంగా , రాయల్ నెక్రోపోలిస్ ప్రదేశంగా స్థాపించారు. క్రీ.శ 13 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం వరకు 600 సంవత్సరాల పాటు, తాయ్-అహోమ్ కొండలు, అడవులు , నీరు వంటి ప్రకృతి కారకాలను ఉపయోగించి ఒక పవిత్ర భౌగోళిక స్వరూపాన్ని సృష్టించడానికి మొయిడామ్లు లేదా "ఆత్మకు నిలయం" నిర్మించారు.
తమ రాజులను దైవంగా భావించిన తై-అహోం రాజ సమాధుల కోసం మొయిడామ్ లను నిర్మించే ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అభివృద్ధి చేశారు. అహోమ్‌ల సాంప్రదాయ కానానికల్ సాహిత్యం చాంగ్‌రుంగ్ ఫుకాన్‌లో పేర్కొన్న ప్రకారం.ఈ సమాధి దిబ్బలు/గుట్టలు మొదట్లో చెక్కతో, తరువాత రాతి తో, కాలిపోయిన ఇటుకలతో నిర్మించారు. తాయ్-అహోం సమాజ క్రమానుగత నిర్మాణాన్ని ప్రతిబింబిస్తూ, రాజ దహన సంస్కారాలు సంప్రదాయ వేడుకగా నిర్వహించేవారు.
20 వ శతాబ్దం ప్రారంభంలో నిధుల వేటగాళ్ల నుండి సవాళ్లు ఉన్నప్పటికీ, చరైడియో సమగ్రతను పునరుద్ధరించడానికి , పరిరక్షించడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , అస్సాం రాష్ట్ర పురావస్తు శాఖ కలిసి పనిచేశాయి. కేంద్ర , రాష్ట్ర నిబంధనల ద్వారా రక్షణతో, నిర్మాణ సమగ్రత , సాంస్కృతిక విశిష్టతను కాపాడటానికి ఈ ప్రదేశాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
https://drive.google.com/file/d/1rtKMVjRWIkiUr4UbGJQfYqGY3NmcZr2Z/view?usp=drivesdk
వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశం
2024 లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46 వ సెషన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 27 నామినేషన్లను పరిశీలిస్తోంది, వీటిలో 19 కల్చరల్, 4 నేచురల్, 2 మిక్స్ డ్ సైట్లు , ప్రస్తుత సరిహద్దులకు 2 ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అహోం రాజవంశానికి చెందిన గుట్ట సమాధుల వ్యవస్థ ఈ సంవత్సరం సాంస్కృతిక సంపద కేటగిరీ కింద భారతదేశం నుండి అధికారిక ఎంట్రీ పొందింది.
ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునెస్కో డైరెక్ట ర్ జనరల్ శ్రీమతి ఆడ్రీ అజౌలే, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్ట ర్ ఎస్ జైశంకర్ , సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల సాంస్కృతిక మంత్రులు, రాయబారులు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక శాఖ మంత్రులు పాల్గొన్నారు.
***
(Release ID: 2037861)
Visitor Counter : 436