వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ లో 2023-24 పంట సీజన్ కోసం వేలం కేంద్రాలలో నమోదైన పెంపకందారులు ఉత్పత్తి చేసిన అదనపు ఎఫ్ సి వి పొగాకును విక్రయించడానికి అనుమతించడం
తుపాను వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిర్ణయం
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2024 5:44PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ లో అన్నిరకాల నేల ప్రాంతాలలో 15028.09 హెక్టార్లలో జరిగిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని వేలం కేంద్రాల్లోని రిజిస్టర్డ్ పెంపకందారులు ఉత్పత్తి చేసిన అదనపు ‘ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా’ పొగాకును పొగాకు బోర్డ్ వారి కేంద్రాలలో ఎలాంటి అదనపు సేవా రుసుములు లేకుండా, సాధారణ వర్తించే సేవా రుసుములతోనే విక్రయించడానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆమోదం తెలిపారు. 2023 డిసెంబర్ 3 నుండి 5 వరకు "మిచాంగ్" తుఫాను వర్షాల కారణంగా ప్రధాన పొగాకు క్షేత్రాలలో మొక్కల్ని తిరిగి నాటడం / ఖాళీలు నింపడం కోసం రైతులకు అదనపు ఖర్చు ఒనగూడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ పంట సీజన్ లో 43125 మంది రైతులు 97127.07 హెక్టార్లలో ఎఫ్ సివి పొగాకును సాగు చేసి 205.5 మిలియన్ కిలోల పంటను ఉత్పత్తి చేశారు.
2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్ వేలం కేంద్రాల్లో రిజిస్టర్డ్ పెంపకందారులు ఉత్పత్తి చేసిన అదనపు ‘ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా’ పొగాకును విక్రయించడంపై సున్నా జరిమానా దృష్ట్యా తుఫాను వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులకు జరిగిన నష్టం నుండి కోలుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఎఫ్ సివి పొగాకు రైతులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడిన ఆర్థిక దుస్థితిని అధిగమించడానికి చేయూతనిచ్చి, పెంపకందారులు తమ జీవనోపాధిని కొనసాగించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2036714)
సందర్శకుల సూచీ సంఖ్య : : 106