యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారతదేశ కీర్తి ప్రతిష్టల కొరకు ప్రయాణం


2024 ఒలింపిక్ టీమ్ ను కలుసుకోండి

Posted On: 25 JUL 2024 3:38PM by PIB Hyderabad

భారతదేశం 2024 పారిస్ ఒలింపిక్స్ కు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దేశం ఆశలు, కీర్తి ప్రతిష్టలు వైవిధ్యమైన ప్రతిభావంతులైన అథ్లెట్ల జట్ల పై ఉన్నాయి. హాకీ, అథ్లెటిక్స్ నుండి ఈక్వెస్ట్రియన్, సేలింగ్ వంటి కొత్త రంగాలకు విస్తరించిన  టీమ్ ఇండియా అంతర్జాతీయ క్రీడల రంగంలో ఆశాజనకంగా ఉంది. భారీ నిధులు, ప్రత్యేక సంసిద్ధత  కార్యక్రమం సుశిక్షుతులైన ఈ అథ్లెట్లు కేవలం పతకాల కొరకు మాత్రమే పోటీ పడటం లేదు, వారు  దేశ గౌరవం కీర్తి ప్రతిష్టల కొరకు కూడా పోటీ పడుతున్నారు. పారిస్ లో భారతదేశం తరఫున పోటీ పడే అథ్లెట్లు ,క్రీడలను ఈ ఫీచర్ హైలైట్ చేస్తుంది.

భారత 2024 ఒలింపిక్స్ టీమ్:



పురుషుల హాకీ జట్టు:

2024 పారిస్ ఒలింపిక్స్ కు  ఈ క్రింది ఆటగాళ్లు భారత పురుషుల హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తునారు.

శ్రీజేష్ పిఆర్
హర్మన్ప్రీత్ సింగ్
జర్మన్ప్రీత్ సింగ్
అమిత్ రోహిత్దాస్
సంజయ్
సుమిత్
రాజ్ కుమార్ పాల్
శంషేర్ సింగ్
మన్ప్రీత్ సింగ్
హార్డిక్ సింగ్
వివేక్ సాగర్ ప్రసాద్
అభిషేక్
సుఖ్జీత్ సింగ్
గుర్జంత్ సింగ్
లలిత్ కుమార్ ఉపాధ్యాయ
మందీప్ సింగ్
కృష్ణ బి పాఠక్
జుగ్రాజ్ సింగ్
నిలకంట శర్మ

ఎంతో నైపుణ్యమున్న ఈ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో  సగౌరవంగా, దృఢ సంకల్పంతో భారతదేశం తరఫున  ప్రాతినిధ్యం వహిస్తుంది.

జుడో:

 

 

 



మహిళల +78 కిలోల జూడో విభాగంలో తూలికా మాన్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సవాలుతో కూడిన ఈ క్రీడలో తన శక్తి, సాంకేతికతను మిళితం చేస్తూ భారతదేశానికి పతకం  సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

రోయింగ్:

 



పురుషుల సింగల్స్ స్కల్స్ ఈవెంట్ లో ప్రముఖ క్రీడాకారుడు  బాల్రాజ్ పాన్వార్ భారతదేశ ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ జలక్రీడలో తన శక్తి, శ్రమని రంగరించి పోడియం స్థానం సాధించాలని ఆశిస్తున్నారు.

సైలింగ్ :



భారతదేశ సైలింగ్ విభాగంలో విష్ణు సారవణన్, నేత్రా కుమనన్ ప్రతినిదులుగా  ఎంపికయ్యారు. ఈ ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచారు.  తమ కృషి, నైపుణ్యాలు, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించడం ద్వారా పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

షూటింగ్:



భారత షూటింగ్ జట్టులో మాను భాకర్, ఈశా సింగ్, రిథం సంగవన్, అనిష్ భాన్వాళా, విజయ్ వీర్ సిద్ధు వంటి అనుభవశాలురు, యువ షూటర్లు ఉన్నారు. జట్టులో సిఫ్ట్ కౌర్ సాంరా, అంజుమ్ మౌడిగల్, ఆశ్వర్య ప్రతాప్ సింగ్ టోమార్ వంటి షార్ప్ షూటర్లు  వివిధ రైఫిల్, పిస్టల్ ఈవెంట్లలో పోటీ పడుతున్నారు. షూటింగ్ లో భారతదేశ ఘన చరిత్రను కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు.

స్విమ్మింగ్:

 



దినిధి దేశింగు, శ్రీహరి నారాయణ  స్విమ్మింగ్ ఈవెంట్లలో భారతదేశ ప్రతినిధులు గా ఎంపికయ్యారు. ఈ ఇద్దరు స్విమ్మర్లు కూడా తమ టైమింగ్స్ ని క్రమంగా మెరుగుపరుచుకుంటున్నారు. అలాగే  ఈ సారి కొత్త రికార్డులు సృష్టించాలని ఆశిస్తున్నారు.


