ఉక్కు మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2024-25 పై ఆర్ఐఎన్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటన
प्रविष्टि तिथि:
24 JUL 2024 12:05PM by PIB Hyderabad
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్పొరేట్ సంస్థ ‘‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)’’ ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తున్న, ‘నవరత్న’ హోదా కలిగి ఉన్న ఒక ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ఇ).
ఆర్ఐఎన్ఎల్ సిఎమ్‌డి శ్రీ అతుల్ భట్ కేంద్ర బడ్జెట్ 2024-25 పై తన ప్రతిస్పందన ను తెలియజేస్తూ, ఒక ప్రకటనలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
‘‘కేంద్ర బడ్జెట్ 2024-25 లో ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ నోడ్స్ తో పాటు ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి సంబంధించి న కీలక అంశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు ఆ ప్రాంతంలో ఉక్కు వినియోగాన్ని చెప్పుకోదగిన స్థాయిలో ప్రోత్సహించి, ప్రాంతీయ అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయన్న ఆశలు రేకెత్తుతున్నాయి. దీనికి తోడు, పట్టణ ప్రాంతాలలో గృహ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ధి తదితర అంశాలకు బడ్జెట్ ప్రాముఖ్యతనివ్వడం కూడా స్థానికంగా ఉక్కు వినియోగాన్ని పెంచి, ఉక్కు పరిశ్రమకు ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించనుంది. ఈ ప్రాజెక్టులకు అండదండలను అందించడంతో పాటు దేశ వృద్ధి ప్రక్రియకు తోడ్పాటును ఇవ్వడానికి కూడా ఆర్ఐఎన్ఎల్ కట్టుబడి ఉంది.’’
***
(रिलीज़ आईडी: 2037039)
आगंतुक पटल : 75