టేబుల్ టెన్నిస్:



శరత్ కమల్, హర్మేత్ దేశాయ్ వంటి అనుభవజ్ఞులైన  క్రీడాకారులున్న భారత టేబుల్ టెన్నిస్ జట్టులో మానికా బాత్రా, శ్రీజా అకులా వంటి మహిళా క్రీడాకారులు ఉన్నారు. జట్టులో సతీయన్ జి, అయిహికా ముఖర్జీ కూడా  అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నారు.

టెన్నిస్:



భారతదేశ టెన్నిస్ జట్టులో రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలజీ, సుమిత్ నాగల్  ప్రతినిదులుగా ఎంపికయ్యారు. అనుభవం ఉన్న ఈ క్రీడాకారులు తమ విభాగాల్లో మంచి ప్రదర్శనలను అందించాలని ఆశిస్తున్నారు.

వెయిట్ లిఫ్టింగ్ :

 

 [

మణిపూర్‌కు చెందిన మిరాబై చాను 49 కేజీ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీ పడుతున్నారు. ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేతగా, తన అత్యుత్తమైన శక్తి , నైపుణ్యాలను ప్రదర్శిస్తూ  మరొక పోడియం స్థానం సాధించడానికి సిద్ధంగా వున్నారు.

రెస్లింగ్

 



వీనెష్ ఫోగాత్, అంశు మాలిక్ వంటి ప్రముఖ క్రీడాకారులు భారత రెస్లింగ్ జట్టులో వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నారు. రీతికా హుడా, నిషా దేవి, అమన్ సేహ్రావత్ కూడా జట్టులో ఉన్నారు. రెస్లింగ్ లో తిరిగి విజయం సాధించాలని ఆశిస్తున్నారు.

ఆర్చరీ:

 

భారత ఆర్చరీ జట్టులో దీపికా కుమారి, భాజన్ కౌర్, అంకిత భాకత్, దిశ్రజ్ బోమ్మేదేవర, ప్రావీన్ జాదావ్, తరునీప్ రై  ఉన్నారు. వారు తమ అనుభవం, నైపుణ్యంమేళవించి, అత్యుత్తమతను సాధించాలని ఆశిస్తున్నారు.

అథ్లెటిక్స్:


ప్రముఖ జావలీన్ థ్రోయర్ నీరజ్ చోప్రా తో పాటు పలువురు రేస్ వాకింగ్, స్టీప్లచేస్, రిలే ఈవెంట్లలో పోటీ పడుతున్నారు.

బాడ్మింటన్:

 

 



పి వి  సింధు, హెచ్ ఎస్ ప్రాణోయ్ వంటి స్టార్స్, సాత్వికసైరాజ్ రంకి రెడ్డి , తానిషా క్రేస్తో, అశ్విని పొన్నప్ప, లక్ష్య సేన్, చిరాగ్ శెట్టి  సభ్యులుగా ఉన్న ఈ జట్టు భారతదేశం సింగిల్స్, డబుల్స్ ఫార్మట్స్ లో  బాడ్మింటన్ లో భారతదేశ శక్తి సామర్ధ్యాలను ఉన్నతంగా  ఉంచుతుంది.

బాక్సింగ్ జట్టు

 



ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఇతర బలమైన పోటీదారులు లవ్లినా బోర్గోహైన్, అమిత్ పంఘాల్ ఈ జట్టులో ఉన్నారు. ఈ జట్టు  బలమైన భారతదేశ బాక్సింగ్ సాంప్రదాయాన్ని    కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.

ఈక్వెస్ట్రియన్



 దేశంలో ఈక్వెస్ట్రియన్ క్రీడా పై  పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తూ అనుష్ అగర్వాల్లా  డ్రెసేజ్ లో భారతదేశానికి  ప్రతినిధిగా ఎంపికయ్యారు. అనుష్ ఈ విభాగంలో భారతదేశ సామర్థ్యాన్ని హైలైట్ చేయాలని ఆశిస్తున్నారు.

గోల్ఫ్



గగన్జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ, అదితి అశోక్, దిక్షా దాగర్ లతో కూడిన భారత గోల్ఫ్ జట్టు అంతర్జాతీయ గోల్ఫ్ లో స్ట్రోక్ ప్లే  ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శనలతో గుర్తింపు పొందాలని ఆశిస్తుంది.

నైపుణ్యం, పట్టుదల, మిలియన్ల పైగా అభిమానుల మద్దతుతో భారత జట్టు పారిస్ లో గుర్తుంచుకోదగిన విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉంది.

రిఫరెన్సులు

 

https://olympic.ind.in/athletes-hub

Pathway to Paris: Pathway to Paris final.pdf

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2035199

https://x.com/WeAreTeamIndia/status/1805546480792748136/photo/1

https://x.com/WeAreTeamIndia/status/1814305768683745319/photo/1

https://x.com/WeAreTeamIndia/status/1814626948426924348/photo/3

 https://x.com/Media_SAI/status/1577931538435637249/photo/1

 https://x.com/WeAreTeamIndia/status/1815787826359021945/photo/2

https://x.com/WeAreTeamIndia/status/1806294425985040564/photo/1

https://x.com/WeAreTeamIndia/status/1801537500000698632/photo/1

https://x.com/DDNational/status/936169759858503680/photo/2

***



(Release ID: 2037223) Visitor Counter : 7


Read this release in: English , Hindi , Kannada